AP Tourism లో ఎన్ని రకాల అవకాశాలున్నాయంటే…

AP Tourism లో ఎన్ని రకాల అవకాశాలున్నాయంటే…

0 0
Read Time:9 Minute, 5 Second

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగం AP Tourism )లో అపార అవకాశాలు ఉన్నాయని.. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరారు. బెంగళూరులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల పర్యాటక, సాంస్కృతిక శాఖల సదస్సుల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణాదిలో ఏపీ ప్రత్యేక రాష్ట్రమని పర్యాటకానికి అపార అవకాశాలున్నాయని అన్నారు. రాష్ట్రంలోని సాంస్కృతిక వైభవం, సంస్కృతీ, సంప్రదాయాలను చాటే విశేషాలెన్నో ఉన్నాయన్నారు. నేడు పర్యాటకులంతా ఆన్ లైన్ విధానంలోనే టూరిజం ప్యాకేజీలు తీసుకుంటున్నారని.. ఈ రంగంలో డిజిటలైజేషన్, ఉద్యోగావకాశాలు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటకరంగ అభివృద్ధికి స్పాన్సర్స్ సాయం తీసుకుంటే టూరిజంను మరింత అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించొచ్చని.. కేంద్రం ఈ దిశగా దృష్టి సారించాలని మంత్రి కోరారు.


ఆంధ్రప్రదేశ్ పర్యాటకం AP Tourism
లో..
ఏపీని పర్యాటకంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక ప్రణాళికలు వేస్తున్నారని.. ఇందులో భాగంగా 2020-2025కి గానూ ఏపీ టూరిజం అభివృద్ధికి నూతన పాలసీ తీసుకొచ్చారని మంత్రి తెలిపారు. ఇటివలే ఒబెరాయ్ సంస్థ రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రదేశాల్లో 7స్టార్ హోటల్స్ నిర్మించేందుకు ముందుకొచ్చిందని అన్నారు. ఇప్పటికే రుషికొండ బీచ్ కు బ్లూఫాగ్ సర్టిఫికెట్ వచ్చిందని మరో 9 బీచ్ లను కూడా అభివృద్ధి చేస్తున్నామని.. ఇందుకు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్వ్ మెంట్ అనుమతులు ఇప్పించాలని కోరారు. క్రూయిజ్, సీప్లేన్ ద్వారా టూరిజంను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాయలసీమ, అరకు, మారేడుమిల్లి సర్క్యూట్, అమరావతి సర్క్యూట్, అనుపు(నాగార్జునసాగర్), బావికొండ-తొట్లకొండ జరుగుతున్న టూరిజం అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు.

Also Read : ఏపీకి కొత్తగా పర్యాటక ప్రాజెక్టులు.. 48వేల ఉద్యోగాలు

ఇండస్ట్రీ సెక్టర్ లోకి పర్యాటకం..!
పర్యాటకాన్ని AP Tourism ఇండస్ట్రీ సెక్టార్ లోకి తీసుకురావాలని.. కేంద్రం ఆదిశగా ఆలోచించాలని మంత్రి కోరారు. ఇటివల కొందరు స్పాన్సర్స్ కూడా ఇదే విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారనే విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ.. గత రెండేళ్లుగా కరోనా కారణంగా దేశంలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగమే ఎక్కువగా నష్టపోయిందని మంత్రి అన్నారు. ఇండస్ట్రీ సెక్టర్ కు కేంద్రం ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్న కారణంగా.. పర్యాటక రంగాన్ని కూడా ఇందులోకి తీసుకొస్తే.. దేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అవకాశాలను మెరుగుపరచుకోవడమే కాకుండా దేశ జీడీపీ కూడా పెరుగుతుందని అన్నారు.

సాంస్కృతిక శాఖ: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఆడిటోరియమ్స్ నిర్మాణానికి 395.50 కోట్లు కేటాయించాలని కోరారు.
పర్యాటక శాఖ:
• క్రూయిజ్ టూరిజంలో భాగంగా విశాఖపట్నం నుంచి శ్రీలంక (కాకినాడ, మచిలీపట్నం, నెల్లూరు, చెన్నై)కు 200 కోట్లు కేటాయించాలని కోరారు.
• నదుల్లో బ్యాక్ వాటర్ వచ్చే సమయంలో క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి 200 కోట్లు కేటాయించాలని కోరారు.
• విశాక నుంచి అరకువ్యాలీకి కిరండోల్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ లో అదనపు విస్టాడోమ్ కోచ్ లను ఏర్పాటుకు 30కోట్లు కేటాయించాలని కోరారు.
• ట్రైబల్ ఏరియాల్లో యాత్రి నివాస్ కాంప్లెక్స్ నిర్మాణానికి 200 కోట్లు కేటాయించాలని కోరారు.
• గండికోట, భవానీ ఐలాండ్, అనంతగిరి నుంచి అరకువ్యాలికి రోప్ వే నిర్మాణాలకు 200కోట్లు కేటాయించాలని కోరారు.
• ఏపీలో సుదీర్ఘంగా ఉన్న 974కి.మీ కోస్టల్ తీరప్రాంతంలో టూరిజం అభివృద్ధికి (భీమిలీ-భోగాపురం) సుమారు 600 కోట్లు కేటాయించాలని కోరారు.
పురావస్తు శాఖ: రాష్ట్రంలోని మ్యూజియంల అభివృద్ధికి గ్రాంట్ రూపంలో నిధులు కేటాయించాలని కోరారు. ఇందులో భాగంగా.. రాజమహేంద్రవరంలో ‘హిస్టారికల్ హెరిటేజ్ సిటీ’కి 400 కోట్లు, రాళ్లబండి సుబ్బారావు మ్యూజియమ్ నిర్మాణానికి 10 కోట్లు కేటాయించాలని కోరారు. వైఎస్సార్ కడప జిల్లా మైలవరంలో DAM సైట్ మ్యూజియం నిర్మాణం కోసం 10 కోట్లు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని పలు మ్యూజియంలలో ఉన్న పురాతన వస్తువులను పరిరక్షించేందుకు 1.53 కోట్లు కేటాయించాలని కోరారు. అనంతపురంలో పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు మెమోరియల్ ఆర్కియాలాజికల్ మ్యూజియమ్ నిర్మాణానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న 2.86 కోట్లు కేటాయించాలని కోరారు.
టెంపుల్ టూరిజం: (ప్రసాద్ స్కీమ్)
• ద్వారకాతిరుమల దేవస్థానం.. 83.33 కోట్లు
• శ్రీకాకుళంలోని శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానం.. 55కోట్లు
• విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం.. 74.86 కోట్లు
• శ్రీకాళహస్తీశ్వర దేవాలయం.. 82 కోట్లు
• పుట్టపర్తిలో అభివృద్ధి పనుల కోసం.. 753 కోట్లు
• నెల్లూరు జిల్లాలోని వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం.. 49 కోట్లు
• ప్రకాశం జిల్లా మోటుపల్లిలోని పురాతన ఓడరేవులో టూరిజం పరంగా మౌలిక సదుపాయాల కోసం.. 20.10 కోట్లు కేటాయించాలని కోరారు.
టూరిజం (స్వదేశ్ దర్శన్):
• రాయలసీమ సర్క్యూట్ లో భాగంగా టూరిజం అభివృద్ధికి.. 136.85 కోట్లు
• అరకు సర్యూట్ లో ఎకో టూరిజంలో భాగంగా.. 128.70 కోట్లు
• రాజమహేంద్రవరం హెరిటేజ్, సర్క్యూట్ (అఖండ గోదావరి)లో భాగంగా.. 122.58 కోట్లు
• కోల్లేరు ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి 187.70 కోట్లు కేటాయించాలని కోరారు.
కార్యక్రమంలో భాగంగా మంత్రి పలువురిని సన్మానించారు. ఈ సదస్సులో ఏపీటీడీసీ చైర్మన్ అరిమండ వరప్రసాదరావు, ఏపీటీడీసీ ఎండీ ఎస్.సత్యనారాయణ, సాంస్కృతిక శాఖ సంచాలకు మల్లికార్జున రావు పాల్గొన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *