ప్రపంచంలోని అతిపెద్ద పువ్వు ( World’s largest flower ) రాఫ్లేసియా ఆర్నాల్డి. ఇది 7 కిలోల (15 పౌండ్లు) బరువు ఉంటుంది. ఇండోనేషియాలోని సుమత్రా, బోర్నియో దీవులలో మాత్రమే పెరుగుతుంది. దీని రేకులు 1.6 అడుగుల (1 మీటర్) పొడవు, 1 అంగుళాల (2,5 సెం.మీ.) మందంతో పెరుగుతాయి.
సుమత్రా, మలేషియా, ఫిలిప్పీన్స్, బోర్నియోలో 16 జాతుల రాఫ్లేసియా లు ఉన్నాయి. 1819 లో సింగపూర్ బ్రిటిష్ కాలనీని స్థాపించిన సహజ శాస్త్రవేత్త సర్ స్టాంఫోర్డ్ రాఫెల్స్ ఈ పుష్పాలకు పేరు పెట్టారు. మే 1818 లో రాఫెల్స్ తన స్నేహితుడు డాక్టర్ జోసెఫ్ ఆర్నాల్డ్తో కలిసి పరాన్నజీవి మొక్కను కనుగొన్నారు. అందుకే ఇద్దరి పేర్లు కలసి వచ్చేలా రాఫ్లేసియా ఆర్నోల్డి అని పేరు పెట్టారు.
రాఫ్లేసియా ఆర్నాల్డి ఎంత ఆకర్షణీయంగా, అందంగా ఉన్నప్పటికీ, దీనిని ‘శవం పువ్వు‘ అని కూడా అంటారు.
ప్రపంచంలోని దాదాపు 2,00,000 రకాల పుష్పాలున్నాయి. వీటిలో అతి చిన్నది డక్ వీడ్. దీనిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలుగుతాం.