108కు ఫోన్‌చేసిన అబ్దుల్‌కు మెగాఫ్యామిలీ బహుమతులు?

108కు ఫోన్‌చేసిన అబ్దుల్‌కు మెగాఫ్యామిలీ బహుమతులు?

1 0
Read Time:2 Minute, 53 Second

Mega Family Gifts గోల్డెన్‌ అవర్‌లో చికిత్స అందిన మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేనని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సాయి ధరమ్‌ తేజ్‌ను సకాలంలో మెడికవర్‌ హాస్పిటల్‌కు 108లో తరలించారన్న సంగతి తెల్సిందే.. ప్రమాద సమయంలో అటుగా వెళుతున్న ఇద్దరు కుర్రాళ్లు సాయిధరమ్‌ను లేపి పేవ్‌మెంట్‌పై కూర్చోబెట్టి మంచినీళ్లిచ్చారు. కానీ అప్పటికే ఆయన స్పృహలో లేడు. ముఖంపై నీళ్లు కొడుతూ ఆయనను షాక్‌ నుంచి కోలుకోవడానికి వాళ్లు ప్రయత్నించారు. వారిద్దరిలో ఒక కుర్రాడు వెంటనే 108కు ఫోన్‌ చేశాడు. ఆ కుర్రాడే అబ్దుల్‌. నిజాంపేట్‌లో నివసిస్తుంటాడు. సీఎమ్మార్‌ షాపింగ్‌ మాల్‌లో ఓ చిరుద్యోగి. ఇపుడు అందరూ ఆ కుర్రాడిని అభినందిస్తున్నారు. టీవీ చానళ్లు ఇంటర్వ్యూలు చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఆ కుర్రాడికి మెగా ఫ్యామిలీ నుంచి బహుమతులు Mega Family Gifts వెల్లువలా వచ్చిపడుతున్నాయని సోషల్‌ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. యూట్యూబర్లు మరీ రెచ్చిపోయారు. పవన్‌ కల్యాణ్‌ పిలిచి ఐదు లక్షలిచ్చాడని, రామ్‌ చరణ్‌ ఓ కారు కొనిచ్చాడని కథనాలు అల్లేస్తున్నారు. చిరంజీవి పిలిచి ఏకంగా ఓ ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చినట్లు కూడా ఓ కథనం కల్పించేశారు. సెప్టెంబర్‌ 13న ఓ చానల్‌ కిచ్చిన ఇంటర్వ్యూలో అబ్దుల్‌ మాట్లాడుతూ తమకు మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ఫోన్లూ రాలేదని చెప్పాడు. ప్రమాదానికి గురైన సమయంలో ఆయన సెలబ్రిటీనా, హీరోనా అన్నది తమకు తెలియదని, కేవలం ప్రమాదానికి గురైన వ్యక్తికి సాయం చేయాలన్న సామాజిక బాధ్యతతోనే తాము అలా చేశామని అబ్దుల్‌ చెప్పాడు.

అయితే చిరంజీవి మాత్రం ఆ కుర్రాళ్లను పిలిచి అభినందించబోతున్నారని మాత్రం వినిపిస్తోంది. ఆ సందర్భంగా ఏమన్నా బహుమతులు ఇస్తే ఇవ్వవచ్చేమో గానీ ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఆ కుర్రాళ్లకు బహుమతులు అందాయన్న వార్తలు మాత్రం అబద్ధమేనట. అదీ సంగతి.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *