పవన్‌ కల్యాణ్‌కు మంచి బూస్ట్‌ ఇచ్చిన వైఎస్సార్సీపీ

పవన్‌ కల్యాణ్‌కు మంచి బూస్ట్‌ ఇచ్చిన వైఎస్సార్సీపీ

0 0
Read Time:8 Minute, 57 Second

పవన్‌ కల్యాణ్‌కు వైఎస్సార్సీపీ బూస్ట్‌ ఇవ్వడమేమిటి అనుకుంటున్నారా? మీరు పొరబడలేదు. ఈ పుణ్యం వైఎస్సార్సీపీదే. రిపబ్లిక్‌ సినిమా ఈవెంట్‌ వరకు పవన్‌ కల్యాణ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇపుడు వేరు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్వరాన్ని బాగా పెంచి మాట్లాడేందుకు తగినంత పట్టు దొరికింది. బుధవారం మంగళగిరిలో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో జనసేన అధ్యక్షుడి ప్రసంగంలో ఈ విషయం ప్రస్ఫుటంగా కనిపించింది. రిపబ్లిక్‌ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగానికి ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి గమనిస్తే వైఎస్సార్సీపీ చేసిన పొరపాటు ఏమిటో అర్థమౌతుంది. Pawan Kalyan YSRCP

ఆ విషయం పవన్‌ కల్యాణ్‌కు తెలుసు..

జనసేనను గానీ, ఆ పార్టీ అధ్యక్షుని గానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టించుకోరు. కాదు కావాలని విస్మరిస్తారు. ఎందుకంటే అంతకు మించి ప్రాధాన్యత ఇవ్వవలసిన వ్యక్తి కాదు కాబట్టి. రకరకాల ఎత్తులు వేసి, విరుద్ధ సిద్ధాంతాలున్న పార్టీలతో చేతులు కలిపి కిందా మీదా పడి 2019లో జనసేన గెలిచింది ఒక్క ఎమ్మెల్యే సీటు. తీరా చూస్తే అది కూడా ఆ రాజోలులో రాపాక వరప్రసాద్‌ సొంత బలం ప్రభావమే ఎక్కువని ఆ తర్వాత తేలింది. అంటే జనసేన ప్రభావం గాలికి పోయే పేలపిండి లెక్క. జనసేన సొంతంగా గెలవలేదు.. కానీ ఎవరితోనైనా చేతులు కలిపితే వేరెవరినో ఓడించడానికి కొన్ని నియోజకవర్గాలలో పనికివస్తుంది. ఆ విషయం 2014లో స్పష్టంగా తేలింది. ఆవిషయం జనసేన సీనియర్‌ నాయకులకు, ఆపార్టీ అధ్యక్షుడైన పవన్‌ కల్యాణ్‌కు తెలుసు. కానీ ప్రజారాజ్యంలాగా పార్టీని విలీనం చేసి చేతులు దులుపుకునే అవకాశమే లేదు. ఏదో ఒకటి చేసి రాజకీయాల్లోనే తేల్చుకోవాలి.

సినిమాలలో ఇక సినిమా అయిపోయింది…

ఎందుకంటే అటు సినిమాలలో ఇక సినిమా అయిపోయింది. బెనిఫిట్‌ షోలు, బ్లాక్‌ టికెట్లు, ఎక్కువ రేట్లకు అభిమానులకు టికెట్లు అంటగట్టే ఎత్తులు అన్నీ పోయాయి. ఇక నికరంగా బొమ్మ ఎక్కువ రోజులు ఆడితేనే చిల్లర ఏరుకోవాలి. అగ్రిమెంట్‌ చేసుకున్న 5 సినిమాల రెమ్యునరేషన్‌తో 2024 ఎన్నికలకు సిద్దమవుదామనుకున్న పవన్‌ కల్యాణ్‌కు ఈ ఆన్‌లైన్‌ టికెటింగ్‌ పెద్ద గండికొట్టింది. పైన చెప్పుకున్న బెనిఫిట్‌ షోలు, బ్లాక్‌ టికెట్లు ఉండవు కాబట్టి సినిమాకు వచ్చే ఆదాయాన్ని బట్టే రెమ్యునరేషన్‌ ఉంటుంది. అన్నీ లెక్కేసి నిర్మాతలు రెమ్యునరేషన్‌ ఇస్తారు. అంటే ఓ ఐదో పదో అంతే. ఐదు సినిమాలలో దాదాపు 300 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం పోయింది. అగ్ర హీరోలకు, పెద్ద దర్శకులకు అందరికీ ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సమస్యే కానీ వాళ్లకు అదే వ్యాపకం కాబట్టి కాస్త రెమ్యునరేషన్‌ తగ్గించుకుని సర్దుకుపోతారు. ప్రభుత్వాలతో మంచిగా ఉంటే బెనిఫిట్‌ షోలకు ప్రత్యేక అనుమతులిస్తారు. లేదంటే రాయితీలు పెంచుతారు. పవన్‌కు మాత్రం ఆ అవకాశం లేదు. ఒక ప్రత్యేక రాజకీయ లక్ష్యం ఉన్న పవన్‌ కల్యాణ్‌కు ఇది ఊహించని దెబ్బ. దాని ఫలితమే రిపబ్లిక్‌ సినిమా ఈవెంట్‌లో ఆయన రియాక్షన్‌. దానికి రెండు లక్ష్యాలున్నాయి. ఒకటి వరుస విజయాలు సాధిస్తున్న వైఎస్సార్సీపీ ఘనత నుంచి జనం దృష్టి మరల్చాలి. జనసేన పరువు మరింత పోయి చివరకు గ్లాసు గుర్తు కూడా పోయిన విషయం నుంచి జనం దృష్టిని డైవర్ట్‌ చేయాలి. అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకోవాలి.

పవన్‌ కల్యాణ్‌ ఏదో నోరు జారి మాట్లాడలేదు… Pawan kalyan ysrcp

అందుకే రిపబ్లిక్‌ ఈవెంట్‌ను ఆయన ఉపయోగించుకున్నారు. ఈ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్‌ ఏదో నోరు జారి మాట్లాడలేదు. ఆయన మాట్లాడాలనుకున్న ప్రతి అంశాన్నీ పేపర్‌పై రాసుకొచ్చి మరీ మాట్లాడారు. కావాలనే మంత్రిపై వ్యాఖ్యలు చేశారు. కావాలనే ముఖ్యమంత్రిపై వ్యాఖ్యాలు చేశారు. కావాలనే కోడికత్తి కేసు, వివేకా హత్యకేసు, ఇడుపులపాయ నేలమాళిగల్లో డబ్బు, లక్షకోట్ల అవినీతి కేసుల గురించి మాట్లాడారు. కావాలనే కులాల ప్రస్తావన చేశారు. అన్నీ కావాలనే.. ఒక పథకం ప్రకారమే మాట్లాడారు. ఆ తర్వాత జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల వరకు మూడు రోజుల పరిణామాలను గమనిస్తే పవన్‌ కల్యాణ్‌ ఎత్తుగడ ఫలించిందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ మూడు రోజులూ వైఎసార్సీపీ మంత్రులు, నాయకులు, సోషల్‌ మీడియా సైనికులు అన్ని పనులూ వదిలేసి పవన్‌ కల్యాణ్‌ను తిట్టడం మొదలుపెట్టారు. పార్టీ అధికారికంగానే ఐదుగురు నాయకులతో మాట్లాడించింది. నటుడు, వైఎస్సార్సీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి ఈ అంకాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. అందరూ పవన్‌ కల్యాణ్‌పై దుమ్మెత్తి పోశారు. ఆతర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.. పవన్‌ అనుకున్న లక్ష్యం నెరవేరింది. పవన్‌ ట్రాప్‌లో అందరూ పడ్డారు.

జనం దృష్టిని మరల్చడంలో పవన్‌ కల్యాణ్‌ విజయం Pawan kalyan ysrcp

దీనివల్ల ఏం జరిగింది? దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలలో వైఎస్సార్సీపీ సాధించిన ఘన విజయాలు మరుగున పడిపోయాయి. ఒక రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల్లోని జడ్‌పి అధ్యక్ష పీఠాలపై ఒకే పార్టీ నాయకులు కూర్చున్న అద్భుతమైన అంశం మరుగున పడిపోయింది. చాలా జిల్లాల్లోని జిల్లా పరిషత్‌లలో అసలు ప్రతిపక్షమే లేనంత గొప్ప విజయం మరుగున పడిపోయింది. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం TDP పరిస్థితి ఏమిటి.. ఏమిటి ఇలా దారుణంగా మారిపోయింది.. ఇక రానున్న 2024లో ప్రతిపక్షాల పరిస్థితి ఏమిటి అని జనం చర్చించుకుంటున్నారు.. ఆ విషయంపై చర్చ ఆగిపోయింది. అందరి అటెన్షన్‌ డైవర్ట్‌ అయిపోయింది. అందరూ ఇపుడు పవన్‌ కల్యాణ్‌ను ఎందుకు వైఎస్సార్సీపీ నాయకులు అలా తిడుతున్నారు అని చర్చించుకుంటున్నారు. ఇది పవన్‌కు ఏదో సానుభూతి సంపాదించిపెడుతుందని కాదు.. దానివల్ల ఓట్ల శాతాల్లో మార్పులు వస్తాయనీ కాదు.. వైఎస్సార్సీపీ సాధిస్తున్న వరుస విజయాలు, అధికార పార్టీ పనితీరు, రాష్ట్రంలో సాగుతున్న సంక్షేమ పాలన ఇలాంటి విషయాలపై చర్చ జరగకుండా వాటిపై జనం దృష్టిని మరల్చడంలో మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించారు. అందుకు తోడ్పాటు అందించింది నిస్సందేహంగా వైఎస్సార్సీపీనే.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *