Jai Bhim Movie Review.. Real Hero behind the movie

Jai Bhim Movie Review.. Real Hero behind the movie

2 0
Read Time:4 Minute, 46 Second

Jai Bhim Movie Review “#జైభీమ్” మూవీ తమిళనాడులోని రిటైర్డ్ న్యాయమూర్తి #Justice Chandru గారి లైఫ్ స్టోరీ. ఒక న్యాయవాదిగా వృత్తి ప్రారంభించి మానవ హక్కుల కోసం డబ్బు తీసుకోకుండా వాదించి ఎంతో మంది పీడిత వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తి. ఆయన జడ్జ్ అయ్యాక 6 ఏళ్లలో 96000 కు పైగా కేస్ లు పరిష్కరించి రికార్డ్ సృష్టించారు. మహిళలకు దేవాలయంలో పూజారులు కావొచ్చు , కులం ఏదైనా అందరికి ఒకే స్మశానం ఉండాలి ఇలా ఎన్నో విప్లవాత్మక తీర్పులు ఇచ్చారు. కోర్ట్ లో my lord అని పిలవొద్దు అన్నారు , పదవికి ముందు విరమణ తర్వాత తన ఆస్తులను ప్రకటించారు. ఆయన జీవితం మార్గదర్శనం .

జడ్జి దగ్గర ఉండే బంట్రోతులు ఆ రెడ్ కాప్ ఉండటం, ఐరన్ బిళ్ళ ఉండటం అదంతా స్వేచ్చ కి విరుద్ధం అని వాటిని తీసేయించారు. తన కార్ మీద ఉండే రెడ్ బుల్బ్ ని తీసేసారు, SI రేంజ్ అధికారి తనకి గార్డ్ ఎందుకు అని ఒక్క constable యే సెక్యురిటి గా తీసుకున్నారు.

ఆయన ఛాంబర్ దగ్గర ఏర్పాటు చేసిన బోర్డ్ లో ఇలా రాసి ఉండేది.. ఇక్కడ ఎవరూ దేవతలు లేరు మీరు పూలు బొకేలు తీసుకురావద్దు… ఇక్కడ ఎవరు ఆకలితో లేరు మీరు పండ్లు స్వీట్లు తీసుకురావద్దు.. ఇక్కడ ఎవరు చలికి వనకడం లేదు మీరు శాలువాలు తీసుకురావద్దు. చాలా గ్రేట్ కదా…!
ఈ ఒక్క సీన్ చాలు..

” జై భీమ్” సినిమా Awesome movie….
కన్నీళ్లు వస్తాయి….

Hero Surya with justice chandru
 1. హీరోయిన్ తొడలు చూపించకుండా
 2. సింగిల్ hand తో రౌడీలను చిత్తకోట్టే ఫైట్స్ లేకుండా
 3. హీరో Entry song లేకుండా
 4. కామపు చూపులు లేకుండా
 5. జూగుస్పాకరమైన బూతులు లేకుండా
 6. వెకిలి కామెడీ చెయ్యడానికి అటు ఇటు కమెడియన్స్ లేకుండా
 7. ఒక్కటంటే ఒక్క డ్యూయెట్ song లేకుండా
 8. గ్రూప్ డాన్సర్స్ తో నిండిన ఒక్క song కూడా లేకుండా
 9. పంచ్ డైలాగ్ ఒక్కటి లేకుండా
 10. విదేశాల్లో అద్భుతమైన సీన్స్ లేకుండా
 11. స్క్రీన్ మొత్తం ఎప్పుడూ పట్టుచీరలు లేదా తొడలు పైవరకు ఉండే డ్రెస్సులు లేకుండా
 12. హీరోయిన్ కాకపోయినా అనుకోడానికి ఒక టీచర్, ఒక్క ప్రేమ చూపు లేకుండా
 13. చెవులు హోరెత్తిoచే Music లేకుండా
  పైవన్నీ లేకుండా కూడా ఒక మంచి సినిమా తీయొచ్చు అని నిరూపించిన CINEMA
  కన్నీళ్లు రాక మానవు…
  Wonderful Movie… ఇలాంటి ఒక న్యాయవాది సమాజానికి అవసరం
 14. లాయ‌ర్ చంద్రు క‌థే ‘జై భీమ్‌’. ఈ సినిమాలో చంద్రు పాత్ర‌లో హీరో సూర్య న‌టించారు. ఈయ‌న‌కు అటు త‌మిళంతో పాటు ఇటు తెలుగు ప్రేక్ష‌కుల్లోనూ మంచి ఆద‌ర‌ణ ఉంది. న‌టుడిగానే కాదు నిర్మాత‌గానూ ఆయ‌న న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ‘జై భీమ్‌’ సినిమాను రూపొందించారు.

JAI BHIM movie artists. మీ నటన అద్బుతం… మీ నటనతో సినిమా కి 100% న్యాయం చెసారు. ఇలాంటి ఆనిముత్యాలను సెలెక్ట్ చేసిన డైరెక్టక్ జ్నానవేల్ కు అభినందనలు. మీ ప్రతిభకు యావత్ భారతావని ఫిదా. ఆర్టిస్టులు అంతా వారీ పాత్రల్లో ఒదిగీపోయి జీవించారు. సహజత్వం ఉట్టిపడేలా చేసిన మేకప్ & కాస్ట్యూమ్స్ ప్రత్యేకం అని చెప్పాల్సిందే, యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేసే #సూర్యా గారు ఇలాంటి ఏమోషనల్, సెంటిమెంట్ సినిమాను కూడా చాలా చక్కగా స్టొరీకి తగ్గట్టు తన బాడీ లాంగ్వేజ్ ని హుందాగా,గంభీరంగా, ఎన్నో భవోద్వేగాలను ప్రదర్శించారు.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *