మళ్లీ పరీక్షలా.. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళన

మళ్లీ పరీక్షలా.. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళన

0 0
Read Time:10 Minute, 4 Second

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించనున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించగానే ఉద్యోగులంతా పండగ చేసుకున్నారు. ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు చేశారు. దీని ప్రకారం ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా నిర్ణయించిన మేరకు బేసిక్‌తో నలవారీ వేతనం పొందేందుకు అర్హులవుతారు. రెండేళ్లు పూర్తిచేసుకున్న సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ పూర్తయినట్లు ప్రకటించనున్నారని, అందుకోసం పూర్తి కార్యాచరణ సిద్ధమయ్యిందని ప్రభుత్వం నుంచి సంకేతాలు అందాయి కూడా. ap secretariat employees association

అయితే అసలు కథ ఇక్కడే మొదలయ్యింది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోవడంతో పాటు సంబంధిత శాఖ నిర్వహించే పరీక్షలలో కూడా ఉత్తీర్ణత పొందాలి. అంతేకాదు సంబంధిత ఉద్యోగి ప్రవర్తనపై పోలీసులు విచారణ జరిపి అందజేసే యాంటిసిడెంట్‌ రిపోర్టులను కూడా ప్రాతిపదికగా తీసుకుని ఆయా ఉద్యోగులకు ప్రొబేషన్‌ పూర్తయినట్లు ప్రకటిస్తారు. ఈ నిబంధనలపై ఉద్యోగులలో ఆందోళన మొదలయ్యింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత పొందకపోతే.. పోలీసులు తమకు సంబంధించి మంచి రిపోర్టు ఇవ్వకపోతే.. తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు. పర్మినెంట్‌ కాకపోతే పోయేను.. అసలు ఈ ఉద్యోగం ఉంటుందా.. ఉండదా అని వారిలో సందేహాలు మొదలయ్యాయి. దీనిని సాకుగా చేసుకుని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు దీనిని మరింత ఎగదోస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంతకీ దీనిపై ప్రభుత్వం ఏమి చెబుతోంది.. అధికారిక ఉద్యోగ సంఘ నేత వెంకటరామిరెడ్డి ఏమి చెబుతున్నారు.. చూద్దాం..

‘సచివాలయ’ ఉద్యోగులకు రాత పరీక్ష!

గ్రామ, వార్డు సచివాలయాల తొలి బ్యాచ్‌ ఉద్యోగులకు ఈ ఏడాది అక్టోబర్‌ 2వ తేదీకి రెండేళ్ల సర్వీసు పూర్తవుతోంది. నిబంధనల ప్రకారం వారందరికీ ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసి పే స్కేలు అమలు చేయనున్నారు. దీనికి ముందు వారికి శాఖ పరంగా క్రెడిట్‌ బేస్‌ అసెస్‌మెంట్‌ పరీక్షను సెప్టెంబర్‌ 11 – 17 తేదీల మధ్య ఒక రోజు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. 90 నిమిషాల్లో వంద ప్రశ్నలతో పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి, నాలుగు నెలల్లోనే వాటి భర్తీ కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే. వీరిలో 1.21 లక్షల మంది 9 ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా సచివాలయాల్లో పనిచేస్తున్నారు. వీరిలో తొలి బ్యాచ్‌కు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు శాఖలవారీగా సిలబస్‌ను నిర్ధారించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ ఆయా శాఖలకు లేఖలు రాశారు. ఏవైనా శాఖలు 65 ప్రశ్నల కేటగిరీలో రాతపరీక్షకు బదులు కేవలం ప్రాక్టికల్స్‌ నిర్వహించాలని భావిస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రశ్నపత్రాల తయారీ, మార్కుల వెల్లడి బాధ్యతలను ఏపీపీఎస్సీకి అప్పగించినట్టు అజయ్‌జైన్‌ పేర్కొన్నారు.

Ajay Jain AP IAS
Ajay Jain, Principal Secretary, Housing Department, Andhra Pradesh


ప్రావీణ్యత పెంచేందుకే పరీక్ష.. తొలగించడానికి కాదు
సచివాలయ ఉద్యోగుల్లో ప్రావీణ్యత పెంచేందుకే రాతపరీక్ష నిర్వహిస్తున్నామని, ఉద్యోగాలు తొలగించడానికి కాదని, ఎవ్వరికి అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అజయ్‌జైన్‌ ఉద్యోగ సంఘ నేతలకు వివరించారు. ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అజయ్‌జైన్‌ను కలిసి ప్రొబేషన్‌పై చర్చించారు.

K Venkata Rami Reddy, Grama ward sachivalaya association president


ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కే వెంకట రామి రెడ్డి బహిరంగ లేఖ
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సోదర, సోదరీమణులకు నమస్కారం!

ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం పరీక్ష పెట్టడం అనేది మీ ఒక్కరి కోసం తీసుకొచ్చిన నిబంధన కాదు. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం ప్రతి డిపార్ట్ మెంట్ కు కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్రభుత్వం లో పనిచేసే ఏ ఉద్యోగి అయినా ఆయా శాఖల సర్వీసు రూల్స్ లో నిర్దేశించిన పరీక్షలు పాస్ అయిన తర్వాతనే ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారు. గ్రామ వార్డు సచివాలయ శాఖ కొత్తగా ఏర్పాటు చేసినది. ఈ శాఖలో పనిచేసే ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలంటే CBAS పరీక్ష పాస్ అవ్వాలని నిబంధన పెట్టారు. దానిని అందరూ అనుసరించాల్సిందే. మీకిచ్చిన అప్పాయింట్ ఆర్డర్ లో కూడా శిక్షణ, అందుకు సంబంచిన పరీక్ష పాస్ అయిన తర్వాతే ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని స్పష్టంగా చెప్పారు. కావున పరీక్ష పెట్టకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరడం సమంజసం కాదు. పరీక్షలకు సంబంధంచి మీకు ఏవైనా సందేహాలుంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేయాల్సిందిగా కోరతాము.

ముఖ్యమంత్రి గారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఒకేసారి లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా మేము అడిగిన వెంటనే 010 పద్దు కింద జీతాలు మంజూరు చేశారు మాతృత్వ సెలవులు మంజూరు చేశారు డిపార్ట్మెంట్ పరీక్షల్లో నెగటివ్ మార్కులు తొలగించారు. హెల్త్ కార్డుల మంజూరు కూడా అంగీకరించారు. వీటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా చేసింది ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ( రి. నం. 13/2020) మాత్రమే.

ఇప్పుడు కొన్ని ఊరూ పేరూ లేని సంఘాల పేరుతో కొందరు తాము బలపడటం కోసమని ఈ పరీక్షల అంశాన్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు. ఇలాంటి వారికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

పరీక్షలకు సంబంధించి మీకున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. వాటిని పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

కరోనా కష్టకాలంలో వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రాణాలకు తెగించి పని చేశారనే సానుభూతి ముఖ్యమంత్రి గారికి ఉంది. అందుకే ఓకే మీకు సంబంధించి ఏమి అడిగినా ముఖ్యమంత్రి గారు వెంటనే అంగీకారం తెలుపుతున్నారు. ఇప్పుడు పరీక్షల పేరుతో కొందరు కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మధ్య అగాధం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు నష్టం జరిగే పని ప్రభుత్వం చేయదు, మేము చేయనివ్వము. కావున పరీక్షలకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు స్పందించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.

కే వెంకట రామి రెడ్డి
గౌరవ అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *