ఏపీకి కొత్తగా పర్యాటక ప్రాజెక్టులు.. 48వేల ఉద్యోగాలు

ఏపీకి కొత్తగా పర్యాటక ప్రాజెక్టులు.. 48వేల ఉద్యోగాలు

0 0
Read Time:5 Minute, 13 Second

AP Tourism Projects ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించారు. ఏపీలో పర్యాటకరంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్న ప్రాజెక్టులపై దృష్టిపెట్టాలని నిర్ణయించారు. ఒక్కో ప్రాజెక్టుపై కనీసంగా రూ.250 కోట్ల పెట్టుబడులు వస్తాయని, వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్ల పెట్టుబడులు వస్తాయని బోర్డు అంచనా వేసింది. ఈ ప్రాజెక్టుల్లో దాదాపు 48 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 1564 గదులు అందుబాటులోకి రానున్నాయి. ఐదేళ్లలో వీటిని పూర్తి చేస్తామని కంపెనీలు హామీ ఇచ్చాయి.

కొత్త ప్రాజెక్టులివే.. AP Tourism Projects
ఎస్‌ఐపీబీ ముందుకు కొత్తగా కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. వాటికి ఎస్‌ఐపీబీ
ఆమోదం తెలిపింది. ఆ ప్రతిపాదనలివే..

  • విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్, పిచ్చుకలంకలో విఖ్యాత కంపెనీ ఓబెరాయ్‌ ఆధ్వర్యంలో రిసార్టులు
  • ఓబెరాయ్‌ విలాస్‌ బ్రాండ్‌తో రిసార్టులు
  • విశాఖపట్నం శిల్పారామంలో హయత్‌ ఆధ్వర్యంలో స్టార్‌ హోటల్, కన్వెన్షన్‌ సెంటర్‌
  • తాజ్‌ వరుణ్‌ బీచ్‌ పేరుతో విశాఖలో మరో హోటల్, సర్వీసు అపార్ట్‌మెంట్‌
  • విశాఖపట్నంలో టన్నెల్‌ ఆక్వేరియం
  • విశాఖలో స్కైటవర్‌ నిర్మాణం
  • విజయవాడలో హయత్‌ ప్యాలెస్‌ హెటల్‌
  • అనంతపురం జిల్లా పెనుగొండలో జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఇస్కాన్‌ ఛారిటీస్‌ ఆధ్వర్యంలో ఆథ్యాత్మిక పర్యాటక కేంద్రం

పర్యాటక రంగానికి చిరునామాగా ఏపీ
పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. టూరిజం అంటే ఏపీ వైపే చూడాలని ఆయన అన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు ఉండాలని, అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలని జగన్‌ పేర్కొన్నారు. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఆధునిక వసతలు అందుబాటులోకి రావడం వల్ల టూరిజం పరంగా రాష్ట్రం స్ధాయి పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త ప్రాజెక్టుల వల్ల పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తారని, ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై ఆధారపడేవారికి మెరుగైన అవకాశాలు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. తద్వారా ఉద్యోగాల కల్పన, ఉపాధి పెరుగుతాయని పేర్కొన్నారు. విశాఖపట్నంలో లండన్‌ ఐ తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశానికి ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల్‌ వలవెన్, పర్యాటక, సాంస్కతిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, జీఏడీ స్పెషల్‌ సీఎస్‌ కె ప్రవీణ్‌ కుమార్, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కష్ణబాబు, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, అటవీ పర్యావరణశాఖ కార్యదర్శి జి విజయ్‌కుమార్, నీటిపారుదలశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జి సృజన, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *