108, 104లను విజయసాయిరెడ్డి వియ్యంకుడికిచ్చేశారట.. బాంబు పేల్చిన టీడీపీ

108, 104లను విజయసాయిరెడ్డి వియ్యంకుడికిచ్చేశారట.. బాంబు పేల్చిన టీడీపీ

0 0
Read Time:2 Minute, 33 Second

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానసపుత్రికలైన 108, 104 లను రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీలో కీలకనేత విజయసాయిరెడ్డి వియ్యంకుడికి ఇచ్చేశారంటూ తెలుగుదేశం పార్టీ బాంబు పేల్చింది. ఇకనుంచి 108 అంబులెన్సుల నిర్వహణ, 104 సంచార వైద్యశాలల నిర్వహణ అరబిందో ఫార్మా (arabindo pharma) ఫౌండేషన్‌ కు ఏపీ ప్రభుత్వం అప్పగించేసిందంటూ తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియాలో హోరెత్తిస్తోంది.

Also Read : బోస్టన్‌ కన్సల్టెన్సీలో విజయసాయిరెడ్డి అల్లుడున్నాడా..?

‘‘అరబిందో సంస్థ అధినేత రాం ప్రసాద్‌ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి వియ్యంకుడు. జగన్‌ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి. ఈ మధ్యనే ఆయన, ఆయన భార్య సునీలా రాణిలతో పాటు సంబంధిత సంస్థలపై ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనల ఉల్లంఘన కింద సెబీ 22 కోట్ల రూపాయల జరిమానా విధించింది. పైగా దేశానికి వేలకోట్లు పన్ను ఎగవేసి వాటిని విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన పలువురు ప్రముఖుల బాగోతాన్ని బయటపెట్టిన పనామా పేపర్స్‌ జాబితాలో ఈయన పేరు కూడా ఉంది. అయినా కూడా ఇవన్నీ మనం పట్టించుకోనక్కర్లేదు. అరబిందో అనేది ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్న బడా సంస్థ. అందులోనూ జగన్‌ గారికి, విసారె గారికి బాగా కావాల్సిన వారిది కాబట్టి ఆ సంస్థకి బాధ్యతలు ఇవ్వడంలో తప్పేమీలేదు. అంతాపోతే ఒక్కొక్క కొత్త అంబులెన్స్‌ నిర్వహణకు నెలకు రూ. 1,78,072 లు, పాతదైతే రూ.2,21,257లు ప్రభుత్వం చెల్లిస్తుంది. అంతే. వెరీ చీపు కదా!!! ’’ అని సోషల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. దీనికి వైఎస్సార్‌సీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *