Trump becomes Baahubali
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా చురుకు. భారత పర్యటన నేపథ్యంలో ఆయన ట్విట్టర్లో పెడుతున్న పోస్టులు ఆసక్తికరంగా మారాయి. తన పర్యటనకు ఒక రోజు ముందు ఆయన పోస్టు చేసిన ఓ వీడియో ఇపుడు భారత్, అమెరికాలలో ట్రెండింగ్ గా మారింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన బాహుబలి #Bahubali సినిమాలో కొన్ని సన్నివేశాలను తీసుకుని బాహుబలి స్థానంలో తన తలకాయను మార్ఫింగ్ చేసిన ఓ వీడియోను ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘‘భారత్‌లోని నా గొప్ప స్నేహితులతో గడిపేందుకు సమాయత్తమవుతున్నాను.’’ అని ఆ వీడియోతో పాటు ఓ మెస్సేజ్‌ను పోస్టు చేశారు.
వీడియోలో ప్రభాస్ ఫేస్‌ను ట్రంప్ ముఖంతో మార్ఫ్ చేశారు. విభిన్నంగా ఉండే అధ్యక్షుడి హావభావాల్ని సైతం జోడించారు. ఇరు దేశాల సమైక్యత కోసం శత్రువుల్ని చెండాడి ట్రంప్ విజయం సాధించినట్లు అందులో చూపించారు. అలాగే చిత్రంలో సామాన్య ప్రజల పిల్లల్ని ప్రభాస్ తన భుజాలపై మోస్తూ వారిని ఆశ్చర్యాన్ని గురిచేసే సన్నివేశంలో.. ట్రంప్ తన కూతురు ఇవాంకా, కుమారుడు జూనియర్ డొనాల్డ్‌ను మోయడం నవ్వులు పూయిస్తోంది. అలాగే శివగామి స్థానంలో ప్రథమ మహిళ మెలనియాను చూపించారు.
విజయం సాధించి వచ్చిన ట్రంప్‌నకు ప్రధాని మోదీతో పాటు వేలాది మంది ప్రజలు స్వాగతం పలుకుతున్నట్లుగా వీడియోను మార్చారు. ఇదంతా ఆయన రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు చేస్తున్నట్లుగా వీడియోను తీర్చిదిద్దారు. ఈ వీడియో మొత్తం ‘సాహోరే బాహుబలి’ పాటకి హిందీ వెర్షన్ అయిన ‘జీయోరే బాహుబలి’ థీమ్‌సాంగ్‌తో కొనసాగుతుంది.
ట్రంప్ దీన్ని రీట్వీట్ చేయడంతో వైరల్‌గా మారింది. మూడు గంటల్లో దాదాపు 63వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోను ట్విటర్లో ‘సోల్’ పేరిట ఉన్న ఓ వ్యక్తి రూపొందించారు. తనకు తాను మీమటేషియన్గా, జీఎఫ్వై వర్సిటీలో మీమాలజీ ప్రొఫెసర్‌గా చెప్పుకొన్నారు. గతంలో కూడా ట్రంప్‌నకు సంబంధించిన పలు వీడియోలను రూపొందించినట్లు ‘సోల్’ ట్విటర్ ఖాతా ద్వారా తెలుస్తోంది. ఆమె ట్రంప్‌ను అభిమానించే వ్యక్తిగా అర్థమవుతోంది.
ట్రంప్ భారత్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్న సంగతి తెల్సిందే. ఆయనతో పాటు అమెరికా ప్రథమ మహిళ మెలనియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్, అల్లుడు జేర్డ్ కుష్నర్ కూడా వస్తున్నారు. ఇంకా పలువురు ఉన్నతస్థాయి అధికారులతో కూడిన ప్రత్యేక బృందం కూడా వస్తున్నది.
ఫిబ్రవరి 24, 25 తేదీలలో ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి విమానం ‘ఎయిర్‌ఫోర్స్ 1’ అహ్మదాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది. ఆయనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది స్వాగతం పలుకనున్నారు.
order cialis online
furosemide
where to buy cialis cheap