Facebook down Globally.. దీని ప్రభావం ఎంతంటే..

Facebook down Globally.. దీని ప్రభావం ఎంతంటే..

0 0
Read Time:6 Minute, 48 Second

ఫేస్‌బుక్‌ Facebook దాని అనుబంధ యాప్‌లు వాట్సాప్ WhatsApp , ఇన్‌స్టాగ్రామ్ Instagram , మెస్సెంజర్‌ Messenger సేవలు నిలిచిపోవడంతో ప్రపంచం స్తంభించిపోయింది. కోట్లాదిమంది ఉపయోగిస్తున్న ఈ యాప్‌లు ఆగిపోవడంతో అందరూ ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. వ్యక్తిగత కమ్యూనికేషన్‌ మాత్రమే కాదు చాలా వ్యాపారాలు వీటితో లింక్‌ అయి ఉన్నాయి. ఏం జరిగిందో.. ఏం చేయబోతున్నామో.. చెప్పడానికి సర్వీసులు పునరుద్ధరించబడిన తర్వాత ఆ సమాచారాన్ని తెలియజేయడానికి వాట్సాప్‌ యాజమాన్యం ట్విట్టర్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. Facebook down Globally

ఫేస్‌బుక్‌ ఎందుకు కీలకమంటే..
దాదాపు ఆరు గంటల పాటు ఈ యాప్‌లు నిలిచిపోయాయి. కోట్లాదిమంది కమ్యూనికేషన్‌ కోసం వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారు. ఇక ఫేస్‌బుక్‌ మెస్సేజింగ్, లైవ్‌ స్ట్రీమింగ్, వర్చువల్‌ రియాలిటీ ఇంకా అనేక ఇతర డిజిటల్‌ సేవలతో అనుసంధానంగా ఉంది. చాలా దేశాలలో ఇంటర్నెట్‌ అంటే ఫేస్‌బుక్కే. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల మంది ఫేస్‌బుక్ , మెస్సెంజర్, వాట్సాప్‌ లను కమ్యూనికేషన్‌ సాధనాలుగా ఉపయోగిస్తున్నారు. కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ, ఆఫీసు కమ్యూనికేషన్‌లకూ, వ్యాపార ప్రకటనలకు ఈ యాప్‌లను వాడుతున్నారు. అంతేకాదు ఫేస్‌బుక్‌ అనేది ఎంత కీలకంగా మారిందంటే అనేక యాప్‌లు, సేవలకు సైన్‌ ఇన్‌ కోసం దీనిని ఉపయోగిస్తున్నారు. అనేక షాపింగ్‌ వెబ్‌సైట్‌లకు లాగిన్‌ అవడానికి ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. ఫేస్‌బుక్‌ లేదా గూగుల్‌ అకౌంట్‌లతో సైన్‌ ఇన్‌ అవడానికే మెజారిటీ వెబ్‌సైట్‌లు ప్రొటోకాల్స్‌ క్రియేట్‌ చేశాయి. అందులో గూగుల్‌ కన్నా ఫేస్‌బుక్‌ ద్వారా సైన్‌ ఇన్‌ అయ్యేవారి శాతమే ఎక్కువ కావడం వల్ల దీని ప్రభావం ఎంత ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

గతంలోనూ ఇలాగే… Facebook down Globally
టెక్నాలజీ అంతరాయమనేది సర్వసాధారణమైన అంశమే కానీ ప్రపంచంలోని అతిపెద్ద సోషల్‌ మీడియా కంపెనీకి సంబంధించిన యాప్‌లన్నీ ఒకేసారి డౌన్‌ అవడం మాత్రం నిస్సందేహంగా అసాధారణమనే చెప్పాలి. గతంలో 2019లోనూ ఫేస్‌బుక్‌ ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నది. అపుడు దాదాపు 24 గంటలసేపు సేవలు నిలిచిపోయాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఇంటర్నెట్‌ కంపెనీలు కూడా ఈ అంతరాయాలకు మినహాయింపు కాదని తాజా ఘటన రుజువు చేసింది. డేటా సెంటర్ల మధ్య ట్రాఫిక్‌ను సమన్వయ పరిచే ఇంటర్నెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోని మార్పులే తాజా అంతరాయానికి కారణమని ఫేస్‌బుక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దీనివల్లే తమ సేవలు నిలిచిపోయాయని, అంతరాయానికి చింతిస్తున్నామని అది పేర్కొంది.

Also Read : Top 5 Free Android Apps కొత్తగా వచ్చిన టాప్‌ 5 యాప్స్‌ ఇవే..

ఓ ఉద్యోగి తప్పిదమేనా..
తొలుత ఇది హాకర్ల పనేనని అనుమానించినా చివరకు సాంకేతిక సమస్యేనని తేల్చారు. డొమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ (డీఎన్‌ఎస్‌)లో సమస్య తలెత్తడం వల్ల ఇలా స్తంభించిందని కూడా తొలుత భావించారు. కానీ బీజీపీ (బార్డర్‌ గేట్‌వే ప్రొటోకాల్‌ ) ను ఓ ఉద్యోగి మాన్యువల్‌గా అప్‌లోడ్‌ చేయడం వల్లనే ఈ భారీ సమస్య Facebook down Globally తలెత్తిందని గుర్తించారు. చాలా ప్రయత్నాల తర్వాత కాలిఫోర్నియాలోని శాంతాక్లారా డేటా సెంటర్‌లో ఉన్న ఫేస్‌బుక్‌ టీమ్‌ మొత్తానికి తమ సర్వర్‌ కంప్యూటర్‌లను యాక్సెస్‌ చేయగలిగింది. సమస్యను పరిష్కరించి సేవలను పునరుద్ధరించారు.

జుకర్‌బర్గ్‌ స్థానాన్ని దిగజార్చింది…
ఫేస్‌బుక్‌ ఇప్పటికే అనేక కష్టాలలో ఉంది. తాజా అంతరాయం దాని కష్టాలను మరింత పెంచింది. దీని మూల్యం దాదాపు 7 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.50వేల కోట్లకు పైమాటే) అని అంచనా. దీంతో అపర కుబేరుల జాబితా లో ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ స్థానం మరింత దిగజారింది. ఐదోస్థానంలో ఉన్న జుకర్‌బర్గ్‌ ప్రస్తుతం 120.9 బిలియన్‌ డాలర్లతో ఆరోస్థానానికి పడిపోయాడు. సెప్టెంబర్‌ లో ఫేస్‌బుక్‌ స్టాక్‌ 15శాతం పడిపోగా తాజా సర్వీసుల స్తంభన ప్రభావంతో ఒకేసారి 5శాతం పడిపోయిందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది.

ఇంటర్నల్‌గానూ అనేక సమస్యలు
మరోవైపు ఫేస్‌బుక్‌ ఇంటర్నల్‌గా కూడా చాలా పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. కంపెనీలో పనిచేస్తున్న ప్రొడక్ట్‌ మేనేజర్‌ ఫ్రాన్సిస్‌ హౌగెన్‌ విజిల్‌ బ్లోయర్‌గా మారారు. ఫేస్‌బుక్‌ దాని అనుబంధ యాప్‌లు ప్రపంచానికి ఎంతటి నష్టాన్ని కలుగజేస్తున్నాయనే దానిపై సంస్థలో అనేక పత్రాలను ఆమె సంపాదించగలిగారు. వాటిని మీడియాకు, చట్టసభ సభ్యులకు అందజేస్తూ ఫేస్‌బుక్‌కు ఆమె పెద్ద సమస్యగా తయారయ్యారు. దీంతో కొద్ది కాలం కిందట ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. అయినా ఆమె వద్ద ఇంకా అనేక రహస్య పత్రాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

  • శ్రీవల్లి
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *