వ్యాక్సిన్‌ కోసం రెండు కంపెనీలతో అమెరికా వందకోట్ల డాలర్ల ఒప్పందం

వ్యాక్సిన్‌ కోసం రెండు కంపెనీలతో అమెరికా వందకోట్ల డాలర్ల ఒప్పందం

0 0
Read Time:2 Minute, 51 Second

అగ్రరాజ్యమైన అమెరికా కరోనా వ్యాక్సిన్‌ కోసం రెండు కంపెనీలతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అదేంటి… కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసిందా అని అనుకోకండి… ఎప్పుడొస్తే అపుడు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసి అమెరికాకు ఇచ్చేయాలి… అదీ ఒప్పందం.. J&J Moderna sign deals with US

జాన్సన్‌ అండ్‌ జాన్సన్, మోదెర్మా కంపెనీలతో అమెరికా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 2021 ప్రారంభంలో గానీ వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం లేదు. కానీ వ్యాక్సిన్‌ ఫార్ములా సిద్ధం కాగానే మాత్రం ముందుగా ఉత్పత్తి చేసి అమెరికాకు ఇచ్చేయాలన్నది ఆ ఒప్పందం సారాంశం.. ఈ విషయాన్ని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అధికారులు బైటపెట్టారు. ఇందుకోసం అమెరికా ప్రభుత్వంతో వందకోట్ల డాలర్ల ఒప్పందం కుదిరిందని వారు వెల్లడించారు. వ్యాక్సిన్‌లు కూడా అదే సంఖ్యలో.. అంటే వందకోట్ల డోసులు అందించాల్సి ఉంటుందని వారు తెలిపారు. మరి అమెరికా జనాభా వందకోట్లు లేరుగా అనుకుంటున్నారా.. మిగిలినవి మనలాంటి దేశాలకు అధిక ధరలకు అమ్మేస్తారులెండి..

Also Read : కరోనా అప్‌డేట్స్‌… భారత్‌లో అతి తక్కువ ధరకే కోవిడ్‌ 19 టెస్ట్‌ కిట్‌..

ఇక వ్యాక్సిన్‌ విషయానికొస్తే.. ఇంకా అది క్లినికల్‌ ట్రయల్స్‌ దశ దాటలేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతాయని అంచనా. క్లినికల్‌ ట్రయల్స్‌కు అవసరమైన ఏర్పాట్లన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. అమెరికా హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌లో భాగమైన బయోమెడికల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బీఏఆర్‌డీఏ) తో ఒప్పందంపై సంతకాలు జరిగాయని మోదెర్మా కంపెనీ అధికారులు కూడా చెప్పారు.

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి బీఏఆర్‌డీఏ ఇప్పటికే 420 మిలియన్‌ డాలర్లను అడ్వాన్సుగా చెల్లించేసిందట. అమెరికాతో వ్యాక్సిన్‌ ఒప్పందం కుదుర్చుకోగానే మోదెర్మా కంపెనీ షేర్ల ధరలు 1.4 శాతం పెరిగాయి. ఇపుడు ఆ కంపెనీ షేరు ధర 30.48 డాలర్లు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *