Anemia.. వేధించే రక్తహీనత.. సులువుగా అధిగమిద్దాం ఇలా..

Anemia.. వేధించే రక్తహీనత.. సులువుగా అధిగమిద్దాం ఇలా..

0 0
Read Time:2 Minute, 54 Second

Anemia Remedies ఈ సమస్యకు వయసుతో నిమిత్తం లేదు. అన్ని వయసుల వారినీ వేధిస్తుంటుంది. ముఖ్యంగా మహిళలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఏ చిన్న పని చేసినా అలసటగా అనిపించడం, కొంచెం దూరం నడవగానే ఆయాసం, నీరసం రావడం ఇవన్నీ కనిపించే లక్షణాలు.. ఇవన్నీ శరీరంలో తగినంత రక్తం లేకపోతే జరుగుతుంటాయి. బాడీకి కావలసిన ఐరన్‌ సమపాళ్లలో లేనప్పుడు రక్తహీనత సంభవిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారు.

లక్షణాలు
ఈ లక్షణాలు కనిపిస్తే రక్త హీనత ఉన్నట్లు భావించాల్సిందే..
* అలసటగా ఉండడం
* బలహీనంగా కనిపించడం
*
పాలిపోయిన పసుపు రంగు చర్మం
*
గుండె సక్రమంగా కొట్టుకోకపోవడం
*
శ్వాసలో ఇబ్బందులు
*
తరచుగా మైకం వచ్చినట్లు అనిపించడం
*
తేలికపాటి తలనొప్పి
*
ఛాతి నొప్పి
*
చేతులు, కాళ్లు చల్లబడడం

Anemia Remedies

పరిష్కారమేమిటి? Anemia Remedies

ఏ సమస్య కనిపించినా వెంటనే ఆసుపత్రికో మెడికల్‌ షాపులకో పరిగెడుతుంటాం. టాబ్లెట్లు వాడే బదులు ఇంట్లోనే ఐరన్‌ సంబంధిత పదార్థాల ద్వారా బ్లడ్‌ లెవల్స్‌ పెంచుకునే విధానాలూ ఉన్నాయి.
వాల్‌నట్స్‌ లడ్డూలు : వాల్‌ నట్స్‌లో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. తెల్ల నువ్వుల్లో కూడా ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇక బెల్లం ఇందులో కూడా ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ మూడు పదార్థాలు కలిపి లడ్డూలు తయారు చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక కప్పు నువ్వులు దోరగా వేయించుకుని పొడి చేసుకోవాలి. కప్పు వాల్‌ నట్స్‌ కూడా పొడి చేయాలి. తగినంత బెల్లం తీసుకుని మూడు కలిపి కొద్దిగా ఆవునెయ్యి జోడించి లడ్డూలు కట్టాలి. వీటిని రోజుకొకటి తింటూ ఉంటే రక్తహీనత సమస్య తొలగిపోతుంది. ఈ లడ్డూ రక్త హీనత సమస్యను తగ్గించడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. చిన్నారుల ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది.
రక్తహీనత తొలగించే ఆహారాలు : దానిమ్మ గింజలు, అరటింపడ్లు, తృణధాన్యాలు, టమాటాలు, చిక్కుళ్లు, ఖర్జూర పండ్లు, బీట్‌రూట్‌ జ్యూస్, ఆపిల్‌ జ్యూస్, ఆకుకూరలు

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *