రతన్ టాటా – మనమంతా జరుపుకోవాల్సిన ఒక ఉత్సవం..!

రతన్ టాటా – మనమంతా జరుపుకోవాల్సిన ఒక ఉత్సవం..!

0 0
Read Time:7 Minute, 27 Second

Ratan TaTa Air India టాటా వాళ్ళే ఇండియాలో మొదటి ఎయిర్ లైన్స్ ప్రారంభించారు. ఆ తర్వాత అది ఎయిర్ ఇండియా అయ్యి ప్రభుత్వ చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ అది టాటా వాళ్ళ చేతుల్లోకి వచ్చిన సందర్భం లో రతన్ టాటా గారి గురించి నా అభిప్రాయం. Interesting Post on TATAs

టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా. జంషెట్ టాటా కొడుకు రతన్ జంషెట్ టాటా. రతన్ జంషెట్ టాటా కి పిల్లలు లేకపోతే నావల్ అనే వ్యక్తి ని పెంచుకొని నావల్ టాటా అని పేరు పెట్టుకున్నారు. నావల్ టాటా కొడుకు రతన్ టాటా. టెక్నికల్ గా టాటా ల వారసుడు రతన్ టాటా నే, కాని నిజానికి రతన్ టాటా ఒక అనాధ కొడుకు.

రతన్ తండ్రి నావల్ సూరత్ (గుజరాత్) లో దిగువ మధ్య తరగతి కుటుంభం, 4 యేండ్ల వయస్సు లోనే అతని తండ్రి చనిపోతే తల్లి కుట్టు మిషిన్ తో వచ్చేదానితో పోషించలేక ఒక అనాధాశ్రమం లో చేర్పించారు నావల్ ని. పిల్లలు లేని రతన్ జంషెట్ టాటా భార్య నావల్ ని దత్తత తీసుకోవటం వలన నావల్ టాటా అయ్యాడు. నావల్ టాటా సోను అనే అమ్మాయి ని పెండ్లి చేసుకున్నాడు. వీరికి రతన్ టాటా పుట్టాక కొన్ని రోజులకే విడిపోయారు. ఆ తర్వాత నావల్ టాటా స్విట్జర్లాండ్ అమ్మాయి ని పెండ్లి చేసుకున్నాడు.రతన్ టాటా జీవితం లో మెలోడ్రామా లేదు గోల్డెన్ స్పూన్ తో పెరిగాడు అనుకుంటాం. స్పేస్ క్రియేట్ చేసి మెలోడ్రామా స్రుష్టించటం కరక్ట్ కాదు. కానీ చిన్నతనం లోనే తల్లిని కోల్పోయాడు, తను ఆర్కిటెక్ట్ అవుదాం అనుకుంటే తండ్రి ఇంజనీరింగ్ చేయమనేవాడు, తను అమెరికా వెళ్ళి విద్యాభ్యాసం చేయాలనుకుంటే తండ్రి ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమనేవాడు.

చివరికి రతన్ జంషెట్ టాటా (టెక్నికల్ గా తాత) ని ఒప్పించి అమెరికాలోని కార్నెగీ యూనివర్శిటీ లో చదువుకున్నాడు. అమెరికాలో చదువుకునే రోజుల్లో ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ గ్రాండ్ పేరెంట్స్ ఆరోగ్యం బాగాలేకపోతే ఇండియా తిరిగి వచ్చాడు. ఆ సమయం లో ఇండియా చైనా యుద్ధం జరుగుతుండటం తో రతన్ టాటా ని చేసుకోటానికి ఆ అమ్మాయి ఇండియా రాలేదు, వేరే వాళ్ళని చేసుకుంది. ఆ తర్వాత ఎవరిని చూసినా ఆ అమ్మాయే గుర్తు వచ్చిందో ఏమో రతన్ టాటా పెండ్లి చేసుకోలేదు (బ్రహ్మచారి).టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా కజిన్ బ్రదర్ కొడుకు JRD టాటా (JRD టాటా కి భారత రత్న కూడా వచ్చింది).

రతన్ టాటా ఇండియా వచ్చిన సమయం లో JRD టాటా నే టాటా గ్రూపు వ్యాపారాలని చూసుకునేవాడు. రతన్ టాటా కూడా మామూలు ఉద్యోగి లాగే టాటా గ్రూపు లో జాయిన్ అయ్యాడు. JRD టాటా ఆరోగ్యం బాగాలేని స్థితి లో రతన్ టాటా కి టాటా గ్రూపు పగ్గాలు అప్పగించాడు. అప్పటిదాకా కుటుంభ వ్యాపారం లాగా ఉన్న టాటా సంస్థ ని అంతర్జాతీయ సంస్థ గా తీర్చిదిద్దాడు రతన్ టాటా. ఇండియా లో ఉన్న కార్లు, విమానాలు అన్నిటినీ కొనగలడు కానీ ఇప్పటికీ ఆయన కారుని ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళతాడు రతన్ టాటా. తన సొంత సంస్థల్లోకి వెళుతుంటే అందరిలాగే తప్పనిసరిగా ఆగి తన కారు ని చెక్ చేపించుకుంటాడు.

రిలయన్స్, బిర్లా, బజాజ్ లాంటి వారి అందరి సంపద కంటే టాటా గ్రూపు సంపద ఎక్కువ. కానీ అంభానీ లు లాగా ఇండియా లో కానీ, ప్రపంచం లో కానీ టాప్ లో లేడు రతన్ టాటా కారణం ఆయన సంపదలో 60% ఎప్పుడూ దాన ధర్మాలకి వినియోగిస్తుంటాడు రతన్ టాటా.ఆసియా లో మొదటి క్యాన్సర్ హాస్పటల్ నుంచి ఇండియాలో మొదటి ఎయిర్ లైన్స్ (ఆ తర్వాత ఎయిర్ ఇండియా అయ్యింది) వరకు టాటా లే ప్రారంభించారు. టీ పొడి, ఉప్పు నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు టాటా లు లేని వ్యాపారం లేదు; సిగరెట్స్ & ఆల్కహాల్ వ్యాపారం తప్ప. గుండు సూది నుంచి గూడ్స్ రైలు ఇంజన్స్ వరకు టాటా లే నంబర్ వన్. టాటా ఇండికా వచ్చిన కొత్తలో నష్టాల్లో ఉంటే అమెరికాకి చెందిన ఫోర్డ్ మోటార్స్ కి వెళ్ళి అమ్ముతాం కొనమని అడిగితే వాళ్ళు ఎగతాళి గా మాట్లాడి పంపించినట్లు వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత అదే ఫోర్డ్ మోటార్స్ నష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు సాదరం గా ఆహ్వానించి ఫోర్డ్ వాళ్ళ లగ్జరీ కార్లు అయిన “జాగ్వార్”, “లాండ్ రోవర్” ని కొని ఫోర్డ్ మోటార్స్ కి సహాయం చేశాడు రతన్ టాటా.గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ లో ఇండియా లో మొట్టమొదట 5/5 రేటింగ్ సాధించిన కార్ టాటా వాళ్ళదే (టాటా నెక్సాన్). ఈ కార్ స్రుష్టికర్త రతన్ టాటా గారే. ఇండియా లో రిలయన్స్ తర్వాత 100 బిలియన్స్ రూపాయలు సాధించిన సంస్థ కూడా టాటా వాళ్ళ TCS నే (మార్కెట్ క్యాపిటలైజేషన్- mcap ప్రకారం). ఇలాంటివెన్నో ఉన్నాయి.

రతన్ టాటా గారి ఖాతాలో.ఇండియా కి ఏ కష్టం వచ్చినా సంపదని అంతా ఇచ్చేవాళ్ళలో రతన్ టాటా ముందు ఉంటాడు. అంభానీలు ధనవంతులు కానీ రతన్ టాటా ఐశ్వర్యవంతుడు. కష్ట పడితే అందరూ అంభానీలు అవ్వకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ రతన్ టాటా లాగా ఐశ్వర్యవంతుడు అవ్వొచ్చు. రతన్ టాటా అంటే నమ్మకం, రతన్ టాటా అంటే నిజాయతీ, రతన్ టాటా అంటే నిలువెత్తు భారతం. One of my inspiring persons Ratan Tata.రతన్ టాటా అంటే మనమంతా జరుపుకోవాల్సిన ఒక ఉత్సవం

🙏– జగన్

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *