పుష్ప శ్రీవాణి టంగ్‌ స్లిప్‌.. ఆడుకుంటున్న టీడీపీ..

పుష్ప శ్రీవాణి టంగ్‌ స్లిప్‌.. ఆడుకుంటున్న టీడీపీ..

0 0
Read Time:2 Minute, 4 Second

‘రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న’ అంటూ టిక్‌టాక్‌ వీడియోతో అదరగొట్టిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి అంతలోనే టంగ్‌ స్లిప్‌ అయిపోయి టీడీపీ శ్రేణులకు దొరికి పోయారు. మీకు టిక్‌ టాక్‌ వీడియోలే కరెక్ట్‌ మీరు మంత్రి పదవికి పనికిరారు అంటూ వారు ఎద్దేవా చేస్తున్నారు.

ఇంతకీ పుష్ప శ్రీ వాణి ఏమన్నారంటే.. జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ఒక విజన్‌తో ఆలోచించి పదమూడు రాష్ట్రాలు ఒకే విధంగా.. అభివృద్ది చెందే దిశగా ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్నారు.’’ పదమూడు జిల్లాలు అనబోయి పదమూడు రాష్ట్రాలు అన్నారన్నమాట. అనాలోచితంగా మాట్లాడితే ఇలానే దొరికిపోతారు. ‘అమ్మో టిక్‌టాక్‌ బెటర్‌.. లేకపోతే విద్యార్థులకు ఉన్న కెనాలెడ్జ్‌ పోతుంది’ అని తెలుగుదేశం పొలిటికల్‌ వింగ్‌ పేజీలో రాశారు. నాలెడ్జ్‌కు ముందు కె సైలెంట్‌ అని తెలియక దానిని కూడా చేర్చారు.

గతంలో లోకేష్‌ మంగళగిరిని మందలగిరి అని పలకడాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు బాగా ట్రోల్‌ చేశాయి. ఎన్నికల్లో పదేపదే చూపిస్తూ ప్రచారానికి విరివిగా వాడుకున్నాయి. నియోజకవర్గం పేరును కూడా సరిగ్గా పలకలేని ముఖ్యమంత్రి సుపుత్రుడు అంటూ ఆడుకున్నాయి. అలాగే వైఎస్సార్సీపీ నాయకులు ఎవరు ఎప్పుడు దొరుకుతారా అని టీడీపీ చూడడంలో తప్పులేదు. ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారు కాస్త అదుపులో ఉండాల్సిందేగా..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *