రెండో టెస్టులో టీమిండియా బోల్తా పడిందిలా..

రెండో టెస్టులో టీమిండియా బోల్తా పడిందిలా..

0 0
Read Time:3 Minute, 22 Second

టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. Team india lost to NZ

తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌట్ అయిన న్యూజిలాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలకడగా రాణించింది.

36 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి టెస్ట్ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 124 పరుగులకే ఆలౌట్ అయింది.

ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకపోవడం జట్టును మరింత కలవరపాటుకు గురిచేస్తోంది.

ఈ టెస్ట్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ మొత్తం 38 పరుగులు మాత్రమే చేశాడు.

అందివచ్చిన అవకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది.

Also Read : ఐపీఎల్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. ఈసారి జరిగిన మార్పులేమిటో తెలుసా..

టెస్టు సిరీస్‌లో తొలిసారి భారత బౌలర్లు చెలరేగుతూ రెండు సెషన్లలోనే కివీస్‌‌ను పది వికెట్లను నేలకూల్చారు.

ప్రత్యర్థి టెయిలెండర్లు కాస్త పోరాడినా కోహ్లీ సేనకు స్వల్ప ఆధిక్యం దక్కింది.

ఇక ఈసారైనా బ్యాట్స్‌మెన్‌ స్థాయికి తగ్గట్టు ఆడి న్యూజిలాండ్‌ను ఒత్తిడిలో పడేస్తారేమోనని అంతా ఆశించారు.

ప్చ్‌.. ఏం లాభం.. మా ఆటతీరింతే అన్నట్టు క్రీజులోకి వచ్చినంత వేగంగా పెవిలియన్‌కు చేరారు.

అయితే… తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌటైన ఆతిథ్య కివీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలకడగా ఆడింది.

న్యూజిలాండ్‌‌కు ఓపెనర్లు టామ్ లాథమ్, టామ్ బ్లండెల్ శుభారంభాన్ని అందించారు.

తొలి వికెట్ కోల్పోయే సమయానికి 103 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఓపెనర్ టామ్ లాథమ్ పంత్‌కు క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు.

అనంతరం బరిలోకి దిగిన కెప్టెన్ కేన్ విలియమ్ సన్ 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బూమ్రా బౌలింగ్‌లో రహానేకు క్యాచ్‌గా చిక్కడంతో పెవిలియన్ బాట పట్టాడు.

మరో ఓపెనర్ టామ్ బ్లండెల్ 55 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బూమ్రా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.

అయితే.. హెన్రీ నికోలస్, రాస్ టేలర్ చెరో ఐదు పరుగులు చేసి జట్టుకు అలవోకగా విజయాన్ని అందించారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *