పూనమ్‌ కౌర్‌ ‘పవర్‌’ ఫుల్‌ ట్వీట్స్‌.. త్వరలో రచ్చ రంబోలా..

పూనమ్‌ కౌర్‌ ‘పవర్‌’ ఫుల్‌ ట్వీట్స్‌.. త్వరలో రచ్చ రంబోలా..

0 0
Read Time:5 Minute, 7 Second

పంజాబ్‌ పిల్ల పూనమ్‌ కౌర్‌ ట్విట్టర్‌లో రచ్చ చేసేస్తోంది. వరుస ట్వీట్లతో ( Poonam kaur tweets ) అదరగొడుతోంది. ఆమె ట్వీట్స్‌ అన్నీ నర్మగర్భంగా ఉంటున్నా తరచి చూస్తే నిగూఢార్థం బోధపడుతుందని విశ్లేషకులంటున్నారు. పూనమ్‌ కౌర్‌ ఆన్‌లైన్‌లో చాలా యాక్టివ్‌గానే ఉంటుంది. ట్విట్టర్‌లో ఆమెకు ఫాలోయర్స్‌ కూడా ఎక్కువే. సామాజిక స్పృహ కూడా ఉన్న అందమైన అతి కొద్దిమంది హీరోయిన్లలో పూనమ్‌ ఒకరు. ఇక ఆమె ట్వీట్ల విషయానికొస్తే..

ఇటీవలి రిపబ్లిక్‌ సినిమా Republic Movie ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ తర్వాత మళ్లీ పూనమ్‌ కౌర్‌ వార్తల్లోకి వచ్చారు. ఆ ఫంక్షన్‌లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ Pawan Kalyan ఆవేశపూరిత ప్రసంగం, సినిమాలతో పాటు రాజకీయ వ్యాఖ్యలు చేయడం తెలిసిన విషయాలే. వాటికి వైఎస్సార్సీపీ నాయకులు కౌంటర్‌ ఇవ్వడమూ మనం విన్నాం. అయితే ఇదే సమయంలో పవన్‌ కల్యాణ్‌ కు కౌంటర్‌ ఇస్తూ నటుడు పోసాని కృష్ణ మురళి పాత వివాదాన్నొకటి తెరపైకి తెచ్చారు. అదే పూనమ్‌ కౌర్‌ విషయం. ఆమెకు ఇండస్ట్రీ ప్రముఖుడొకరు తీవ్ర అన్యాయం చేశారని, డబ్బు ఇచ్చి అప్పటికేదో సరిచేసుకున్నారని దాని సారాంశం. వేషాలిప్పిస్తాన ని ఆశచూపి కడుపు చేశారని, ఆ తర్వాత రూ.5 కోట్లు ఇచ్చి ఆమె నోరు మూయించారని ఆరోపించారు. ఇది ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌గా మారింది.

Also Read : Pawan Kalyan in Republic event సంచలన కామెంట్స్‌ ఇవే..

ఇదే సమయంలో పూనమ్‌ కౌర్‌ ట్వీట్లు Poonam kaur tweets కూడా వైరల్‌గా మారాయి.

POONAM KAUR TWEETS
  1. రిపబ్లిక్‌ ఫంక్షన్‌ జరిగిన మర్నాడు చేసిన ట్వీట్‌లో ఆమె ఓ గుడిలో దైవదర్శనం చేసుకుంటున్న ఫొటో పెట్టి ఒక ఆసక్తి కరమైన వ్యాఖ్య చేశారు. ‘ఆత్మగౌరవం ఉన్నవాడెవడూ ఆవేశంగా మాట్లాడడు’ అని పోస్ట్‌ చేశారు. దీని గురించి ప్రత్యేకంగా వివరించనక్కరలేదు.. ఇది ఎవరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యో చెప్పనక్కరలేదు.
  2. దాసరి నటించిన రౌడీ దర్బార్‌ లోని ఒక పాటను ట్వీట్‌ చేశారు. చంద్రలోకం పార్టీ, ఇంద్రలోకం పార్టీ.. మీ పార్టీలో రౌడీలను చేర్చకండయా అంటూ ఆ పాట సాగుతుంది. మళ్లీ జనసేన, టీడీపీ దగ్గరవుతాయని వస్తున్న వార్తల నేపథ్యంలో టీడీపీని ఉద్దేశించి ఈ పాట పెట్టినట్లుగా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
  3. ఇండస్ట్రీలో ఒకే ఒక గురువు దాసరిగారు. ఐ మిస్‌ యు.. మీరు తండ్రి లాంటి వారు. అంటూ దాసరి నారాయణరావు ఫొటో పెట్టి ఒక ట్వీట్‌ చేశారు. ఇపుడు దాసరి జయంతి, లేదా వర్థంతి కాదు.. ఆమెకు పాత విషయాలేవో గుర్తుకొచ్చి దాసరిని గుర్తుచేసుకున్నారు. ఈ ట్వీట్‌ను ఆమె తన ట్విట్టర్‌ అకౌంట్‌లో టాప్‌లో పిన్‌ చేశారు.
  4. ఇక పూనమ్‌ కౌర్‌ తాజా పోస్టు మరీ సంచలనంగా మారింది. ప్రకాష్‌ రాజ్‌ Praash Raj ను, మా ఎన్నికలను Maa Elections ఉద్దేశించి ఆమె ఈ పోస్టు పెట్టారు. ‘‘మా ఎన్నికలలో ప్రకాష్‌ రాజ్‌ సర్‌ గెలవాలని కోరుకుంటున్నా.. చాలా కాలంగా మౌనంగా ఉన్నా.. ఆయన గెలిస్తే నేను ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువస్తా.. ఆయన ఒక్కడే రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి.. రాజకీయాలలో జోక్యంచేసుకోరు. ఆ తర్వాత పెద్దల మీద గౌరవం ఉంచి వారు ఏమి నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటా..’’ అని పూనమ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌లో పూనమ్‌ తన బాధనంతా బయటపెట్టారు. ప్రకాష్‌ రాజ్‌ అయితేనే తనకు న్యాయం చేయగలుగుతారని, రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకుల వత్తిళ్లను తట్టుకుని మరీ తన సమస్యను పరిష్కరించగలుగుతారని పూనమ్‌ భావిస్తున్నట్లు అర్ధమౌతుందని విశ్లేషకులంటున్నారు. దీనిని బట్టి మా ఎన్నికల తర్వాత మరిన్ని సంచలనాలు ఉంటాయని భావించవచ్చు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *