కళ్లజోడుకు ప్రాణం… ఫేస్‌బుక్‌ – రేబాన్‌ సృష్టించిన అద్భుతం

కళ్లజోడుకు ప్రాణం… ఫేస్‌బుక్‌ – రేబాన్‌ సృష్టించిన అద్భుతం

0 0
Read Time:4 Minute, 0 Second

Facebook Rey-ban Stories కళ్లజోళ్ల చరిత్రలో ఇదో అద్భుత ఆవిష్కరణ. ఐకానిక్‌ కళ్లజోళ్ల బ్రాండ్‌ రేబాన్‌ మరో సరికొత్త సంచలనానికి తెరతీసింది. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో కలసి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. చూడడానికి రేబాన్‌ కళ్లజోడే అయినా వీటిలో చాలా ఫీచర్లున్నాయి. ఈ కళ్లజోళ్లు ధరించిన వారు ఫొటోలను తీయవచ్చు. వీడియోలను చిత్రీకరించవచ్చు. వాటిని డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫామ్‌పైకి పంపించవచ్చు. అలెక్సాను ఆదేశించినట్లుగా ఈ కళ్లజోడును మీరు ఆదేశించవచ్చు. మీ సూచనల ప్రకారం అది ఫొటోలను, లేదా వీడియోలను చిత్రీకరిస్తుంది. రే–బాన్‌ తయారీదారు ఎస్సిలార్‌లక్సోటికా గ్రూప్‌లో గ్లోబల్‌ రీసెర్చ్‌ అండ్‌ డిజైన్‌ డైరెక్టర్‌ ఫాబియో బోర్సోయ్‌ ఈ సరికొత్త కళ్లజోడు వివరాలను మీడియాకు వివరించారు.

Facebook Rey-ban Stories రే–బాన్‌ స్టోరీస్‌ అని పిలువబడే ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌ ఒక బటన్‌ నొక్కితే ఫోటోలు, 30–సెకన్ల వీడియోలను షూట్‌ చేస్తాయి. సంగీతం, పాడ్‌కాస్ట్‌లను కూడా ప్లే చేస్తుంది. అంతేకాదు కాల్స్‌కు కూడా వీటిని అనుసంధానించవచ్చు. గ్లాసెస్‌లో వర్చువల్‌ అసిస్టెంట్‌ ఉంటుంది కాబట్టి మీరు ‘హే ఫేస్‌బుక్‌‘ అనే పిలవడం ద్వారా ఫోటోలు, వీడియోలను హ్యాండ్స్‌–ఫ్రీగా స్నాప్‌ చేయవచ్చు.

Also Read : Samsung Galaxy Z Fold 3, Z Flip 3 ఫోల్డబుల్ ఫోన్లు

వీటి ధర 299 డాలర్లు. (సుమారు రూ. 21,970) నుండి ప్రారంభమవుతుంది. రే–బాన్‌ స్టోరీస్‌గా పిలువబడే ఈ కళ్లజోళ్లు ప్రస్తుతం ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, ఐర్లాండ్, ఇటలీ, అమెరికాలలో మాత్రమే లభ్యమవుతున్నాయి. అక్కడి నుంచి భారత్‌కు తెప్పించుకోవచ్చు. గతంలో మెస్సేజింగ్‌ యాప్‌ స్నాప్‌ చాట్‌ కూడా ఇలాంటి ప్రయత్నం చేసింది. ఈ రకమైన కళ్లజోళ్లను ఆవిష్కరించింది. కానీ వాటి ధర చాలా ఎక్కువ. వాటితో పోలిస్తే రేబాన్‌ – ఫేస్‌బుక్‌ కళ్లజోళ్ల ధర తక్కువ.
కెమెరాలు ఫ్రేమ్‌ల ముందు భాగంలో నిర్మించబడ్డాయి. కెమెరాలు ఉపయోగించినప్పుడు ఫ్రేమ్‌ ముందు భాగంలో తెల్లని కాంతి కనిపిస్తుంది. ఇది ఎదుటివారిని అలర్ట్‌ చేయడానికి ఉద్దేశించబడినది. ఎందుకంటే దీనిని రహస్య కెమెరాలా వాడేందుకు తయారుచేసినది కాదు.

వినియోగదారులు ఓ బటన్‌ని నొక్కడం ద్వారా లేదా వాయిస్‌ కమాండ్‌ని ఉపయోగించడం ద్వారా 30 సెకన్ల వరకు చిత్రాన్ని లేదా వీడియో క్లిప్‌ను తీసుకోవచ్చు. వినియోగదారులు సోషల్‌ నెట్‌వర్క్‌లో తమ ఖాతాలను ఉపయోగించి గ్లాసెస్‌ ఫేస్‌బుక్‌ వ్యూ యాప్‌లోకి లాగిన్‌ అవుతారు. రే–బాన్‌ స్టోరీస్‌ ఫ్రేమ్‌లు వైర్‌లెస్‌గా స్మార్ట్‌ఫోన్‌ యాప్‌కి అనుసంధానించబడతాయి. ఇవి గ్లాసెస్‌ ద్వారా క్యాప్చర్‌ చేయబడిన ఇమేజ్‌లు లేదా వీడియోలను నిర్వహించడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *