Budvel by Election.. భయం.. అంటే ఇలానే ఉంటుందా..?

Budvel by Election.. భయం.. అంటే ఇలానే ఉంటుందా..?

0 0
Read Time:8 Minute, 12 Second

కడప జిల్లా బద్వేల్‌లో జరుగుతున్న ఉప ఎన్నిక (Budvel by Election) కు రంగం సిద్ధమయ్యింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన సీటు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులకే ఆ సీటును వైఎస్సార్సీపీ కేటాయించింది. అందుకే ఆ సీటులో తాము పోటీ చేయడం లేదని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. వాస్తవానికి ఆ సీటులో 2019లో పోటీ చేసిన అభ్యర్థి రాజశేఖర్‌ మళ్లీ పోటీ చేస్తాడని వార్తలు కూడా వచ్చాయి. కానీ తెలుగుదేశం పార్టీ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుంది. పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. సానుభూతితో తాము పోటీ చేయడం లేదని, సాంప్రదాయాలను గౌరవిస్తున్నామని ప్రకటించింది.

బీజేపీ ఆఫర్‌ను తిరస్కరించిన జనసేన
మరోవైపు జనసేకు బీజేపీ ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చినా తిరస్కరించిందని సమాచారం. బద్వేల్‌లో అభ్యర్థిని పెట్టాలని, తాము మద్దతుగా నిలబడతామని బీజేపీ నాయకులు స్వయంగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను కలసి అభ్యర్థించినా ఆయన తిరస్కరించారు. చివరకు చేసేదేమీ లేక బీజేపీ రంగంలోకి దిగింది. తమ అభ్యర్థిని నిలబెడతామని ప్రకటించింది. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే జనసేన రోడ్ల ఉద్యమం, రిపబ్లిక్‌ ఫంక్షన్‌లో, జనసేన కార్యకర్తల విస్తృత సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగాలు చూసిన జనసైనికులు సంబరపడిపోయారు. ప్రభుత్వాన్ని, జగన్‌మోహన్‌రెడ్డిని భయపెట్టడానికి బద్వేల్‌ ఉప ఎన్నిక ఒక అవకాశమని వారు భావించారు. ఎందుకంటే భయం అంటే ఏమిటో త్వరలోనే చూపిస్తామని, యుద్ధం మొదలుపెడుతున్నామని పవన్‌ కల్యాణ్‌ గట్టిగా చెప్పారు. కానీ బద్వేల్‌లో పోటీకి మాత్రం దూరంగా ఉండిపోయారు.

గతంలో సాంప్రదాయాలు ఏమయ్యాయి?
సాంప్రదాయాలను ప్రతిసారీ గౌరవించాలి కదా.. అలా ఎందుకు చేయలేదు. ఇపుడే ఎందుకు సాంప్రదాయాలు తెలుగుదేశం పార్టీకి గుర్తుకు వచ్చాయి? గతంలో నంద్యాలలో ఉప ఎన్నిక జరిగినపుడు ఈ సాంప్రదాయాలు గుర్తుకు రాలేదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత 2010లో విజయమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే వైఎస్సార్సీపీ పార్టీ ఏర్పడిన తర్వాత మళ్లీ పోటీ చేస్తే ఆమెపై అభ్యర్థిని నిలబెట్టారు. 2009లో వైఎస్‌ఆర్‌ పులివెందుల నుంచి గెలిచారు కాబట్టి 2014 వరకు అది ఆయన సీటే. కానీ విజయమ్మపై అందరూ పోటీ పెట్టారు కదా. అపుడు ఈ సాంప్రదాయాలు గుర్తులేవా? ఇటీవల తిరుపతి ఎన్నిక గుర్తులేదా. చనిపోయిన ఎంపీ స్థానంలో పోటీకి పెట్టిన అభ్యర్థిపై అందరూ పోటీ పడ్డారు కదా..

వైఎస్సార్సీపీ అడగకపోయినా…
పోటీ అంటే పోటీనే.. అదేదో కుటుంబ వ్యవహారంలా చూడకూడదు. ఒకవేళ సాంప్రదాయంగా పెట్టుకుంటే దానిని అన్ని సందర్భాలలోనూ పాటించాలి. అది కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఎక్కడా ఉత్తరం రాయలేదు. ఈ సాంప్రదాయం పాటిద్దాం మీరు పోటీ లో ఉండవద్దు అని అభ్యర్థించలేదు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాలో మాట్లాడుతూ ఓ మాట అన్నారంతే. ఆయన కూడా ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి విజ్ఞప్తీ చేయలేదు. టీడీపీకి వైఎస్సార్సీపీ నాయకుల బృందం వెళ్లి ఓ అప్పీల్‌ చేసి ఉంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ తమంతట తామే తెలుగుదేశం ఈ నిర్ణయం తీసుకుంది. మరి గతంలో ఇలా స్వచ్ఛందంగా ఎందుకు ఆలోచించలేదు? పోటీ పట్ల టీడీపీ ఎందుకు ఇంత అసక్తత చూపిస్తోంది? తిరుపతి ఎన్నిక ఫలితం చూశాక.. ఎంపీటీసీ – జడ్‌పీటీసీ ఎన్నికల ఫలితాలు చూశాక పోటీ చేసి అభాసు పాలు కావడం ఎందుకు అని తెలుగుదేశం పార్టీ ఆలోచించిందా అన్న ప్రశ్న ఉదయించక మానదు. ఇపుడు స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు సరే.. మరి 2024లో ఆ చనిపోయిన అభ్యర్థి కుటుంబ సభ్యులే మరలా నిలబడతారు కదా.. అప్పుడేం చేస్తారు? అప్పుడు సానుభూతి ఉండదా.. ఇపుడు ఉన్న సానుభూతి ఈ రెండేళ్లలోనే పోతుందా..

Also Read : BJP Budvel Strategy.. బద్వేల్‌లో బీజేపీ వ్యూహమేమిటి?


బద్వేల్‌ ఓ అవకాశం… ఎందుకు వద్దనుకున్నారు?

బద్వేల్‌ ఎన్నిక Budvel by Election లో అభ్యర్థిని పోటీ పెట్టక పోవడమనేది సాంప్రదాయమో సానుభూతో కాదు.. ఇది తెలుగుదేశం పార్టీ బలహీనతను తెలియజేస్తున్నదని విశ్లేషకులంటున్నారు. ప్రతి రోజూ తెలుగుదేశం పార్టీ నాయకులంటున్నదేమిటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ ఓడిపోతుంది అంటున్నారు.. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిపితే ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం ఖాయమని వారు అంటున్నారు. మరి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావిస్తున్నవారికి ఈ ఉప ఎన్నిక ఒక అవకాశం కదా.. ప్రజా వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని నిరూపిం^è డానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి కదా.. బద్వేల్‌లో పోటీపడకపోవడమనేది తెలుగుదేశం పార్టీ నిస్సహాయతకు ఒక నిదర్శనమని పరిశీలకులంటున్నారు.

భయం… అంటే ఇలానే ఉంటుందా…
తెలంగాణలోని దుబ్బాకలో ఎమ్మెల్యే చనిపోతే ఆయన సతీమణి బరిలో నిలిచారు. అక్కడ అన్ని పార్టీలూ అభ్యర్థులను పెట్టాయి. ఎన్నికలు జరిగాయి. నాగార్జున సాగర్‌లో ఎమ్మెల్యే చనిపోతే కొడుకు పోటీలో నిలబడ్డారు. అన్ని పార్టీలూ పోటీ పడ్డాయి. ఎన్నికలు జరిగాయి. అందువల్ల సాంప్రదాయమనేది రాజకీయ పార్టీలు తమ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి, తమ నిస్సహాయతను సమర్థించుకోవడానికి వాడుకునే ఓ అస్త్రం మాత్రమేనన్నది విశ్లేషకుల మాట. అంటే ఏమిటి.. భయం.. అది పోటీకి దూరం చేస్తుంది… తమకు అవసరమైనప్పుడు మాత్రమే సాంప్రదాయాలు పాటించేలా చేస్తుంది.. తెలుగుదేశం, జనసేన పార్టీలు దీనిని ఎలా సమర్థించుకుంటాయో..

  • సాయి ఈశ్వర్‌

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *