బాల్‌ టు బాల్‌ బెట్టింగ్‌ అడ్డా.. ఎక్కడుందో తెలుసా..

బాల్‌ టు బాల్‌ బెట్టింగ్‌ అడ్డా.. ఎక్కడుందో తెలుసా..

0 0
Read Time:2 Minute, 27 Second

ఐపీఎల్‌ అంటేనే బెట్టింగ్‌.. ఎవరెంత కట్టడి చేసినా బెట్టింగ్‌ రాయుళ్లు చెలరేగిపోతున్నారు. ట్వంటీ ట్వంటీ క్రికెట్‌ మ్యాచ్‌లను అవకాశంగా తీసుకొని పందెంరాయళ్లు బెట్టింగ్‌ హవా కొనసాగిస్తున్నారు. IPL Betting in AP TS

ఇన్నాళ్లు హోటళ్లు, ఇళ్లల్లో గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌ నిర్వహించే బుకీలు కరోనా కారణంగా తమ రూటు మార్చారు. వివిధ నగదు లావాదేవీలు నిర్వహించే యాప్‌లను బెట్టింగ్‌కు ఉపయోగించుకుంటున్నారు. బాల్‌ టు బాల్‌ మాత్రమే కాక ఓవర్ల వారీగా కూడా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

Also Read : ఐపీఎల్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. ఈసారి జరిగిన మార్పులేమిటో తెలుసా..

ఈ సీజన్‌లో ఐపీఎల్‌ మొదలయ్యాక ఖమ్మం జిల్లాలోనే రూ. 2 నుంచి 3 కోట్ల వరకు బెట్టింగ్‌ జరిగినట్టు వినిపిస్తోంది. గత 15 రోజుల్లో ఖమ్మం జిల్లాలో 70 మంది వరకూ బెట్టింగ్‌ రాయుళ్లను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు. వీరి నుంచి రూ. 4 లక్షల నగదు, 50 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ దందాలో ఖమ్మం, సత్తుపల్లితో పాటు ఏపీ సరిహద్దు మండలాలకు చెందిన వ్యక్తులు కూడా కీలక సూత్రధారులుగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభమవగానే గతంలో బెట్టింగ్‌ కేసుల్లో అరెస్టయిన వారిని పోలీసులు ఇపుడు తిరిగి అదుపులోకి తీసుకున్నారు. అయినా బెట్టింగ్‌ దందాకు అడ్డుకట్ట పడడం లేదు. ఈసారి ఆన్‌లైన్‌లో నగదు చెల్లింపులు జరుగుతుండడంతో ఎన్నిచోట్ల దాడులు జరిగినా పెద్ద మొత్తంలో నగదు దొరకడం లేదని పోలీసు వర్గాలంటున్నాయి.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *