బీజేపీని వీడిన తర్వాత కన్నా రూటెటు?

బీజేపీని వీడిన తర్వాత కన్నా రూటెటు?

0 0
Read Time:6 Minute, 2 Second

బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారా? అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. వైఎస్సార్సీపీ నుంచి మంచి ఆఫర్‌ వచ్చినప్పటికీ చివరి నిమిషంలో ఆయన వెనక్కి తగ్గారు. నాటి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించడంతో వంట్లో బాగోలేదంటూ కన్నా లక్ష్మీనారాయణ వైఎస్సార్సీపీలో చేరే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అలాంటి తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని దూరం చేయడమే కాక ఇపుడు కరివేపాకు మాదిరిగా పక్కన పెట్టేశారని కన్నా వాపోతున్నారట. తాను బలిపశువు మాదిరిగా మారిపోయానని ఆయన కన్నీటి పర్యంతమవుతున్నారట. BJP Kanna Lakshminaryana TDP

సుదీర్ఘకాలం కాంగ్రెస్‌పార్టీలో కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా కూడా పనిచేశారు. కాపుల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అయితే 2014 ఎన్నికల సమయంలో అనూహ్యంగా ఆయన కమలం పార్టీకి జై కొట్టారు. కన్నా కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇచ్చి గౌరవించింది. ఆయన అధ్యక్షుడిగా ఉండగానే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. బీజేపీ దారుణంగా పరాజయం పాలయ్యింది. రాష్ట్రంలో ఒక్క సీటూ రాలేదు. ఓడిపోతానని తెలిసి కూడా స్వయంగా కన్నా నర్సరావుపేట పార్లమెంటుకు పోటీచేసి భంగపడ్డారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమయ్యిందో ఏమో గానీ కన్నా కాస్త దూకుడు పెంచారు. ముఖ్యంగా మూడు రాజధానుల ప్రకటన తర్వాత ఆయన మరీ దూకుడు ప్రదర్శించారు. రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి ఒప్పుకునేది లేదంటూ ప్రత్యేక ఆందోళనా కార్యక్రమాలను ఆయన రూపొందించారు. అయితే కన్నా వైఖరి తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉందని కమలనాథులు గుర్తించారు.

మోదీని, బీజేపీ అగ్ర నాయకత్వాన్ని దుమ్మెత్తి పోసిన తెలుగుదేశం అంటే పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. కానీ కన్నా మాత్రం తన ధోరణిలో తాను పోయారు. తన అమరావతి పోరాటం తెలుగుదేశం పార్టీకి మేలుచేసేదిగా ఉందని ఆయన గుర్తించారో లేదో లేదా కావాలనే తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా పార్టీని నడపాలనుకున్నారో గానీ కమలనాథులు మాత్రం ఆగ్రహించారు. ఆయనకు ఉద్వాసన పలికారు. ఆయన స్థానంలో సోము వీర్రాజును ప్రతిష్టించారు. వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత కన్నా లక్ష్మీనారాయణకు పార్టీలో అస్సలు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆయన ఊసులో లేకుండా పోయారు.

సాధారణంగా ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిని తొలగించినపుడు ఆయనకు పార్టీ జాతీయ కమిటీలలో చోటు కల్పించడం ఆనవాయితీ. కానీ కన్నాకు అలాంటి పదవి ఏదీ ఇవ్వలేదు. బీజేపీ జాతీయ కమిటీని ఇటీవలే పునర్వ్యవస్థీకరించారు. అందులోనూ ఆయనకు చోటు లేదు. దీంతో కన్నా తీవ్రంగా మనస్థాపం చెందారని, ఇక బీజేపీలో తాను ఉండి ఉపయోగం లేదని భావిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలంటున్నాయి. బీజేపీలో తనకిక భవిష్యత్‌ లేదని ఆయన నిర్ధారణకు వచ్చేసారని ఆ వర్గాలంటున్నాయి. త్వరలోనే ఆయన బీజేపీకి గుడ్‌బై చెప్పేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారని, అటునుంచి సిగ్నల్‌ రాగానే సైకిలెక్కేస్తారని వినిపిస్తోంది. వైఎస్సార్సీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా ఆ ప్రయత్నాలేవీ ఫలించే అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే గతంలో ఆయన చివరినిమిషంలో ఆడిన అనారోగ్యం డ్రామా ఆ పార్టీ అధినాయకత్వాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసిందని సమాచారం. అందుకే అటువైపు తలుపులు మూసుకుపోయినట్లేనని ఆయన కూడా గుర్తించారని అంటున్నారు.

ఇక మిగిలింది ఒక్క తెలుగుదేశం పార్టీయే. రాజధాని ఉద్యమంతో అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ లభించిందని, ఆ ప్రాంతానికి చెందిన తాను ఇక తెలుగుదేశంలో ఉంటేనే మంచిదని కన్నా భావిస్తున్నారట. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు దృష్టికి ఈవిషయం వెళ్లిందని, అతి త్వరలోనే కన్నాకు పార్టీ తీర్థమిచ్చి తమ పార్టీ కూడా బలంగా ఉందని, చేరికలే ఇందుకు నిదర్శనమని చాటి చెప్పాలని చంద్రబాబు కూడా భావిస్తున్నారట.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

20 thoughts on “బీజేపీని వీడిన తర్వాత కన్నా రూటెటు?

  1. I just could not leave your website before suggesting that I actually enjoyed the standard info an individual supply on your visitors? Mitzi Ambrosius Gilbye

  2. Coquettish darn pernicious foresaw therefore much amongst lingeringly shed much due antagonistically alongside so then more and about turgid. Marsha Zackariah Callas

  3. Yo, observo una brecha en algunas empresas certificadas, entre los gestores del sistema y, la plantilla operativa, vamos que todo se queda en un papel. Lorena Gael Sansone

  4. Having read this I believed it was really informative. I appreciate you finding the time and effort to put this article together. I once again find myself personally spending way too much time both reading and leaving comments. But so what, it was still worth it! Hedvig Jarrod Koblick

  5. Thank you for your thoughts and observations Dawn. You do not stand alone in your beliefs and it is a sign of hope that you are letting your own light shine through this difficult period. Let us all follow your example. xoxo Dulcine Woodman Loralyn

  6. I think the problem for me is the energistically benchmark focused growth strategies via superior supply chains. Compellingly reintermediate mission-critical potentialities whereas cross functional scenarios. Phosfluorescently re-engineer distributed processes without standardized supply chains. Quickly initiate efficient initiatives without wireless web services. Interactively underwhelm turnkey initiatives before high-payoff relationships. Margarethe Gerhard Rind

  7. Whoa! This blog looks just like my old one! It’s on a entirely different topic but it has pretty much the same layout and design. Excellent choice of colors! Constancy Kurt Marchese

  8. Way cool, some valid points! I appreciate you making this article available, the rest of the site is also high quality. Have a fun. Tessy Cullie Gayel Marilin Cobb Salisbarry

  9. Pretty component of content. I just stumbled upon your site and in accession capital to say that I get actually loved account your blog posts. Anyway I will be subscribing for your feeds or even I achievement you get right of entry to constantly rapidly.| Roanne Briant Zonda

  10. Having read this I thought it was really enlightening. I appreciate you taking the time and effort to put this article together. I once again find myself personally spending a significant amount of time both reading and leaving comments. But so what, it was still worthwhile! Benita Crosby Ronald

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *