వెంకన్న దర్శనం అంత వీజీ కాదు.. కొత్త కండిషన్‌ ఇదే…

వెంకన్న దర్శనం అంత వీజీ కాదు.. కొత్త కండిషన్‌ ఇదే…

0 0
Read Time:3 Minute, 25 Second

రెండు డోసులు వ్యాక్సిన్‌ వేయించుకుంటేనే దేశంలోకి రానిస్తామని అమెరికా వంటి కొన్ని దేశాలు ఆంక్షలు పెడుతుండడం చూశాం. అలాగే రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికే మందు అందిస్తామని కొన్ని రాష్ట్రాలు కండిషన్‌ పెడుతుండడం గురించి కూడా విన్నాం. ఇపుడు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త కండిషన్లలోనూ చేరింది. దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్‌ పూర్తయిన సర్టిఫికెట్‌ తెచ్చుకోవలసిందేనని టీటీడీ స్పష్టం చేసింది. లేదా కరోనా నెగిటివ్‌ సర్టిఫికెట్‌ అయినా వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వ్యాక్సిన్‌ ఎంత ముఖ్యమో తెలియజెప్పడానికే ఈ కండిషన్‌ అమలు చేస్తున్నట్లు టీటీడీ అధికారులంటున్నారు. Vaccination TTD condition


తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం సెప్టెంబర్‌ 25 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ దాకా రోజుకు ఎనిమిది వేల సర్వ దర్శనం టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు.


సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌ లో అందుబాటులోకి వచ్చిన తర్వాత, సెప్టెంబరు 26 వ తేదీ నుంచి తిరుపతి లో ఆఫ్‌ లైన్లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపి వేస్తామని ఆయన తెలిపారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Vaccination TTD condition తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న సర్టిఫికెట్‌ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్‌ సర్టిఫికెట్‌ గానీ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని చైర్మన్‌ వివరించారు. కోవిడ్‌ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.అక్టోబరు నెలకు సబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ 300 టికెట్లు సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్‌ లో విడుదల చేస్తామని చైర్మన్‌ తెలిపారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *