Bheemla Nayakకు ముందే మెరిసిన కిన్నెర మొగలయ్య

Bheemla Nayakకు ముందే మెరిసిన కిన్నెర మొగలయ్య

0 0
Read Time:5 Minute, 29 Second

Nice post of Gangadhar veerla on Bheemla Nayak Mogalayya… బంగారం మెరవాలన్నా ఏదో ఒక మూల నుంచి కాంతి పడాలి. గరుకైన గోడకు గీస్తేగానీ.. అది అసలు బంగారమో, నకిలీనో తెలియదు. వస్తువులేకాదు, ప్రతిభగల వ్యక్తులూ ప్రకాశించాలంటే ఎవరో ఒకరి దాపు కావాలి. అలా.. ఓ మనసున్న మారాజు వెలుగులోకి తెస్తే.. అలా.. అలా ప్రపంచానికి పరిచయం అయినవాడే 12 మెట్ల కిన్నెర మొగలయ్య. ఆ మనసున్న మారాజు పేరే కళారంగ.
..
కళ అనేది స్వయం ప్రకాశితం. కానీ, మరుగుపడ్డ ఏదైనా ఒక కళ బతికి బట్టకట్టాలంటే.. ఎవరో ఒకరు పనిగట్టుకుని కాపుకాయిల్సిందే.
ఇది నగ్న సత్యం. అలా.. మరుగునపడే ప్రమాదంలో పడ్డ కళాకారుడే మెట్ల కిన్నెర మొగలయ్య. ఒకప్పుడు.. ఏదో ఒక ప్రాంతంలో మాత్రమే.. కాస్త పరిచయం ఉన్న మెట్ల కిన్నెర వాయిద్యం ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతోంది. వినపడుతోంది. అందుకు జానపద కళల పక్షపాతి, పరిశోధకుడైన కళారంగ అనే ఓ సామాన్య కళాభిమానియే కారణం. ఇతడి వల్లనే మెట్లకిన్నెర మొగలయ్య అలియాస్ దర్శనం మొగలయ్య, ఇప్పుడు వెండితెరపైనా మారుమోగుతున్నాడు. తాజాగా భీమ్లా నాయక్ ఫేమ్ తో కొత్తగా, సరికొత్తగా మిలియన్ల ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు.
..
పవర్ స్టార్ సినిమా భీమ్లా నాయక్లో టైటిల్ సాంగ్ పాడటంతో.. కొత్తగా అందరికీ తెలిసిన మొగలయ్య, నిజానికి ఇప్పుడుకాదు, అయిదారేళ్ళక్రితమే మీడియాలో మారుమోగాడు. కళారంగా తన జానపద కళల పరిశోధనలో భాగంగా వెదికి వెదికి, బతిమాలి మరీ 12మెట్ల కిన్నెర మొగలయ్యను ఎక్కడో తెలంగాణాలోని మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్ వరకూ తీసుకొచ్చాడు. తనలోని కిన్నెర వాయిద్య ప్రతిభనంతా హైదరాబాద్ నగరమంతా చూసేలా, అచ్చెరవొందేలా, శభాష్ అనేలా తనదైన రెక్కల కష్షాన్ని వారధిగా కట్టాడు కళారంగ.
..
మెట్లకిన్నెర మొగలయ్యతో కళారంగ దాదాపు పదేళ్ళుగా ప్రయాణ చేస్తున్నాడు. అరుదైన ప్రాచీన జానపద కళలు, కిన్నెర వాయిద్య కళాకారుల మూలాలపై రంగా చేస్తున్న పరిశోధన వేటలో మట్టిలో మాణిక్యంలా దొరికాడు మొగలయ్య. ఇప్పుడు.. సినిమా ఫేమ్ వల్ల కొత్తగా చెప్పుకుంటున్నారుగానీ 2012 సంవత్సరంలోనే, బంజరాహిల్స్ లోని లమాకాన్ లాంటి కళావేదికలపై కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య మెట్లకిన్నెర మొగలయ్యతో ప్రదర్శన చేయించి.. మీడియా అంతా మొగలయ్యవైపు కెమెరాలు పెట్టేలా, ప్రత్యేక ఇంటర్వ్యూలు, కథనాలు చేసేలా, రాసేలా చేశాడు రంగ. అలా ఆరోజు మొదలు, రవీంద్రభారతి నుంచి ఢిల్లీ వేదికల వరకూ అనేకనేక ప్రదర్శనలు, ప్రభుత్వ గుర్తింపులు, ఆర్ధిక చేయూతతో మెట్లకిన్నెర మొగలయ్య ప్రత్యేక గుర్తింపుతో వెలుగులోకొచ్చాడు.
..
నాటి ప్లాష్ బ్యాక్ లోకి వెళితే, 2014 సెప్టెంబరు మాసం, హైదరాబాద్ లమాకాన్ లో మొగలయ్య ప్రదర్శన పూర్తయ్యాక.. అర్ధరాత్రి సమయంలో 99 టీవి కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ (99 అడ్డా) ఎపిసోడ్ షూట్ చేశాం. ఇలా కళారంగా సహాయంతో మొగలయ్యను తొలిసారిగా తెలుగు మీడియాలో చూపించే అవకాశం నాకు దక్కింది. పాత్రికేయుడిగా ఇదొక తృప్తికరమైన సందర్భం.
..

దర్శనం మొగలయ్యది నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం, అవుసలికుంట గ్రామం. తమ పూర్వీకుల నుంచి వచ్చిన తొమ్మిది మెట్ల కిన్నెర ను 12 మెట్ల కిన్నెర గా మలచాడు మొగులయ్య. ఇదే వీరి ఉపాధి. భిక్షుక గానంతో పొట్టగడుపుకుంటారు. వీరి అస్తిత్వం కూడా ఇదే.

అంతరించిపోతున్న కళల జాబితాలో ఉన్న ఈ మొట్టకిన్నెరను నమ్ముకుని మొగలయ్యలాంటి కళాకారులూ ఇంకా తెలంగాణా ప్రాంతంలో చాలామందే ఉన్నారు. కేవలం మొగలయ్యను మాత్రమే కాకుండా మిగితా వారి కళాప్రతిభనూ వెలుగులోకి తీసుకువచ్చి, వారిని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపైనా ఉంది.

మెట్లకిన్నెర మొగలయ్య.. ఓ కళారంగ

-గంగాధర్ వీర్ల

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *