Pushpa The Rise అంతా హైప్.. సినిమా అట్టర్ ఫ్లాప్.. చెప్పినంత ఏమీ లేదు.. ఇలా పనిగట్టుకుని మరీ చానళ్లు, వెబ్ పేజీలు నెగెటివ్ ప్రచారాన్ని హోరెత్తించాయి. పుష్ప ఫస్ట్ పార్ట్‌పై జరిగిన నెగెటివ్ ప్రచారం అంతా ఇంతా కాదు.. కానీ మూడు రోజులు తిరిగే సరికి అంతా మారిపోయింది.

భారత్‌లోనే 2021లో బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప రికార్డు సృష్టించింది. మూడు రోజుల్లో రూ. 173 కోట్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే సరికి అందరి నోళ్లూ మూత పడ్డాయి. పాన్ ఇండియా మూవీగా మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకున్న పుష్ప టీమ్ ఇపుడు ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఎర్నేని సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కలెక్షన్ల వివరాలను వెల్లడించారు. ‘‘ఈనెల 17న విడుదలైన మా చిత్రం పుష్ప ఆల్‌టైమ్ బ్లాక్ బస్టర్ రికార్డు సృష్టించింది. అన్ని చోట్లా సెన్సేషనల్ నెంబర్స్ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలే కాక ఓవర్సీస్లోనూ రికార్డులు సృష్టిస్తోంది. రూ.173 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. వీకెండ్ మాత్రమే కాదు సోమవారం మార్నింగ్ షో కూడా కలెక్షన్ తగ్గలేదు.’’ అని పేర్కొన్నారు.
ఇక కలెక్షన్ల గురించి ఆయన వివరిస్తూ.. ‘‘కేరళలో అల్లు అర్జున్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే అక్కడ కూడా ఎప్పుడూ లేనంత స్థాయిలో మొదటి మూడు రోజుల్లో రూ. 6 కోట్లు వసూలు చేసింది. తమిళనాడులో రూ.12 కోట్లు, కర్నాటకలో రూ.10 కోట్లు, హిందీలో రూ. 12 కోట్లు, తెలుగు రూ.2 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్లో దాదపు 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.’’ అని తెలిపారు. చిత్ర విజయం పట్ల అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విజయాన్ని తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.పెద్ద హిట్ అవుతుందనుకున్నామని, అయితే ఇంత స్థాయిలో భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఊహించలేదని అన్నారు.
అయితే పుష్ప సినిమా తొలి రోజు నుంచీ నెగెటివ్ టాక్ నడిచింది. అన్ని వెబ్ సైట్లలోనూ తక్కువ రేటింగ్ ఇచ్చారు. రివ్యూలు కూడా అంత బాగోలేదని, యావరేజ్ అని రాశారు. ఒక వర్గం మీడియా కావాలని నెగెటివ్ టాక్‌కు ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది. అయితే సినిమాలో దమ్ము ఉండడంతో అన్ని అవాంతరాలను అధిగమించి ముందుకు సాగుతోంది. సినిమా విడుదలైన తర్వాత సుకుమార్ మీడియా ముందుకు రాకపోవడంపై కూడా నెగెటివ్ ప్రచారం నyì చింది. ఫ్లాప్ టాక్ చూసి బయటకు రావడం లేదని ప్రచారం చేశారు. కానీ 15 రోజుల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిద్ర లేకుండా గడిపిన సుకుమార్ రెస్ట్ తీసుకుంటున్నారని, విజయాన్ని ఆయనతోపాటు యూనిట్ అంతా ఎంజాయ్ చేస్తోందని నిర్మాత వెల్లడించారు.
Mythri Movie Makers@MythriOfficial Tweet
Pushpa Raj rage at the Box Office continues MASSive 173 CR 3 days Gross Worldwide for #PushpaTheRise#PushpaBoxOfficeSensation@alluarjun@iamRashmika@aryasukku@ThisIsDSP@adityamusic@TSeries@PushpaMovie