SVBC channel వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గరనుంచి తెలుగుదేశం నుంచి తరచుగా మతపరమైన విమర్శలు వినిపిస్తున్న సంగతి అందరకూ తెలిసిందే. ముఖ్యమంత్రి కుటుంబం క్రైస్తవ మతాన్ని అనుసరిస్తుంది కాబట్టి ఆయన హిందూ వ్యతిరేకి అన్నట్లుగా.. హిందూ దేవుళ్ల పట్ల ఆయనకు తగినంత శ్రద్ధ లేనట్లుగా తెలుగుదేశం నాయకులు విమర్శలు చేస్తుంటారు. తిరుమలపై అన్యమత ప్రచారం జరుగుతోందని, తిరుమల కొండలపై శిలువ బొమ్మలు ఉన్నాయని ప్రచారం చేశారు. అవన్నీ వట్టిదేనని తేలింది.
అంతెందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కూడా తెలుగుదేశం పార్టీ ఇలాంటి ప్రచారాలే చేసింది. తిరుమల ఏడు కొండలను అమ్మేయడానికి రంగం సిద్ధమయిపోయిందని ఆరోపించారు. రెవెన్యూకు సంబంధించి ఓ జీవోను సాకుగా చేసుకుని ముఖ్యమంత్రిపై విమర్శలు చేశారు. దాంతో ఆ జీవోను రద్దుచేయడమే కాకుండా తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఏడు కొండలపై పూర్తి క్లారిటీ ఇస్తూ వైఎస్ ప్రత్యేకంగా ఒక జీవో కూడా జారీ చేశారు..
వైఎస్ కుటుంబం ఆచరించే మతమేదైనా కూడా అన్ని మతాలనూ గౌరవిస్తుంటుంది. అన్ని మత విశ్వాసాలనూ సమానంగా చూస్తారు. ఈ విషయం పలుమార్లు రుజువయ్యింది. పుష్కరాల సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించడంలోనూ, వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించడంలోనూ వారి నిబద్దత కనిపిస్తుంటుంది. బయట వినిపించే ప్రచారాలకు అది పూర్తి భిన్నం. పూజలు చేసే సమయంలో చెప్పులు విప్పడం నుంచి పవిత్రతను కాపాడేలా శుచి శుభ్రతలను పాటించడం వరకు వైఎస్ చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఆయన కుమారుడు జగన్ కూడా ఆ ఒరవడిని కొనసాగిస్తున్నారు. కానీ చంద్రబాబు బూట్లు కూడా విప్పకుండా కొబ్బరికాయలు కొట్టడం, పూజలు చేయడం గురించి చాలా వీడియోలు వచ్చాయి. వరుసగా ఐదేళ్ల పాటు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా రెండేళ్లపాటు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇలా ఒకే కుటుంబంలో ఇలాంటి అవకాశం దక్కింది వైఎస్ కుటుంబానికే కావడం విశేషం.
ఇటీవలి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల పర్యటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్వీబీసీ SVBC channel కన్నడ, హిందీ చానెల్స్‌ను ప్రారంభించారు. అసలు ఎస్వీబీసీ భక్తి చానెల్ ప్రారంభమయ్యిందే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కావడం గమనార్హం. అపుడు ఆ చానెల్ ఎందుకు ఖర్చు దండగ అని సాక్షాత్తూ అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వాదించారు. ‘‘ భక్తి చానెల్ అవసరమేమొచ్చింది. 15 చానెల్స్ ఉన్నాయి. అడిగితే రెండు మూడు గంటలు వెంకటేశ్వరస్వామి ప్రమోషన్ చేసే పరిస్థితి ఉంది. 42 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. మీకేమన్నా మతి ఉందా?’’ అని చంద్రబాబు వాదించారు. ఈ క్లిప్పింగ్ ఇపుడు సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది.
అంటే హిందువునని చెప్పుకునే చంద్రబాబు భక్తి చానెల్ SVBC channel ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే క్రిస్టియానిటీని అనుసరించే వైఎస్ కుటుంబం భక్తి చానెల్‌ను ప్రారంభించడమే కాక ఆ చానెల్‌ను అన్ని భాషల్లోకి విస్తరించింది. అలాగే చంద్రబాబు హయాంలోనే పుష్కరాల పేరు చెప్పి విజయవాడలో రోడ్లను విస్తరించి దాదాపు 40 దేవాలయాలను కూల్చేశారు. వాటిలో మెజారిటీ ఆలయాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ రెండేళ్లుగా పునరుద్ధరిస్తూ వస్తోంది. ఇంకా పూజారులతో పాటు పాస్టర్లకు, ఇమామ్‌లకు, మౌజంలకు ప్రత్యేక భృతి అందిస్తున్నారు. కానీ ఇలాంటి విషయాలను తెలుగు మీడియా బయటకు చెప్పదు.