రేపిస్టులపై వైఖరి మారిందా.. కఠినంగా శిక్షించాలంటున్న పవన్‌కల్యాణ్‌

రేపిస్టులపై వైఖరి మారిందా.. కఠినంగా శిక్షించాలంటున్న పవన్‌కల్యాణ్‌

0 0
Read Time:5 Minute, 20 Second

ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా హత్య చేసిన మృగాడిని బహిరంగంగా ఉరితీయాలని, ఎన్‌కౌంటర్‌ చేయాలని జనమంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. చైత్ర హంతకుడి కోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. దాదాపు వెయ్యిమంది పోలీసులు ఊరూవాడా వెతుకుతున్నారు. ఈ హంతకుడిని పట్టుకున్నవారికి 10 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. కాగా చైత్ర కుటుంబాన్ని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందని, సభ్యసమాజం తలదించుకునేలా ఈ ఘటన ఉందని అన్నారు. చైత్ర కుటుంబాన్ని అందరూ పరామర్శించాలని, ఆ కుటుంబానికి అండగా ఉండాలని అన్నారు. అంతేకాదు చైత్రపై అత్యాచారం చేసి హత్య చేసిన హంతకుడు రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం అతన్ని కఠినంగా శిక్షించాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. Pawan Kalyan on Rapists

అయితే రేపిస్టుల విషయంలో పవన్‌ కల్యాణ్‌ వైఖరి ఏమిటి ఇలా మారిపోయింది అని జనం చర్చించుకుంటున్నారు. ఎందుకంటే 2019 డిసెంబర్‌లో దిశ హంతకులను ఎన్‌కౌంటర్‌ చేసినపుడు పవన్‌ కల్యాణ్‌ తిరుపతిలో మాట్లాడారు. రేపిస్టులను ఉరితీయడం, ఎన్‌కౌంటర్‌ చేయడం వంటి చర్యలు కూడదని అప్పుడు ఆయన సెలవిచ్చారు. రేపిస్టులను బెత్తాలతో తోలు ఊడేలా కొడితే సరిపోతుందని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. మీడియాలోనూ, సోషల్‌ మీడియాలోనూ ఈ విషయం ప్రముఖంగా వచ్చింది. పవన్‌ కల్యాణ్‌ ఈ విషయాలను తిరుపతిలో పార్టీ సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ఆయనేమన్నారంటే… ‘‘దిశ హంతకులను పట్టుకున్నపుడు అందరూ ఒక్కదగ్గర చేసి వారిని ఉరితీయాలని, కాల్చి చంపాలని, తగలబెట్టేయాలని డిమాండ్‌ చేశారు. ఇక ఢిల్లీలో ఇలాంటి ఘటన జరిగినపుడు హైకోర్టో.. సుప్రీంకోర్టో గుర్తులేదు కానీ.. జడ్జి ఒకరు ఇంకా తీవ్రంగా స్పందించారు. రేపిస్టుల మర్మాంగాలను కోసేయాలని అన్నారు. ఒక జడ్జి అయి ఉండి ఇంత తీవ్రంగా ఎలా మాట్లాడతారో నాకు అంతుపట్టడం లేదు. నేనేమంటున్నానంటే.. రేపిస్టులను నలుగురూ చూస్తుండగా చర్మం ఊడేలా నాలుగు బెత్తం దెబ్బలు వేయాలి. అంతే ఇక వారు ఎప్పుడూ అలాంటి పనులు చేయరు’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. రేపిస్టులపై ఆయన స్పందన చూసి అపుడు జనసైన కార్యకర్తలు, ఆయన అభిమానులతో సహా అందరూ ఆశ్చర్యపోయారు.

ప్రముఖ ఆంగ్ల పత్రిక డక్కన్‌ క్రానికల్‌లో వచ్చిన క్లిప్పింగ్‌ ఈ దిగువ ఉంది చూడండి.
అలాగే అన్ని జాతీయ పత్రికలలోనూ ఈ విషయం ప్రముఖంగా వచ్చింది
.

https://www.business-standard.com/article/news-ani/beat-rape-accused-with-sugarcane-until-skin-rips-off-jsp-chief-pawan-kalyan-119120401334_1.html

https://www.deccanchronicle.com/nation/current-affairs/041219/beat-rape-accused-with-sugarcane-until-skin-rips-off-jsp-chief-pawan.html

https://www.aninews.in/news/national/general-news/beat-rape-accused-with-sugarcane-until-skin-rips-off-jsp-chief-pawan-kalyan20191204194739/

Jana Sena Party (JSP) chief and popular film actor Pawan Kalyan has said the accused in Disha case should be beaten up with canes until their skin rips off, but not be hanged. Speaking at the meeting of party workers here on Tuesday, Kalyan said: “When the four rapists of Disha were being sent to jail in Hyderabad, thousands of people reached there and demanded to lynch the culprits or hang them to death.” “In another case in Delhi, a judge of the High Court or the Supreme Court told that the private parts of the culprits should be chopped off. Even the judge’s anger has peaked,” he said.

“What I would like to say … If a woman goes out and comes home by evening, and if something happens to her, the person responsible for it should be given two smacks with a cane in front of everyone till his skin rips off … We should remember that we don’t have the right to kill a person,” he added.

రేపిస్టులపై పవన్‌ కల్యాణ్‌ స్పందన

ఇపుడు చైత్ర కుటుంబాన్ని పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌ ఎందుకో గానీ తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తుంది. బెత్తం దెబ్బల ప్రస్తావన చేయలేదు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *