జగనన్న ఇళ్ల నిర్మాణం.. కోర్టు తీర్పు.. వాదనలు వాస్తవాలు..

జగనన్న ఇళ్ల నిర్మాణం.. కోర్టు తీర్పు.. వాదనలు వాస్తవాలు..

0 0
Read Time:10 Minute, 31 Second

పేదల ఇళ్లకు ( Navaratnalu Jagananna illu ) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రణాళిక ఏదైతే ఉందో.. 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి హైకోర్టు తీర్పు ద్వారా పెద్ద దెబ్బ తగిలింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం కంటే లక్షలాది పేద కుటుంబాల ఆశలు ఆవిరి అయ్యేట్లుగా, వారి కలలు సాకారం అవుతున్నాయనుకున్న సమయంలో, అసలు జరుగుతుందా లేదా? మళ్లీ ఖర్చు ఎంత అవుతుందో అనేలా పేదవర్గాల్లో ఆందోళనలు నెలకొన్నాయి.

పేదల ఇళ్ళ నిర్మాణంపై అడ్డగోలు కారణాలు చూపి పిటిషన్లు వేసినవారు… తీరా, కోర్టుల్లో వేసిన పిటిషన్లతో తమకు సంబంధం లేదని, తాము అసలు పిటిషన్లు వేయలేదని ముందుకు రావడం చూస్తుంటే.. దాని వెనుక ఎవరున్నారు? దుష్ట పన్నాగాలతో కొద్దిమంది రాజకీయ శక్తులు తెర వెనక ఉండి వికృత క్రీడకు తెర తీశారని భావించాల్సి వస్తోంది. కోర్టులో న్యాయమే గెలుస్తుంది. దానిలో ఎలాంటి సందేహం లేదు.

ఇల్లు Navaratnalu Jagananna illu అనేది అత్యంత మౌలిక అవసరం. రాష్ట్రంలో అయిదు కోట్ల మంది జనాభా ఉంటే వాళ్లలో 30లక్షల మంది ఇళ్లు లేనివాళ్లు ఉన్నారని వచ్చిన దరఖాస్తుల ద్వారా తేటతెల్లం అయింది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇంకా సొంత ఇళ్లు లేనివాళ్లు ఇన్ని లక్షల మంది ఉన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి హయాం తర్వాత.. ఇంత భారీ యజ్ఞాన్ని దేశ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో గృహ నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు శరాఘాతంగా తగిలింది.

ఒక్కసారి ఇంత భారీ ఎత్తున పేదలకు పక్కా ఇళ్ళ నిర్మాణం చేస్తున్నప్పుడు, భవిష్యత్తులో ఇల్లు లేదని ఎవరూ చేయి ఎత్తకూడదని, గతంలోలా మాదిరిగా ఇంటి స్థలంగానీ, ఇల్లుగానీ డీ-పట్టా కాకుండా, యాజమాన్య హక్కులు ఇచ్చి, ఆ తర్వాత అమ్ముకోవడానికి, మార్టిగేజ్‌ చేయడానికి వీలుగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాలు తెలుసుకుని, పేదలకు ఇళ్ళు ఇవ్వడమే కాకుండా, కాలమాన పరిస్థితులను బట్టి, వారి భవిష్యత్‌ ప్రణాళికలకు అనుకూలంగా, తమ ఆస్థిగా వాడుకోవడానికి వీలు కల్పిస్తూ అందులోనూ మహిళల పేరు మీదే ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే జీవోలు జారీ చేయడం జరిగింది. ఇంత భారీఎత్తున పేదల ఇళ్ళ నిర్మాణం చేపట్టడం వల్ల అవి కాలనీలుగా కాకుండా, 15వేల ప్రదేశాల్లో ఊళ్లకు ఊళ్లు ఏర్పడుతున్నాయని మీడియాలోనే కథనాలు వస్తున్నాయి. మోడ్రన్‌ విలేజ్‌ ఎలా ఉండాలో ఆ విధంగా తయారుచేసేలా ఒక యాంబిషియస్‌ ప్లాన్‌తో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కు రూ.32వేల కోట్లు కేటాయించి, ఇప్పటికే దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చు చేశారు.

గతంలో పేదలకు ఇళ్లు నిర్మిస్తే అక్కడ రోడ్లు ఉండవు, ఒకవేళ ఇళ్లు కట్టే సమయానికి వేసినా రోడ్లు పోవడం, ఊరిబ యట ఇళ్లు కడితే అక్కడ మౌలిక సదుపాయాలు లేక, నివాసయోగ్యంగా లేకపోవడం, పెట్టిన డబ్బు అంతా వృథాగా పోవడం, మరోవైపు అసాంఘిక శక్తులకు అడ్డగా మారడం.. ఇటువంటివన్నీ మీడియాలో వచ్చే వార్తలు చూస్తూనే ఉన్నాం. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లబ్ధిదారులకు అన్ని విధాలా యోగ్యమైనవిగా ఉండే ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం Navaratnalu Jagananna illu చేపట్టడం జరుగుతోంది.

లక్షలాది మంది పేదల సొంతింటి కల సాకారం అయ్యే దశలో, ఎక్కడ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే దుగ్ధతో, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ పన్నిన కుట్రే ఇది. ఎవరి పేరుతోనే అఫిడవిట్‌లు ఉన్నవాటిని తెచ్చి వాటిని కోర్టులో వేసి, గృహ నిర్మాణాలు ఆపివేయించాలనే ప్రయత్నం చేశారు, దీన్ని టీడీపీ కుట్రగానే భావిస్తున్నారు.

ఈ ప్రభుత్వం ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదు.. కాబట్టి న్యాయం నిలబడుతుంది. కోర్టు చెప్పినట్లు ఇంటి నిర్మాణానికి సెంటు, సెంటున్నర ఎలా సరిపోతాయనుకున్నారో.. నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఎన్‌బీసీ) ప్రమాణాలను ఫాలో కావడం, దానికన్నా ఎక్కువే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దూరదృష్టితో జాతీయ ప్రమాణాలకు నిబంధనలకు అనుగుణంగా నివాసయోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకుంది.

గతంలో పేదల ఇళ్ళ నిర్మాణానికి Navaratnalu Jagananna illu సంబంధించి.. ప్లింత్‌ ఏరియా తీసుకుంటే.. అప్పట్లో ఇందిరమ్మ ఇళ్లు 215 చదరపు అడుగులలో కడితే, చంద్రబాబు నాయుడు హయాంలో 224 చదరపు అడుగులలో నిర్మించారు. అయితే , ఇవాళ నవరత్నాల్లో భాగంగా పేదలకు నిర్మిస్తున్న ఇళ్లు వరండాతో కలుపుకుని 340 చదరపు అడుగులు. ఇవి కాకుండా సెట్‌బ్యాక్‌, సైడ్‌ సెట్‌బ్యాక్‌ ఇవ్వడం జరిగింది.

  • నేషనల్‌ బిల్డింగ్‌ స్క్రీమ్‌ ప్రకారం చూస్తే… మొత్తంగా 221.9 చ.అడుగులు సరిపోతుందంటే… ఏపీలో ఇస్తున్నది 225.81 చదరపు అడుగులు. మన రాష్ట్రంలో స్థలం ఎంత ఇస్తున్నామో చూస్తే.. 31.72 చ. మీటర్ల ఉంటే.. అదే ఇతర రాష్ట్రాల్లో… అరుణాచల్‌ ప్రదేశ్‌లో లో 25 చ. మీటర్లు, యూపీలో 27.1చ. మీటర్లు, ఉత్తరాఖండ్‌ లో 27చ. మీటర్లు, నాగాలాండ్‌ లో 27.17చ. మీటర్లు, ఒడిశాలో 28.07చ. మీటర్లు, తమిళనాడులో 28.25 చ. మీటర్లు, జార్ఖండ్‌ లో 28.42 చ. మీటర్లు, జమ్మూ- కశ్మీర్‌ లో 29.05 చ. మీటర్లు ఉన్నాయి.
  • స్థలం పరంగా చూసినా మిగతా రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో 31.72 చ. మీటర్ల మేరకు ఇస్తూ, చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాం. అదే ప్లింత్‌, కార్పెట్‌ ఏరియా చూసినా నేషనల్‌ గైడ్‌లైన్స్‌ను దాటి కడుతున్నాం. అయినా టీడీపీ కోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది.
  • దీనికన్నా మించి క్లాసిక్‌ ఎగ్జాంపుల్‌ గా టిడ్కో ఇళ్లును తీసుకోవచ్చు. 300 చదరపు అడుగులతో గ్రౌండ్‌ ప్లస్‌ త్రీతో టీడీపీ సర్కార్‌ ఇస్తే… మా ప్రభుత్వం ఓపెన్‌ ఏరియాతో 340 చదరపు అడుగులతో సొంత ఇల్లు ఇస్తున్నాం. ఏమైనా ఏక్సిడెంట్లు, పర్యావరణం ముప్పు వాటిల్లేది పిచ్చుక గూళ్లు, పావురాల గూడుల్లా ఉన్న టిడ్కో ఇళ్లల్లో జరగాలి కానీ, ఓపెన్‌ ఏరియాలో ఉన్న ఇండిపెండెంట్‌ ఇళ్లలో జరుగుతాయా?

పర్యావరణానికి సంబంధించి చూసినా… ఇంత పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ తో, హెల్త్‌, ఎన్విరాన్‌మెంటల్‌, హౌసింగ్‌కు సంబంధించిన మూడు శాఖలు సమిష్టిగా కూర్చుని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాతే ఈ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని, కోర్టుల్లో కేసులు వేసి ప్రభుత్వాన్ని ప్రజల్లో పలుచన చేయాలని ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ… తమ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు మనుషులు ఉండటానికే పనికిరాకూడదు కదా? టీడీపీ హయాంలో కట్టిన ఇళ్ళల్లో.. నాలుగో అంతస్తులో పెద్దవాళ్లు ఉంటే, ఒక వేళ అగ్నిప్రమాదం జరిగితే ఎలా బయటకు వస్తారు? మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఎందుకు ఆలోచించలేదు?

ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన చంద్రబాబు నాయుడు కోర్టులను అడ్డం పెట్టుకుని కొత్త కొత్త వాదనలు తెరమీదకు తెస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా తమకు అందుబాటులో ఉన్న వనరులను వాడుకుంటూ వీలైనంతవరకూ లబ్ధిదారులు సుఖంగా, ప్రశాంతంగా ఉండేలా, అంతకన్నా ముందు ఉండేదానికన్నా మెరుగైన జీవనం ఉండేలా ప్రయత్నిస్తుంది.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *