Jagananna Vidya deevena Facts విద్యా దీవెన పథకం వివరాలు

Jagananna Vidya deevena Facts విద్యా దీవెన పథకం వివరాలు

0 0
Read Time:5 Minute, 48 Second

విద్యా వ్యవస్ధలో పెను విప్లవం – జగనన్న విద్యా దీవెన పథకం.. నిరుపేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడాలేని విధంగా అర్హత ఉన్న ప్రతీ విద్యార్ధికి సకాలంలో, ఏ బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి, వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేసి పేదల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్న ప్రభుత్వం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఈ ఏడాది రెండో విడతగా దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు రూ. 693.81 కోట్లను క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌. Jagananna Vidya deevena Facts

జగనన్న విద్యా దీవెన పథకం

ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రతీ త్రైమాసికానికి (మూడు నెలలు) ఒకసారి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం జమ చేస్తుంది.

జగనన్న విద్యా దీవెన – నాలుగు విడతలు
మొదటి విడత – ఏప్రిల్‌ 19
రెండవ విడత – జులై 29
మూడవ విడత – డిసెంబర్‌
నాలుగవ విడత – ఫిబ్రవరి 2022

విద్యారంగంపై ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన వ్యయం
లబ్దిదారులు – 1,62,75,373
లబ్ది (రూ. కోట్లలో) – 26,677.82

విద్యారంగంపై ఇప్పటివరకు చేసిన ఖర్చు ఈ రూ. 26,677.82 కోట్లే కాకుండా నాడు – నేడు పథకం క్రింద ప్రీప్రైమరీ స్కూళ్ళుగా మారబోతున్న అంగన్‌వాడీలలో పిల్లలు, తల్లుల పోషకాహారం కోసం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా ఏటా మరో రూ. 1,800 కోట్ల వ్యయం కూడా చేస్తుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

Also Read : అగ్రవర్ణ పేదల కోసం కొత్త పథకం ‘ఈబీసీ నేస్తం’

గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ఫీజులకు అరకొర మొత్తాలు విదిలించి చేతులు దులుపుకోవడం, అదీ సరైన సమయంలో ఇవ్వకపోవడం వంటి చర్యలకు స్వస్తి చెబుతూ, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1,774.60 కోట్ల బకాయిలతో సహా మొత్తం రూ. 4,207.85 కోట్లు జమ.

ఈ ఏడాది ఏ బకాయిలకు తావులేకుండా పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ను పెంచి ఏప్రిల్‌లో మొదటి విడతగా రూ. 671.45 కోట్లు, నేడు రెండో విడతగా దాదాపు రూ. 693.81 కోట్లతో కలిపి ఇప్పటివరకు నేరుగా అందించిన మొత్తం రూ. 5,573.21 కోట్లు.

తల్లుల ఖాతాల్లో ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ జమ చేయడం ద్వారా…

పిల్లలు చదువుతున్న కాలేజీలకు తల్లిదండ్రులు స్వయంగా వెళ్ళి ఆ ఫీజులు వాళ్ళే కట్టడం ద్వారా కాలేజీలో సమస్యలు, కాలేజీలో పరిస్ధితులు, కాలేజీలో సదుపాయాలు, అక్కడ తమ పిల్లల బాగోగుల గురించి తెలుసుకుని, కాలేజీలో వసతుల లోపం, సమస్యలు ఏమైనా ఉంటే, ఆ కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించగలుగుతారు, నిలదీయగలుగుతారు.

కాలేజీలలోని వసతులలేమి, సమస్యలను 1902 నంబర్‌కు ఫోన్‌ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ద్వారా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ కాలేజీలో పరిస్ధితులు చక్కదిద్ది సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుంది.

కాలేజీల్లో జవాబుదారీతనం, కాలేజీల స్ధితిగతులు, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ రెండూ జరుగుతాయి.

కుటుంబంలో ఉన్న అర్హులైన పిల్లలందరికీ ఉన్నత విద్య చదివే అవకాశం, తద్వారా అన్ని విధాల స్ధిరపడనున్న కుటుంబాలు

జగనన్న వసతి దీవెన పథకం గురించి సమాచారం

జగనన్న వసతి దీవెన పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చుల కొరకు, కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

జగనన్న వసతి దీవెన

మొదటి విడత – ఏప్రిల్‌ 28, రెండో విడత – డిసెంబర్‌.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *