బాబుకు ముద్రగడ లేఖ (నవంబర్ 23 , 2021 ) (Mudragada letter to Chandrababu) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. “మీ భార్య ను ఎదో అన్నారని మీరు వెక్కి వెక్కి ఏడవడం TV లో చూసి ఆశ్చర్యపోయాను. మా కాపు జాతికి మీరిచ్చిన హామీ కొరకు దీక్ష మొదలు పెట్టిన మొదటి రోజునే మీ కొడుకు లోకేష్ మా ఆవరణలో ఉన్న పోలీసు అధికారులకు తరచూ ఫోన్ చేసి ఆ లంజ కొడుకుని (నన్ను) బయటికి లాగారా లేదా? తలుపులు బద్దలు కొట్టి నా శ్రీమతిని లంజా లెగవే అని బూటు కాలుతో తన్నించి ఈడ్చుకెళ్లింది, నా కోడలుని లంజా నిన్ను కొడితే దిక్కెవరే అని తిట్టించింది, నాకొడుకుని లాఠీలతో కొట్టుకుని తీసుకెళ్లింది తమకు గుర్తు లేదా?
ఇప్పుడు తమ నోటి వెంట ముత్యాలాంటి వేదాలు వస్తున్నాయి. బాబుగారు మీ దృష్టిలో మా కుటుంబం లంజల కుటుంబమా? మీరు, మీ శ్రీమతి గారు దేవతలా? మీ ఆఫీసులు దేవాలయాలా? మరి మేమేంటి, మా కొంపలేంటి? ఆ రోజున హెలికాఫ్టర్‌ను, తరువాత మరోసారి సుమారు 600 మంది పోలీసులను ప్రయోగించి నన్ను తీహార్ జైలుకు పంపాలని డ్రోన్ కెమెరాలతో నిత్యం నిఘా పెట్టించి నా ఇంటి వద్ద భయంకరమైనవాతారవరణం సృష్టించి కార్గిల్ యుద్ధభూమిని తలపింపజేశారు. గదిలో ఉన్న డబ్బులు, సెల్ ఫోన్లు వగైరా ఆ రోజు దొంగిలించబడ్డాయి.
హాస్పిటల్ అనే జైళ్లో బట్టలు మార్చుకోడానికి గానీ, స్నానాలు చేయడానికి లేకుండా 14 రోజులు ఏ కారణంతో ఉంచారు. ఆ చిన్నగదిలో మా నలుగురితో మరో ఆరుగురు పోలీసులు వారిని పగలు రాత్రి ఉంచి రేకు కుర్చీలతో శబ్దాలు చేయిస్తూ ప్రతి రోజూ రాత్రి మీ ఆదేశాలతో పోలీసు అధికారులు మా ముఖాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఫొటోలు తీయించి, పంపించమనడం రాక్షసానందం పొందడం కోసమే కాదా బాబుగారూ? మీకు చేయించిన హింస తాలూకు అవమానాలు భరించలేక వాటిని తలచుకుంటూ నింద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను.
మా 4 సంవత్సరాల మనవరాలు అర్ధరాత్రులు గుర్తుకు వచ్చి ఎలా భయపడేదో చెప్పడానికి మాటలు రావు. మీ అణచివేతతో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలనేది తమరి ప్రయత్నం కాదా బాబు గారూ? మీ ప్రయత్నం బాటలోనే నేను ఆలోచన చేశాను. కానీ నా కుటుంబాన్ని అవమానపరిచిన మీ పతనం నా కళ్లతో చూడాలనే ఉద్దేశంతో ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నాను. “
ముద్రగడ లేఖ పూర్తిపాఠం ఇదిగో..