సినిమా టికెట్లను ప్రభుత్వం online లో అమ్మితే ఏమౌతుంది?

సినిమా టికెట్లను ప్రభుత్వం online లో అమ్మితే ఏమౌతుంది?

0 0
Read Time:10 Minute, 21 Second

Movie Tickets Andhra సినిమా టికెట్లను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో విక్రయిస్తుందన్న అంశంపై గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చ నడుస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తప్ప సినిమా పరిశ్రమలో ఎవరూ దీనిని వ్యతిరేకించడం లేదు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ దీనిని ఆహ్వానిస్తున్నారు. అసలు ఈ ప్రతిపాదన ప్రభుత్వం ముందు తామే ఉంచామంటున్నారు. మరి పవన్‌ కల్యాణ్‌కు వచ్చిన నష్టమేమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో సోషల్‌ మీడియాలో కనిపించిన, బాగా సర్క్యులేట్‌ అవుతున్న పోస్టు ఇది. మీరూ చూడండి…

“సినిమా టికెట్లు ప్రభుత్వం అమ్మడం ఏంటీ? ఇదొక తుగ్లక్ నిర్ణయం అని రాజకీయ విమర్శకులు కొందరు, మా ఇండస్ట్రీ పొట్ట కొట్టకండి అని పెద్ద పెద్ద నటులు మరికొందరు గగ్గోలు పెడుతున్నారు. అసలు ఈ సినిమా టికెట్ల గోల ఏంటి? ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో తలా దూర్చడం అవసరమా?? అసలు సినిమా పరిశ్రమకు దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి???

ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం!!

2017 GST వచ్చేదాకా, ది ఆంధ్రప్రదేశ్ ఎంటర్టైన్మెంట్ టాక్స్ యాక్ట్, 1939 ద్వారా ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు, టికెట్స్ పైన టాక్స్, టికెట్స్ అమ్మకాలు, షో లు… వంటి వాటిని రేగులెట్ చేస్తూ ఉండేది.

టికెట్ ధరల నిర్ణయాన్ని, సినిమా థియేటర్ల లైసెన్స్ ని రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకునేది.

సినిమా షోలు, టికెట్ అమ్మకాలు, వాటిపై టాక్స్ వంటి విషయాలను కమర్షియల్ టాక్స్ (వాణిజ్య పన్నుల శాఖ) వాళ్లు చూసుకునేవారు.

ఒక సినిమా థియేటర్ ప్రేక్షకుడికి టికెట్ అమ్మాలి అంటే ముందుగా DCR బుక్ లో టాక్స్ ఆఫీస్ వాళ్ళ దగ్గరకు వెళ్లి సీల్ వేసుకోవాలి. ఈ బుక్ లో టికెట్స్ రేట్లు, ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయి, గ్రాస్ కలెక్షన్ ఎంత ? వంటి వివరాలు ఉంటాయి. వారం వారం రిటర్న్ ఫైల్ చేసి ఎంటర్టైన్మెంట్ టాక్స్ కట్టాలి. ఒకరకంగా చెప్పాలి అంటే ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా సినిమా టికెట్ చట్టబద్ధంగా అమ్మలేరు.

ఇందులో డ్రా బాక్ ఏంటంటే సినిమా థియేటర్ల మీద నమ్మకంతో ప్రభుత్వం ముందుగానే DCR బుక్ లో సీల్ వేసి పర్మిషన్ ఇస్తుంది. కానీ పర్యవేక్షణా లోపం వల్ల టికెట్స్ & సీటింగ్ కెపాసిటీ ఇష్టం వచ్చినట్టు చూపించుకునేవారు.

టాక్స్ డిపార్ట్మెంట్ వసూలు చేసే డబ్బుల్లో చాలా వరకూ లోకల్ బాడీస్ అంటే మునిసిపాలిటీ, పంచాయతీలకు వెళుతుంది, తరువాత ఫిల్మ్ ఛాంబర్ కి వెళుతుంది, చివరిగా ఆ డబ్బులు ప్రభుత్వానికి అతి తక్కువ మొత్తం వెళతాయి. ఈ ప్రాసెస్ ని నెట్ ప్రొసీడ్స్ అంటారు.

అయితే 2017 లో GST చట్టం వచ్చాక, ఎంటర్టైన్మెంట్ టాక్స్ అనేదే లేదు. సినిమా కూడా ఒక గూడ్స్ & సర్వీస్ డెలివరీలో భాగంగా చేశారు.

సినిమా మీద టాక్స్ రేట్ ని, GST కౌన్సిల్ నిర్ణయించిన ధరకు లెవీ చేస్తారు. కానీ టికెట్ రేట్స్ & రేగులేషన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.
అంతకు ముందు వారం వారం రిటర్న్ ఫైల్ చేసి డబ్బులు కట్టి, ముందస్తు గానే DCR లు వేరిఫై చేసించుకునే సినిమా థియేటర్ యాజమాన్యం ఇప్పుడు నెలకు మాత్రమే టాక్స్ కడుతున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన రేటుకు టికెట్ అమ్మి ప్రభుత్వానికి మాత్రం 100 రూపాయలు కూడా టికెట్ ధర ని వారి రిటర్న్స్ లో చూపించడం లేదు.

ఇదంతా ఎవరి డబ్బు???
బడుగు బలహీల వర్గాలు సరైన అవగాహన, జ్ఞానం తో కూడిన చదువు లేక ఫలానా వాడికి ఫ్యాన్ అంటూ సినిమా రిలీస్ అయిన మొదటి రోజే వందల్లో, వేలల్లో టికెట్ కొని సమకూర్చిన డబ్బు.

రెండు గంటల సినిమాలో నటన కు రోజుకు కోటి రూపాయల రెమ్యునరేషన్, చార్టెడ్ ఫ్లయిట్ వంటి సౌకర్యాల వెనుక హీరో/ డైరెక్టర్ కష్టం ఉంది సరే ఆ ప్రతిఫలాన్ని పన్నుల రూపంలో ప్రజలకు ఇవ్వడానికి దొంగ దారులు తొక్కడం ఎందుకు???

ఒక ఫ్యాన్ లేదా సామాన్య కళాభిమాని ట్యాక్స్ తో కలిపి తన టికెట్ కి డబ్బులు కొంటుంటే, ప్రభుత్వానికి రావాల్సిన ఆ డబ్బును దొంగచాటుగా దొబ్బేయడం హీరోయిజమా???

ప్రభుత్వ అజమయిషీలో ఆన్లైన్ లో టికెట్స్ అమ్మితే వచ్చే నష్టం ఏమన్నా ఉందా అసలు??? ఎందుకు కేవలం పెద్ద హీరోలు మాత్రమే హడావిడి చేస్తున్నారు?? అది కూడా ఒక ఫ్యామిలీ వారే….??

ప్రభుత్వ అజమాయిషీలో టికెట్స్ ఆన్లైన్ ( Movie Tickets Andhra) లో అమ్మితే ఏమౌతుందో చూద్దాం::

✅ ప్రతి ఒక్క టికెట్ ధర ప్రభుత్వం నిర్ణయించిన దానిప్రకారం మాత్రమే అమ్ముతారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే ఎక్కువ రేటుకు అమ్మడానికి ఉండదు.

✅ టికెట్స్ విషయంలో పారదర్శకత పెరిగి, ప్రభుత్వానికి సినిమా వాళ్ళు GST ఎగ్గొట్టలేరు. Income Tax ఎగ్గొట్టలేరు. దొంగ లెక్కలు చూపలేరు.

✅ఎక్కువ బడ్జెట్ తో సినిమా తీశారని ఎక్కువ రేటుకు టికెట్ అమ్మడానికి ఉండదు.

✅ ఇండస్ట్రీ లో ఐదారుమంది హీరోలు, డైరెక్టర్లు ఒక్కో సినిమాకు 20 – 60 కోట్లకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. అలాంటి వారితో నిర్మాతలు సినిమాలు తీస్తే ప్రభుత్వ రేటు ప్రకారం టికెట్స్ అమ్మితే పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడం కష్టం అవుతుంది. అప్పుడు కొత్త నటులు వస్తారు, చిన్న సినిమాలు తెస్తారు. నటులకు పెట్టె కోట్ల సొమ్ముని ప్రొడక్షన్ వ్యాల్యూస్, కథ, మార్కెటింగ్ కోసం పెడతారు. సగటు సినీ నిర్మాత లాభపడతాడు. చిన్న చిన్న కళాకారులు తమ ప్రతిభను చూపించుకోవడానికి అవకాశాలు వస్తాయి.

✅ పెద్ద హీరోలు తమ రెమ్యునరేషన్ కోసం పాన్ ఇండియా సినిమాల వైపు వెళతారు. అప్పుడు మన టాలీవుడ్ హీరోలు కూడా నేషనల్ & ఇంటర్నేషనల్ స్టార్స్ అవుతారు. సినీ ఇండస్ట్రీ మార్కెట్ ఇంకా పెరుగుతుంది.

✅ పాన్ ఇండియా సినిమాలు తీయాలంటే మంచి కథ & ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉండాలి. అప్పుడు పోటీ తత్వం పెరిగి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తాయి.

✅ మొత్తానికి ఓవర్ నైట్ జనాల జేబులకు చిల్లులు పెట్టి టిక్కెట్ రూపంలో చేసే దోపిడీ తగ్గుతుంది. మంచి సినిమాలు వస్తాయి. మంచి నటులు వస్తారు. చిన్న సినిమాలు బాగుపడతాయి. సినిమా కార్మికులకు ఎక్కువ పని దొరుకుతుంది.

ప్రజలు పన్నులు కడుతుంటే ఆ డబ్బులు దొబ్బేస్తూ ప్రభుత్వం యొక్క ఇన్వాల్మెంట్ అక్కర్లేదు అని రెండు లక్ష బుక్కులు చదివిన ఒక హీరో నిస్సిగ్గుగా చెబుతుంటే కింద చదువూ సంధ్యా లేని జనాలు ఫ్యాన్స్ రూపంలో ఆహా ఓహో అంటూ కేకలూ చప్పట్లు….

ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కావచ్చు ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు వాళ్ళ జీతం తీసుకునేటప్పుడే Income టాక్స్ కట్టి నెట్ సాలరీ తెచ్చుకుంటారు. అడుక్కునే వాడు కూడా తాను కొన్న వస్తువులపై GST చెల్లించి మాత్రమే తీసుకుంటాడు. అలాంటిది సినిమా వాళ్ళు చూపించే బడ్జెట్ ఒకటి కట్టే GST ఒకటి, తీసుకునే రెమ్యునరేషన్ ఒకటి కట్టే ఇన్కమ్ టాక్స్ ఒకటి.

టాక్స్ ఎగ్గొట్టడం మా జన్మ హక్కు అని భవదీయుడు భగత్ సింగ్ స్టేజ్ మీద చెబుతుంటే మీ ఎకిలి చేష్టలు చూడలేక ఎలా జాలి పడాలో అర్థం కావట్లేదు రా పిల్ల బచ్చాల్లారా!!”

- Viswaksenudu Vinod
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *