Kidney stones Leaf కిడ్నీలో రాళ్లను కరిగించే ఆకు

Kidney stones Leaf కిడ్నీలో రాళ్లను కరిగించే ఆకు

0 0
Read Time:2 Minute, 48 Second

కిడ్నీలో గాని మూత్ర నాళాల్లో గాని రాళ్లు (స్టోన్స్) ఏర్పడిన కొంత మంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొంత మంది వేలాది రూపాయలు ఆసుపత్రులకు వెచ్చించి ఆపరేషన్ చేయించుకుంటారు. మరికొంత మంది రాళ్లు ఏర్పడిన వారు స్టోన్స్ కరిగి పోవడం కోసం మందులు వాడుతుంటారు. రాళ్ల సైజును బట్టి కొంతమందికి కరిగిపోవడం జరుగుతుంటుంది. మరికొంత మందికి ఆపరేషన్ తప్పనిసరి అవుతుంది. కాగా రాళ్లను కరిగించడానికి ఆయుర్వేదంలో మందు ( Kidney stones Leaf ) వినియోగిస్తున్నారు.


పూర్వీకుల నుండి చెట్ల మందులు ఆలస్యంగా నైనా ఎక్కువగా పనిచేస్తాయని వాడుతుంటారు. అందుకు నిదర్శనమే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడం కోసం కొండపిండి ఆకు ( Kidney stones Leaf ) ని వినియోగిస్తున్నారు. ఈ ఆకు పేరు ఎలా వచ్చిందో కానీ పేరులోనే ఉంది కొండను పిండి చేసే చెట్టు.


5 నుండి 8mm లోపు సైజు రాళ్లు కిడ్నీలో ఏర్పడినట్లు నిర్ధారణ కాగానే కొండపిండి ఆకు Konda Pindi Aku రసం తాగడం ప్రారంభించాలి.


ఉదయం పూట పరగడుపున కొంత కొండపిండి ఆకు ను తీసుకొని దంచుకొని లేదా మిక్సీ లో టీ కప్పు రసం తయారు చేసుకొని అందులో టీ స్పూన్ జీలకర్ర, నవ్వోతు (పటికబెల్లం) పొడిగా తయారు చేసుకొని కలుపుకొని 5 రోజుల పాటు సేవిస్తే 15 రోజుల వరకు రాళ్లు కరిగి పోవడం లేదా రాళ్లు పడిపోవడం జరుగుతుంది. అంతకన్నా ఎక్కువ రోజులు త్రాగిన కలిగే నష్టమేమీ ఉండదు. ఈ విషయాన్ని కొంత మంది విశ్వసించక పోవచ్చు గాని ముమ్మాటికి వాస్తవం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ రసంతో చాలా మందికి రాళ్లు పడిపోవడం, కరిగిపోవడం జరుగుతుంది. కాగా కొండ పిండి ఆకులు కూరగా కూడా వండుకొని తింటే మంచి ఫలితాలుంటాయని వినియోగించిన వారిని అడిగితే తెలుస్తుంది. అయితే కొండపిండి ఆకు ఎక్కడ దొరుకుతుంది అనే విషయాన్ని తెల్సుకుంటే రాళ్ల నొప్పితో బాధపడే వారి బాధలు పరిష్కారమైనట్లే.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *