జగన్‌ కన్నా ముందే ఓ జడ్జి పోరాడారు.. ఆయనెవరో తెలుసా..?

జగన్‌ కన్నా ముందే ఓ జడ్జి పోరాడారు.. ఆయనెవరో తెలుసా..?

0 0
Read Time:4 Minute, 35 Second

ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగు మూల స్తంభాలైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక, మీడియా వ్యవస్థల మధ్య పోరాటం ఈనాటిది కాదు. సుదీర్ఘకాలంగా ఇది నడుస్తోంది. అయితే ఇపుడు ఉన్నంత బహిరంగంగా ఈ పోరాటం ఉండేది కాదు. ఇపుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయవ్యవస్థపై బహిరంగ పోరాటానికి సన్నద్ధులయ్యారు. ఇది చాలా సాహసమనే చెప్పాలి. జగన్‌ ప్రారంభించిన ఈ పోరాటం విజయం సాధిస్తుందా లేక గతంలో వలె అన్ని వ్యవస్థలూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తాయా అన్నది కాలమే నిర్ణయించాలి. Justice BSA Swamy

Kye note in Justice swamy letter

కానీ జగన్‌ కన్నా ఈ పోరాటాన్ని చాలా కాలం క్రితమే ఓ జడ్జి ప్రారంభించారని తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలు పెను ప్రమాదంగా పరిణమించాయని, న్యాయవ్యవస్థను కూడా అవి పట్టి పీడిస్తున్నాయని ఆ జడ్జిగారు తరచూ చెప్పేవారు. అంతేకాదు రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, కేంద్ర న్యాయ శాఖ మంత్రికి కూడా ఆయన తరచుగా లేఖలు రాసేవారు. జరుగుతున్న పరిణామాలను, వాటి వెనక ఉన్న వ్యక్తులను, వారు ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నారో ఆ తీరును కళ్లకు కట్టినట్టు వివరిస్తూ లేఖలు పంపేవారు. కానీ ఫలితం శూన్యం.

ఇంతకీ ఆ జడ్జి ఎవరా అని ఆలోచిస్తున్నారా.. ఆయనే జస్టిస్‌ బీఎస్‌ఏ స్వామి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో జడ్జిగా పనిచేశారు. ఆ కాలంలోనే అనేక విధాలుగా తనను హింసిస్తున్నారని పైకి లేఖలు రాసేవారు. నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్‌వి రమణ అనే న్యాయవాదితో కలసి ఎన్ని రకాలుగా న్యాయవ్యస్థపై ప్రభావం చూపిస్తున్నారో ఆయన వివరించారు. రమణ గారు ఎక్కిన విమానం ఏ దిశలో ప్రయాణిస్తుందో తెలిస్తే Chief Justice ఎవరు అనే ఒక నిర్ణయానికి మనం వచ్చేస్తాం అని చాలా వివరంగా రాశారు జస్టిస్ BSA స్వామి …

జడ్జిగా ఉండగా ఏమీ చేయలేకపోయానని, అందుకే పదవి నుంచి వైదొలగిన తర్వాత అన్ని వివరాలతో 91 పేజీల డాక్యుమెంట్‌ను తయారు చేశానని వివరిస్తూ ఆ డాక్యుమెంట్‌ను కూడా ఆయన రాష్ట్రపతికి, ప్రధానికి, సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తికి, న్యాయ శాఖ మంత్రికి.. ఇలా పలువురు ప్రముఖులకు పంపించారు.


అసలు ఎన్‌వి రమణను హైకోర్టు జడ్జిగా 42 ఏళ్లకే చంద్రబాబు ప్రభుత్వం సిఫార్సు చేసిందనే సంచలన విషయాన్ని ఆయన బైటపెట్టారు. వయసు సరిపోనందున రమణ అభ్యర్థిత్వాన్ని కొలీజియం తిరస్కరించిందని, అయినా రమణ స్థానంలో మరో పేరు పైకి వెళ్లకుండా రమణే జడ్జి కావడానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు కేంద్రంలో అనేక చక్రాలు తిప్పారని కూడా జస్టిస్‌ స్వామి తన లేఖలో వివరించారు.
జస్టిస్‌ స్వామి 2005లో రిటైరయ్యారు. ఆయన లేఖను కూడా ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలు, న్యాయవ్యవస్థపై వాటి ప్రభావం, వివిధ కేసుల్లో చంద్రబాబు – జస్టిస్‌ రమణ జోడీ చూపించిన ప్రభావం అన్నీ బైటపడతాయి.
జస్టిస్‌ స్వామి లేఖ పూర్తి పాఠం ఈ లింక్‌లో ఉంది.. చదవండి..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

2 thoughts on “జగన్‌ కన్నా ముందే ఓ జడ్జి పోరాడారు.. ఆయనెవరో తెలుసా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *