చంద్రబాబును గడికోట అన్నిమాటలు అనేశాడేమిటో..

చంద్రబాబును గడికోట అన్నిమాటలు అనేశాడేమిటో..

0 0
Read Time:4 Minute, 21 Second

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడుపై నిప్పులు కురిపించారు. చంద్రబాబు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజాచైతన్యయాత్ర పేరుతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఎద్దేవా చేశారు. మూడు సార్లు సిఎంగా చేసిన వ్యక్తి ఇలాగేనా వ్యవహరించేది అని ప్రశ్నించారు. చంద్రబాబును శాడిస్ట్‌ అని, ఆయనది నీచ సంస్కృతి అని విమర్శలు కురిపించారు. ( Srikanth Reddy critisises chandrababu ) అందుకు అనేక ఉదంతాలను ఉదహరించారు.. అవేమిటో మీరే చూడంది…..

‘‘చంద్రబాబు అసైన్డ్‌ ల్యాండ్‌ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. పేదప్రజలకు ఒక్క గజం స్ధలం అయినా పంచావా.. 15 ఏళ్లు సిఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా భూమి పంపిణి చేశావా? రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత ఉందా చందబాబూ.. హంద్రీనీవాను కేవలం ఐదు టిఎంసిలకు పరిమితం చేశావు. హంద్రీనీవాకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు.

వైయస్‌ రాజశేఖరరెడ్డి తన ఐదేళ్ల కాలంలో హంద్రీనీవా ప్రాజెక్ట్‌ ను నీ జిఓలను చించివేసి తిరిగి 40 టిఎంసిలకు సామర్థ్యాన్ని పెంచి అనంతపురం ప్రజలకు దేవుడిలా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు అనంతపురం జిల్లాకు హార్టికల్చర్‌ వచ్చింది.అది వైయస్‌ చలవ కాదా.

Also Read : చంద్రబాబుకు అంబటి అంటించిన చురకలివే..

15 ఏళ్లు గ్రాఫిక్స్‌ తో చంద్రబాబు కాలం గడిపారు. సిఎం శ్రీ వైయస్‌ జగన్‌ పై ఎన్ని వ్యాఖ్యలు చేసినా మౌనంగా భరిస్తున్నాం. చంద్రబాబు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు హయాంలో ప్రతిపక్షఎంఎల్‌ఏలపై దాడులు జరిగాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అధికారపార్టీ ఎంఎల్‌ ఏలపై దాడులు చేస్తున్నారు. మీరు దౌర్జన్యాలు చేస్తే భయపడతామని అనుకుంటున్నారా? ఇకనైనా చంద్రబాబు నీచ సంస్కృతికి తెరదించాలి.

వైయస్‌ జగన్‌ గారు సంక్షేమ పధకాల అమలులో చరిత్ర సృష్టిస్తున్నారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని దుష్ప్రచారంచేస్తావా? దమ్ము,ధైర్యం ఉంటే చర్చకు రా. బిసి ల రిజర్వేషన్ల గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. నిజంగా సిగ్గుందా. ఆ అంశంపై కర్నూలుకు చెందిన వ్యక్తితో పిల్‌ వేయించింది నీవుకాదా చంద్రబాబూ..

మద్యపానం తగ్గించేలా చేయాల్సిన చంద్రబాబు దానిని తాగించేలా దిగజారి మాట్లాడుతున్నారు. మద్యపానం నిషేధం దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కానీ చంద్రబాబు ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. రాష్ట్రం అభివృద్ధి చెందడాన్ని పచ్చదండు జీర్ణించుకోలేకపోతోంది.

చంద్రబాబు అక్రమ నిర్మాణంలో ఉంటూ నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. రాష్ట్రానుంచి పరిశ్రమలు పోతున్నాయంటే బాధపడాలి. చంద్రబాబు లాంటి శాడిస్ట్‌ పరిశ్రమ పోతుందంటే ఆనందపడుతున్నారు. పాస్‌ బుక్‌ కోసం లక్షరూపాయిలు లంచం నీ (చంద్రబాబు) హయాంలో ఇచ్చానని మీ కార్యకర్త చెప్పినా మీరు సిగ్గుపడలేదు చంద్రబాబూ..’’ అని గడికోట విమర్శల వర్షం కురిపించారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

4 thoughts on “చంద్రబాబును గడికోట అన్నిమాటలు అనేశాడేమిటో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *