Coal Shortage బొగ్గు కొరత.. కరెంట్‌ కోత.. వాదనలు వాస్తవాలు…

Coal Shortage బొగ్గు కొరత.. కరెంట్‌ కోత.. వాదనలు వాస్తవాలు…

0 0
Read Time:5 Minute, 53 Second

దేశంలో బొగ్గు కొరత Coal Shortage ఉంది. రాష్ట్రాన్నీ ఈ కొరత చుట్టుముట్టింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో విద్యుత్‌ ఉత్పత్తి మందగించింది. కొన్ని కేంద్రాలు పనిచేయడం ఆగిపోయింది. ఈ పరిస్థితిపై ప్రతిపక్షాలు విమర్శల జోరు పెంచాయి. దసరా తర్వాత విద్యుత్‌ సంక్షోభం వచ్చేస్తోందని, రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు మొదలవనున్నాయని సోషల్‌ మీడియాలో ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అయితే వాస్తవ పరిస్థితి ఏమిటనేది వివరిస్తూ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అదేమిటో చూద్దామా..

– దసరా పండుగ తర్వాత గ్రామాల్లో, మున్సిపాల్టీల్లో, నగరాల్లో లోడ్‌రిలీఫ్‌ పేరిట గంటలకొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం.
– బొగ్గు నిల్వలు, సరఫరాల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న పరిణామాలు విద్యుత్‌ ఉత్పత్తిపై పెను ప్రభావాన్ని చూపుతున్న విషయం అందరికీ తెలిసిందే.
– ఇంతటి సంక్షోభ సమయంలోనూ వినియోగదారులకు నాణ్యమైన సరఫరా, కరెంటు ఇచ్చేందుకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నాయి. ఎలాంటి సమస్యలు లేకుండా విద్యుత్‌ను అందిస్తున్నాయి.
– సంక్షోభాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి YS Jaganmohan Reddy ఆదేశాల మేరకు అత్యవసర ప్రణాళికల అమలును వెంటనే ప్రారంభించాం.
– రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ ఏ పి జెన్కో కు అత్యవసరంగా రూ . 250 కోట్లు నిధులు, బొగ్గు కొనుగోలు నిమిత్తం సమకూర్చ బడ్డాయి.
– రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించబడ్డాయి.
– దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడవున్నా కొనుగోలు చేయవలసినది గా ఏ . పి జెన్కో కు ఆదేశాలు ఇవ్వ బడ్డాయి.
– స్వల్ప కాలిక మార్కెట్‌ నుంచి ధర ఎంత పలికినా అవసరాల నిమిత్తం కొనుగోలు చేయాల్సిందిగా విద్యుత్‌ పంపిణి సంస్థలను ఆదేశించడం జరిగింది.
– కేంద్ర విద్యుత్‌ సంస్థల నుంచి ఎవ్వరికి కేటాయింపబడని విద్యుత్‌ వాటా నుంచి , వచ్చే సంవత్సరం జూన్‌ వరకు , ఆంధ్ర ప్రదేశ్‌ కోసం దాదాపు 400 మె . వాట్లు చౌక ధర విద్యుత్‌ కోసం కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు అభర్ధన పెట్టటం జరిగింది.
– బొగ్గు సరఫరా కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలతో నిమిత్తం లేకుండా కొరతతో వున్న విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా చెయ్యాలన్న కేంద్ర మార్గ దర్శకాలకు అనుగుణంగా మన రాష్ట్రానికి సరఫరా చేసే అన్ని బొగ్గు ఉత్పత్తి సంస్థలతో మాట్లాడటం జరిగింది.
– పొరుగు రాష్ట్రంలో ఉన్న సింగరేణి సంస్థతో సమన్వయము చేసుకుని మన రాష్ట్రము లో వున్న కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా కోసం నిరంతర ప్రయత్నం జరుగుతోంది.
– వి టి పి ఎస్‌ లోను మరియు కృష్ణపట్నంలోనూ కొత్త 800 వెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను ప్రారంభించడానికి, తొందరగా అందుబాటులోకి తేవటానికి తగిన చర్యలు తీసుకోవటం జరుగుతోంది.

  • విద్యుత్‌ కోతలపై జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆ శాఖ ఉన్నతాధికారులు, డిస్కంల సీఎండీలు ఈ ప్రచారం పూర్తిగా అవాస్తమని ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేవని స్పష్టం చేశారు. అధికారిక లెక్కల ప్రకారం, రాష్ట్రంలో గత ఐదు రోజులుగా విద్యుత్‌ లోటు దాదాపు 1.22 మిలియన్‌ యూనిట్ల కంటే తక్కువగానే ఉంది. పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హర్యానా వంటి ఇతర రాష్ట్రాల్లో విద్యుత్‌ లోటు మన దగ్గర కంటే ఎక్కువగా ఉంది. అక్టోబర్‌ 14న రాష్ట్రంలో 0.76 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటు ఉండగా 15 నుంచి అది కూడా పోయి రాష్ట్రంలో విద్యుత్‌ లోటు పూర్తిగా జీరో అయ్యింది. దీంతో విద్యుత్‌ కోతలు లేకుండా డిస్కంలు పూర్తి స్థాయిలో విద్యుత్‌ పంపిణీ చేయగలుగుతున్నాయి. ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలో విద్యుత్‌ కోత ఉండదని విద్యుత్‌ శాఖ హామీ ఇచ్చింది.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *