BJP Budvel Strategy.. బద్వేల్‌లో బీజేపీ వ్యూహమేమిటి?

BJP Budvel Strategy.. బద్వేల్‌లో బీజేపీ వ్యూహమేమిటి?

0 0
Read Time:6 Minute, 38 Second

BJP Budvel Strategy కడపజిల్లా బద్వేల్‌ అసెంబ్లీ సీటుకు జరుగుతున్న ఎన్నికల్లో బరిలో నిలవడానికి భారతీయ జనతాపార్టీ సన్నాహాలు చేసుకుంటున్నది. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను కలసిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఈ మేరకు ఉమ్మడి అభ్యర్థిని నిలపడానికి ఒప్పించినట్లు సమాచారం. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు బద్వేల్‌ ఉప ఎన్నికను ఓ రిహార్సల్‌గా బీజేపీ భావిస్తున్నది. అందుకే ఇక్కడ తమ ఉమ్మడి బలాన్ని పరీక్షించుకోవాలని నాయకులు చూస్తున్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో జనసేనలో కాస్త ఊపు కనిపిస్తున్నది. కేంద్రంలో బీజేపీ సహాయంతోనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా పదేపదే జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు తమ ప్రచారం ప్రభావం మోతాదు ఎంత అనే విషయాన్ని త్రాసులో వేసి చూసుకోవడానికి బద్వేల్‌ ఉప ఎన్నిక ఉపయోగ పడుతుందని భావిస్తున్నాయి. బద్వేల్‌ ఫలితాన్ని బట్టే భవిష్యత్‌లో తాము ఇరువురమూ తెలుగుదేశం పార్టీని కలుపుకోవాలా లేక మన ఇద్దరి బలం సరిపోతుందా అన్న విషయాన్ని కూడా బేరీజు వేసుకోవాలని భావిస్తున్నాయి. ఆదివారం కడపలో జరిగిన బీజేపీ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో సోము వీర్రాజు తమ వ్యూహాన్ని ఆవిష్కరించారు. జగన్, చంద్రబాబు ఇద్దరికీ సవాళ్లు విసిరారు. ఈ సమావేశంలో సోము వీర్రాజు ఏమన్నారో చూద్దామా..

BJP Budvel Strategy కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికను భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. జగన్ పార్టీకి భయపడాల్సిన పని లేదని చెప్పారు. కడపలో భాజపా జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పాల్గొన్న సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ‘‘రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని భాజపా ప్రోత్సహించదు. బద్వేలు ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి. ఏడేళ్లుగా నిధులిచ్చి ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడేళ్ల అభివృద్ధిపై చర్చించడానికి భాజపా సిద్ధం. జగన్, చంద్రబాబుకు చర్చించడానికి సిద్ధమా?’’ అని సోము వీర్రాజు సవాల్‌ విసిరారు.

సోము వీర్రాజు కామెంట్స్..

బద్వేల్ ఉపఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుంది….

పార్టీ నేతల నిర్ణయాన్ని కేంద్ర పెద్దలకు తెలుపుతాము.

సీఎం జగన్ కు జడిసే ప్రసక్తేలేదు.. కార్యకర్తలకు అండగా ఉంటాము

అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారత్ ను పాలిస్తున్న పార్టీ బిజెపి…

బద్వేల్ లో రెండు జాతీయ రహదారులను బిజెపి ప్రభుత్వం వేసింది…

పథకాలు,నిధులు కేంద్రానివి – స్టిక్కర్లు మాత్రం వైసీపీ’ వి..

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని నిధులను, అన్ని పథకాల డబ్బులు సి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్ లో వేస్తున్న సీఎం జగన్..ఇలా జమ అయిన డబ్బులు చూపించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెస్తుంది..

ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి పై ప్రస్తుత సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు చర్చకు సిద్ధమా ? అని సవాల్..

అమరావతి నిర్మించాలని ప్రపంచ దేశాలు తిరిగిన బాబు … 3 రాజధానులు అన్న జగన్ మాటలు ఏమయ్యాయి ? ప్రచారం కోసమే తప్ప అభివృద్ధి పై ఆకాంక్ష లేదు..

అమరావతిలో 1800 కోట్ల వ్యయంతో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మించిన ఘనత బీజేపీ ది..

రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం…

మాట చెప్పి మడమ తిప్పని ఏకైక వ్యక్తి దేశంలో మోడీ మాత్రమే…

జగన్ ఇళ్ల పట్టాల పేరిట వైసీపీ నేతలు వేల కోట్లు నొక్కేసారు…

జాబ్ కార్డుల ద్వారా కుటుంబానికి 18 వేల రూపాయలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం..

కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు..

బద్వేల్ అసెంబ్లీ రోడ్లన్నీ గుంతలమయం…

అభివృద్ధి చేయడానికి బీజేపీ సిద్ధం…

రాష్ట్రంలో పచ్చి సారా సరఫరా చేస్తున్న జగన్ ప్రభుత్వం…

రాష్ట్రంలో కోటి మందికి పైగా మద్యం తాగుతున్నారు..

నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు..

బీజేపీ కుటుంబ పార్టీ కాదు…

బిజెపి కుటుంబ రాజకీయాలను వ్యతిరేకించే పార్టీ…

చాలా రాష్ట్రాల్లో కుటుంబ పాలన పోవాలి…

కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుందాం..

రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించే పార్టీలు బీజేపీ, జనసేన మాత్రమే… ”

ఈ కార్యక్రమంలో భాజపా ముఖ్య నేతలు సీఎం రమేశ్‌, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *