Moto E40 స్మార్ట్ ఫోన్ ఈనెల 12న భారత మార్కెట్లలో విడుదల కానున్నది. మూడు కెమెరాలున్న ఈఫోన్లో హై ఎండ్ ఫోన్లలో ఉన్న విధంగా హెడ్డీ డిస్ప్లే, వేలిముద్రల సెన్సార్, ఫేస్ అన్లాక్ వంటి ఫీచర్లుండడం విశేషం.
Moto E40 కు సంబంధించిన టీజర్ ఫ్లిప్కార్ట్లో విడుదలయ్యింది. ఇది ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇంకా స్టోర్లకు విడుదలవుతుందా లేదా అన్నది స్పష్టత లేదు. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉంటాయి. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా ఇంటర్నల్ మెమొరీని విస్తరించుకోవచ్చు. దీని ధర 15,000 నుంచి 20,000 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. పింక్ క్లే, కార్బన్ గ్రే ( Carbon Gray, Pink Clay )కలర్లలో రెండు వేరియంట్లు మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.