చంద్రబాబుకు అంబటి అంటించిన చురకలివే..

చంద్రబాబుకు అంబటి అంటించిన చురకలివే..

0 0
Read Time:2 Minute, 33 Second

ambati comments on chandrababu chaitanyapatham
ప్రజా చైతన్య యాత్ర పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పర్యటన మొదలుపెట్టేశారు. చంద్రబాబు యాత్రపైనా, సమకాలీన రాజకీయ పరిణామాలపైనా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే చంద్రబాబు యాత్రకు శ్రీకారం చుట్టారని ఆయన విమర్శించారు. ఇంకా ఆయనేమన్నారంటే..
108 కి దారివ్వకపోవడం సంస్కారానికి నిదర్శనం
‘‘చంద్రబాబు పాదయాత్రను ఎవరూ అడ్డుకో లేదు. యాత్రపేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఐటి దాడులనుంచి దృష్టి మరల్చేందుకే చంద్రబాబు యాత్ర. 108 కి దారివ్వకపోవడం చంద్రబాబు సంస్కారానికి నిదర్శనం. సిఎం జగన్‌ ను చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు దూషించారు. తోకలు కత్తిరిస్తానంటున్నారు. ఎవరి తోకలు ఎవరు కత్తిరించారో ప్రజలకు తెలుసు. ఐటి దాడులపై మీడియాకు దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్నారు. చంద్రబాబును ఎవరూ లెక్కచేయడం లేదు.
చంద్రబాబు యాత్రకు భయపడం..
చంద్రబాబు యాత్రలకు ఎవరూ భయపడం. రాష్ట్రంలో స్వచ్ఛమైన పరిపాలన జరుగుతోంది. ఆయన మాజీ పిఎస్‌ పై వచ్చిన అక్రమాలపై ఎందుకు స్పందించలేదు. చంద్రబాబూ మీపై ఆరోపణలకు సమాధానం చెప్పరా.? పిఎస్‌ ను పట్టుకుంటే 2 వేల కోట్ల అక్రమాలు బయటపడ్డాయి. చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు.
పచ్చమీడియాతో కలసి చంద్రబాబు డ్రామాలు..
రోజుకో డ్రామాతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు. పచ్చమీడియాతో కలసి శవరాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రవహాన్ని తగ్గించాలని సిఎం జగన్‌ ఆలోచిస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టి అధికారం చేజిక్కించుకోవాలని చంద్రబాబు ఆరాటం.’’ అని అంబటి వ్యాఖ్యానించారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

4 thoughts on “చంద్రబాబుకు అంబటి అంటించిన చురకలివే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *