చంద్రబాబు x మోహన్‌బాబు.. అసలు కథ హెరిటేజ్‌ వాటాలే..

చంద్రబాబు x మోహన్‌బాబు.. అసలు కథ హెరిటేజ్‌ వాటాలే..

0 0
Read Time:3 Minute, 26 Second

హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎవరిది? ఎవరైనా టక్కున సమాధానం చెప్పేస్తారు.. అది చంద్రబాబు నాయుడిది. ఆయన భార్య నారా భువనేశ్వరి, ఇపుడు ఆయన కోడలు నారా బ్రహ్మణి ఈ కంపెనీ వ్యవహారాలను చూస్తున్నారు. కానీ విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ సంచలన విషయాలను బయటపెట్టారు. అసలు హెరిటేజ్‌ ఫుడ్స్‌ తనదేనని, తనను మోసం చేసి చంద్రబాబు నాయుడు లాక్కున్నాడని ఆయన వెల్లడించారు. ఇద్దరూ కలసి 1992లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ను ప్రారంభించామని, అందులో మెజారిటీ పెట్టుబడి Heritage foods share తనదేనని మోహన్‌బాబు చెప్పారు. తనను చంద్రబాబు మోసం చేశాడని, తన నుంచి మొత్తం లాక్కుని తనను బయటకు గెంటేశాడని ఆయన తెలిపారు.

చంద్రబాబుతో మొదట్లో మోహన్‌బాబుకు మంచి సంబంధాలే ఉండేవి. ఆ తర్వాత ఆయనకు బద్ధశత్రువులా మారిపోయారు. తరచూ ఆయనను విమర్శిస్తుంటారు. ఎందుకో ఎవరికీ అర్ధమయ్యేది కాదు. అసలు విషయం ఇదన్నమాట అని ఇపుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. తనను చంద్రబాబు ఇలా మోసం చేశాడని 2003లో వైఎస్‌ రాజశేఖరరెడ్డికి మోహన్‌బాబు చెప్పారట. అసలు ఈ విషయాన్ని వైఎస్సే కదిపారట. పాదయాత్రకు వెళ్లేముందు ఈ ఇద్దరూ భోజనానికి కలిశారట. ఆ సమయంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందట. చంద్రబాబు నువ్వు మంచి స్నేహితులు కదా ఎందుకు విడిపోయారు అని వైఎస్‌ అడిగారని, అపుడు Heritage foods share ఆ విషయాన్ని ఆయనకు చెప్పానని మోహన్‌బాబు వివరించారు. దానికి వైఎస్‌ పెద్దగా నవ్వేసి సొంత మామకే వెన్నుపోటు పొడిచినవాడు చంద్రబాబు.. నువ్వొక లెక్కా అన్నారట. చానల్‌ ఇంటర్వ్యూలో మోహన్‌బాబు ఈ విషయాలన్నీ గుర్తుచేసుకున్నారు.

అధికారంలో ఉండగా హెరిటేజ్‌ ఫుడ్స్‌ కోసం చంద్రబాబు ఎన్నో మేళ్లు చేశారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ రంగంలోని సహకార డెయిరీలన్నీ మూతపడేలా చేసి హెరిటేజ్‌ డెయిరీని అభివృద్ధి చేశారని ప్రతిపక్షాలు చాలాకాలంపాటు పోరాటాలు చేశాయి. అదేమి విచిత్రమో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలోనే హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేర్‌ అనూహ్యంగా పెరుగుతుండేది. ఆయన అధికారంలో లేని సమయంలో షేర్‌ విలువ తక్కువగా ఉండడం గమనార్హం.

See Mohanbabu interview full video here.. https://fb.watch/8y92sxiGi_/

Heritage Foods Limited is one of the largest private sector dairy enterprises in Southern India. Wikipedia

President: M. Sambasiva Rao

Stock price: HERITGFOOD (NSE) ₹462.35 -0.60 (-0.13%)
8 Oct, 3:30 pm IST – Disclaimer

Founder: N. Chandrababu Naidu

Founded: 1992

Owner: Nara family

Headquarters: Hyderabad

Number of employees: 3000+

Subsidiaries: Heritage Novandie Foods Pvt Ltd, MORE

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *