మొబైల్‌ విప్లవం సరే.. మొదటి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఏది?

మొబైల్‌ విప్లవం సరే.. మొదటి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఏది?

0 0
Read Time:4 Minute, 33 Second

ఇపుడంటే రకరకాల ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ వచ్చేశాయి. కానీ అసలు మొట్టమొదటగా మొబైల్‌ ఫోన్‌ ఎక్కడ తయారయ్యింది? మొబైల్‌ ఫోన్‌లు క్రమానుగతంగా ఎలా మార్పులు చెందుతూ వచ్చాయి? మొట్టమొదటగా ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌ను ఉపయోగించిన మొబైల్‌ ఫోన్‌ ఏది? ఈ ప్రశ్నలకు జవాబులు కావాలంటే ఇది పూర్తిగా చదివేయండి మరి… First Android Mobile

బెల్‌ సిస్టమ్‌ Bell System అనే కంపెనీ మొట్టమొదటి మొబైల్‌ ఫోన్‌ను తయారుచేసింది. 1946లో మొట్టమొదటి మొబైల్‌ ఫోన్‌ తయారయ్యింది. అమెరికాలోని మిస్సోరిలో గల సెయింట్‌ లూయిస్‌లో ఈ ఫోన్‌ తయారయ్యింది. అప్పట్లో ఇవి కార్లలో ఉపయోగించేవారు. ఆ తర్వాత అనేక ప్రయోగాలు జరిగాయి.

కార్లలో కాకుండా బయట మొబైల్‌ ఫోన్‌ను ఉపయోగించింది 1973 ఏప్రిల్‌ 3న. మోటారోలా Motorola కు చెందిన మార్టిన్‌ కూపర్‌ Martin Cooper బెల్‌ ల్యాబ్స్‌కు చెందిన జోయల్‌ ఎస్‌ ఎంగెల్‌తో మొట్టమొదటి మొబైల్‌ ఫోన్‌కాల్‌ చేసి మాట్లాడారు. ఈ కాల్‌ మాట్లాడిన మొబైల్‌ ఫోన్‌ 900 గ్రాముల బరువుంది. దాని ధర 3,395 డాలర్లు. రూపాయలలో చెప్పాలంటే రూ. 2,49,537.

మొదట్లో మొబైల్స్‌ వాడకంలో అనేక సమస్యలు తలెత్తేవి. ధరలు చాలా ఎక్కువ ఉండేవి. నెట్‌వర్క్‌ చాలా సమస్యగా ఉండేది. 1983లో 1జి నెట్‌వర్క్‌ మొదలయ్యింది. అయితే ఫోన్‌ సైజు చాలా పెద్దదిగా ఉండేది. వినియోగించడానికి అంత సౌకర్యంగా ఉండేది కాదు. 1991లో 2జి నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చింది. ఫోన్‌ సైజు తగ్గింది. స్మార్ట్‌ఫోన్‌లు మొదలయ్యాయి. 2001లో 3జి టెక్నాలజీ ప్రారంభమయ్యింది. ఆ తర్వాతే ఫోన్‌ల మార్కెట్‌ రాకెట్‌ వేగాన్ని అందుకుంది. 2003లో నోకియా 1100 మోడల్‌ను లాంచ్‌ చేశారు. అప్పట్లో అది అత్యంత పాపులర్‌ మోడల్‌. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయి. 2011 నాటికి యాపిల్‌ కంపెనీ మొబైల్‌ మార్కెట్‌ను శాసించే స్ధితికి చేరుకుంది.

Also Read : Instrument strings వేటితో తయారుచేస్తారో తెలుసా..

ఆండ్రాయిడ్‌ Android సిస్టమ్‌ మొబైల్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఆండీ రూబిన్, రిచ్‌ మినర్, నిక్‌ సియర్స్, క్రిస్‌ వైట్‌ 2003 అక్టోబర్‌లో ఆండ్రాయిడ్‌ కంపెనీని స్థాపించారు. 2005లో గూగుల్‌ దీనిని కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2007లో లైనక్స్‌ బేస్డ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ఈ రంగాన్ని గూగుల్‌ శాసించింది. ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌ను జనం ఎంతగా ప్రేమించారో మాటల్లో చెప్పలేం. 2012 నాటికి రోజుకు 15 లక్షల యాక్టివేషన్స్‌ జరిగేవి. వందకోట్ల ఆండ్రాయిడ్‌ యాప్స్‌ Android Apps అందుబాటులోకి వచ్చాయి. ఆండ్రాయిడ్‌ యాప్‌ సైట్‌ గూగుల్‌ ప్లే Google Play. నుంచి 2500 కోట్ల యాప్‌లు డౌన్‌లోడ్‌ అయ్యాయి.

2013 నాటికి కెమెరాలు, వాచీల అవసరం తీరిపోయింది. వాటి స్థానాన్ని మొబైల్‌ ఫోన్లు భర్తీ చేసేశాయి. టైమ్‌ చూసుకోవడానికి, ఫొటోలు – వీడియోలు తీయడానికి వాచీలు, కెమెరాలతో పనిలేకుండా పోయింది.

First Android Mobile HTC – Dream

ప్రపంచంలో మొట్టమొదటసారిగా ఆండ్రాయిడ్‌ ఉపయోగించిన ఫోన్‌ ఏది? ఈ విషయం తెలుసుకోవాలని మీకు ఆసక్తిగా ఉందా? అది హెచ్‌టిసి డ్రీమ్‌ HTC Dream ఫోన్‌. 2008 అక్టోబర్‌లో అమెరికాలో ఈ ఫోన్‌ విడుదలయ్యింది. దాని ధర 179 డాలర్లు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *