సంక్రాంతిలోగా కొత్త కేబినెట్‌.. మాజీలూ హ్యాపీ ఎందుకంటే..

సంక్రాంతిలోగా కొత్త కేబినెట్‌.. మాజీలూ హ్యాపీ ఎందుకంటే..

0 0
Read Time:3 Minute, 26 Second

YS Jagan New Cabinet ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేబినెట్‌ కోసం కసరత్తు ప్రారంభమయ్యింది. రెండున్నరేళ్లకు మంత్రివర్గ మార్పు ఉంటుందని ముందే చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన కొత్త టీమ్‌ ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో విడతల వారీగా సమావేశాలు జరపాలని జగన్‌ నిర్ణయించారు. ముందుగా ఎంపీలతో జగన్‌ సమావేశమవుతున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుని దసరా నుంచి సంక్రాంతి లోగా కొత్త కేబినెట్‌ను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి.

రానున్న పరిణామాల్లో ముఖ్యమైనవి ఇవీ…
మంత్రి వర్గం మొత్తాన్ని మార్చడం లేదు.. ముఖ్యమైన కొందరిని కొనసాగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
80 శాతం మంది మంత్రులను తీసేసి వారి స్థానంలో కొత్తవారికి అవకాశమివ్వనున్నారు.
ఇందులో అనుభవం, సామాజిక సమీకరణాలు, భవిష్యత్‌ ఎన్నికలు పరిగణనలోకి తీసుకుంటున్నారు.
2024 ఎన్నికల కోసం ముఖ్యమంత్రి రెండు టీమ్‌లను సిద్ధం చేస్తున్నారు.
ఒకటి కొత్త కేబినెట్, రెండోది పార్టీ ఆఫీస్‌ బేరర్స్‌.

మంత్రులకు కొత్త బాధ్యతలు
కేబినెట్‌లో నుంచి ఉద్వాసనకు గురయ్యేవారికి పార్టీలో ఆఫీస్‌బేరర్స్‌గా కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారు. ఎన్నికలకు ఈ టీమ్‌ కూడా కీలకం కాబోతున్నది.
దసరా తర్వాత సంక్రాంతి లోగా కొత్త కేబినెట్‌ YS Jagan New Cabinet ను ప్రకటించే అవకాశం ఉంది.
మంత్రి వర్గం నుంచి తీసేసినా పార్టీలో కీలక స్థానం ఇవ్వనున్నారు కాబట్టి మంత్రులంతా హ్యాపీగానే ఉంటారని భావిస్తున్నారు. ఇదే విషయం కొద్ది రోజుల క్రితం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాటల్లో కూడా ప్రస్ఫుటమయ్యింది. మంత్రులందరినీ మార్చాలని జగన్‌ భావిస్తున్నారని, తనకు ఏ బాధ్యత అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తానని శ్రీనివాసరెడ్డి అన్నారు.

Also Read : Spandana Review డిసెంబర్‌ నుంచి జనంలోకి జగన్‌

అయితే డిసెంబర్‌లోగా కేబినెట్‌పై ఒక నిర్ణయానికి వచ్చేస్తారని, అది కొలిక్కి వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి జనంలోకి వెళ్తారని పార్టీ వర్గాలంటున్నాయి. డిసెంబర్‌లో సచివాలయాల సందర్శన ప్రారంభిస్తానని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ఆలోగానే కేబినెట్‌పై ఒక స్పష్టత వచ్చేస్తుందని అంటున్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *