గతమంతా ‘ఘనం’… గుర్తుచేసిన ‘చుక్క, ముక్క, పక్క’

గతమంతా ‘ఘనం’… గుర్తుచేసిన ‘చుక్క, ముక్క, పక్క’

0 0
Read Time:9 Minute, 50 Second

నారా లోకేష్‌ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. కానీ ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న సోషల్‌ మీడియా మాత్రం విపరీతమైన పోకడలతో విశృంఖలంగా తయారయ్యిందని విమర్శకులంటున్నారు. ‘‘నిన్న చుక్క, నేడు ముక్క, రేపు పక్క’’ అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రంగులతో ఉన్న సోషల్‌ మీడియా పోస్టులు తయారు చేసి అసభ్యంగా ఉన్న ఫొటోలు పెట్టి తెలుగుదేశం పార్టీ సోషల్‌మీడియాలో తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. మద్యనిషేధం అమలు చేస్తానన్న జగన్‌మోహన్‌రెడ్డి మద్యాన్ని ప్రభుత్వ ఉద్యోగులచేతనే అమ్మిస్తున్నారని, మాంసం మాల్స్‌ పెట్టి ఉద్యోగుల చేత మాంసం అమ్మించాలని నిర్ణయం తీసుకున్నారని, ఇక రేపు పక్కలేసి ఆదాయం సమకూర్చుకుంటారని అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. ఈ విమర్శలకు వైఎస్సార్సీపీ ఘాటుగానే స్పందించింది. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన అనేక పరిణామాలను, లోకేష్‌ గత చరిత్రను ఆ పార్టీ నాయకులు తూర్పారబడుతున్నారు. TDP YSRCP Social Media

ఆదాయం కోసం, ఉద్యోగుల జీతాల కోసం చంద్రబాబు మద్యనిషేధాన్ని ఎత్తేశారట. ఇదిగో రుజువు..

మద్యనిషేధాన్ని ఎత్తేసిందెవరు?
లోకేష్‌కు తెలియని విషయమేమిటంటే 1995లో ఆయన తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావుకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి పదవి నుంచి దించేసే నాటికి రాష్ట్రంలో మద్య నిషేధం అమలులో ఉంది. ఆ తర్వాత ఆదాయాన్ని పెంచుకోవడం కోసం మద్యనిషేధాన్ని 1997లో ఎత్తేసింది చంద్రబాబు నాయుడేనన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయాన్ని ఆయన కన్వీనియంట్‌గా మరచిపోయినట్లు నటిస్తూ ఎదుటివారిపై విమర్శలు చేస్తుంటారు. మద్యనిషేధాన్ని ఎత్తేయడమే కాక ఊరూవాడా బెల్టుషాపులను విస్తరించిన చంద్రబాబుకు గానీ ఆయన వారసులకు గానీ మద్యం గురించి మాట్లాడే హక్కు ఉందా అని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

బాబు వారుణివాహినిలో మద్యం అమ్మిందెవరు?
ఇక లోకేష్‌కు తెలియని మరో విషయమేమిటంటే మద్యనిషేధాన్ని ఎత్తేయడమే కాదు. చంద్రబాబు హయాంలో వారుణివాహిని అనే పథకం కూడా అమలయ్యింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలలో పోలీస్‌స్టేషన్లలో పోలీసుల చేత మద్యం అమ్మించి అక్కడ కూడా సొమ్ము చేసుకునేందుకు తీసుకొచ్చిన పథకమది. పోలీసుల చేత మద్యం అమ్మించిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని దేశమంతా ముక్కున వేలేసుకుంది. దీనిపై ఏమన్నా డౌటుంటే చంద్రబాబును అడిగి లోకేష్‌ ధృవీకరించుకోవచ్చు. మద్యం డిస్టిలరీలకు ఎడాపెడా అనుమతులిచ్చి వందల కోట్ల రూపాయల మేర లంచాలు తీసుకున్న చరిత్ర చంద్రబాబుది. దీనిని పూర్తి ఆధారాలతో సహా నాటి ఎమ్మెల్యే ఎం.వి. మైసూరా రెడ్డి సాక్షాత్తూ అసెంబ్లీలో బయటపెట్టారు.

మన హయాంలో ముక్కలు అమ్మలేదా..
ఆంధ్రప్రదేశ్‌ మీట్‌ అండ్‌ పౌల్ట్రీ ఫెడరేషన్‌ ఎప్పటి నుంచో ఉంది. ఆ విషయం లోకేష్‌కు తెలియదా? ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల సంస్థ ద్వారా కూరగాయలు అమ్మించడం కూడా కొత్త విషయమేమీ కాదు. ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా రిటైల్‌ ఔట్‌లెట్స్‌ పెట్టి చేపలు అమ్మించడం కూడా ఎప్పటి నుంచో జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాత సెక్రటేరియట్‌ కు దగ్గరలోనే ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఔట్‌లెట్‌ ఉంది. అది చాలా ఫామౌస్‌ ఔట్‌లెట్‌. అంటే టీడీపీ హయాంలో కూడా ముక్కల అమ్మకాలుండేవన్నమాటే కదా.. 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ నారా చంద్రబాబు నాయుడు మీ ఇంట్లోనే ఉన్నారు కదా.. ఈ విషయాలు అడిగి తెలుసుకోవచ్చు కదా లోకేషూ అని వైఎస్సార్సీపీ నాయకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తి సమయం ఖాళీగా ఉన్నారు కనుక ఆయనతో వీటిపై క్లాసులు పెట్టించుకోవచ్చు కదా అని సలహా ఇస్తున్నారు.

Also Read : తరచూ పలుచనౌతున్న పవన్‌.. పార్టీలో అంతర్మథనం..

పక్కలేయడంలో పేటెంట్‌ ఎవరిది?
ఇక తెలుగుదేశం పార్టీ పోస్టుల్లో మూడో అంశమైన రేపు పక్క అనే అంశం మరీ తీవ్రమైనది. ఆ విషయంలో అధికార పార్టీకి ఎలాంటి అనుభవమూ లేదు. వారిదంతా పాదయాత్రలు, ఓదార్పు యాత్రల రూటు. పక్కసేసి పార్టీకి లాగేసుకోవడం, పక్కలేసి ‘జయప్రదం’గా న్యాయవ్యవస్థను లోబరుచుకోవడం వాళ్లకు తెలియని పని అని వైఎస్సార్సీపీ నాయకులు అంటున్నారు. తన రెక్కల కష్టంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాగేసుకోవడమే కాక పార్టీ బ్యాంకు అకౌంట్లను, అందులోని సొమ్మును కూడా ఎలా కాజేయగలిగారు? జయప్రదంగా పక్కలేసి న్యాయవ్యవస్థను మేనేజ్‌ చేయడం ద్వారానే కదా అని వారు ప్రశ్నిస్తున్నారు.

అమెరికాలో అంతా చదివేశారుగా..
మహిళల కోసం, మహిళల రక్షణ కోసం లోకేష్‌ నడుంబిగించాననడం ఎంత హాస్యాస్పదమైన విషయమో. అమెరికాలో విద్యాభ్యాసానికి వెళ్లిన లోకేష్‌ ఎంత బాగా చదివారో చెప్పేందుకు ఆ మధ్య అనేక ఫొటోలు విడుదలయ్యాయి. మద్యం తాగుతూ, అమ్మాయిల నడుం చుట్టూ తాడు వేసి ఊపుతూ విలాసవంతంగా ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలు చూస్తే చాలు ఆయనకు మహిళలంటే ఎంత గౌరవముందో.. మహిళల పట్ల ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో అన్న విషయం తెలుసుకోవడానికి… స్విమ్మింగ్‌పూల్స్‌లోనూ, బార్లలోనూ, తెల్లతోలు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అసహ్యకరంగా వ్యవహరించిన నారా లోకేష్‌ ఫొటోలు నెట్‌లో ఎక్కడ చూసినా కనిపిస్తాయి.. జగన్‌మోహన్‌రెడ్డి అలా ఎక్కడన్నా కనిపించారా.. అలాంటి తప్పుడు పనులెప్పుడూ జగన్‌ చేయలేదని వైఎస్సార్సీపీ నాయకులంటున్నారు.

కోలా చెప్పిన 14 ఏళ్ల కొడుకు సంగతేమిటి?
మహిళల పట్ల అపారమైన గౌరవమున్నట్లు, మహిళల ఉద్ధరణకు తాను కంకణం కట్టుకున్నట్లు నారా లోకేష్‌ ఇపుడు మాట్లాడుతున్నాడు. కానీ 1998లో యూరో లాటరీ గెలిచినట్లు అందరినీ మోసం చేసి, తెలుగుదేశంపార్టీకి 10 లక్షల రూపాయల విరాళం కూడా ఇచ్చిన కోలా కృష్ణమోహన్‌ చెప్పిన విషయాలు వింటే మనం మూర్ఛపోవడం ఖాయం. ఇంటర్‌ చదువుకునే రోజుల్లోనే ఒక మహిళతో లేచిపోయిన నారా లోకేష్‌ను చాలా రోజులకు వెతికి పట్టుకున్నారని, వారిద్దరకూ పుట్టిన బాలుడికి 14 ఏళ్లు వచ్చాయని, ఆ కుర్రాడికి సంతోష్‌ అనే పేరు కూడా లోకేష్‌ పెట్టాడని 2014లో పత్రికా విలేకరుల సమావేశంలో కోలా కృష్ణమోహన్‌ ఆరోపించాడు. అంతేకాదు ఆ యువతిని, బాలుడిని తాను తీసుకువస్తానని, ఆ బాలుడికి, లోకేష్‌కి డీఎన్‌ఏ పరీక్ష చేస్తే నిజానిజాలు బయటపడతాయని సవాల్‌ విసిరాడు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇన్ని ఆరోపణలెదుర్కొంటున్న నారా లోకేష్‌ ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రత గురించి, మహిళల ఉద్ధరణ గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *