మా ఎన్నికలలో సంచలనాలకు కొదవ లేదు. ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా శివబాలాజీ చెయ్యి కొరికి హేమ కలకలం సృష్టించగా బ్రహ్మానందం రిగ్గింగ్ చేస్తున్నాడంటూ విష్ణు జోక్ పేల్చి నవ్వులు పూయించాడు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా వరుస ట్వీట్లతో సంచలనం సృష్టిస్తున్న పంజాబ్ పిల్ల పూనమ్ కౌర్ పనులన్నీ మానుకుని మరీ మా ఎన్నికలలో ఓటు వేయడానికి వచ్చింది. ఓటు వేసి వెళుతుంటే విలేకరులు ఊరుకుంటారా.. వెంటపడి మరీ ఒపీనియన్ అడిగారు.. Poonam kaur Latest
‘‘రాజకీయ లబ్ధి కోసం ఆర్టిస్టులను సతాయించడం మానుకోవాలి అని కోరుకుంటున్నాను’’ అని పూనమ్ చెప్పింది. ‘‘ఏ ప్యానెల్ గెలిచినా దయచేసి రాజకీయ పరిస్థితిని, రాజకీయాలను అర్ధం చేసుకోండి. దయచేసి రాజకీయ నాయకుల స్వార్థానికి మా అసోసియేషన్‌ను బలిచేయకండి’’ అని పూనమ్ వ్యాఖ్యానించింది.
పూనమ్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవో వేరే చెప్పనక్కరలేదు. పేరు పెట్టి చెప్పకపోయినా ఆమె ఎవరి ‘రాజకీయానికి’ బలి అయిపోయిందో వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని తెలుస్తూనే ఉంది.
బొంబాయిలో ఉన్న జెనీలియా, న్యూఢిల్లీలో ఉంటున్న జయప్రద మా ఎన్నికలలో ఓటు వేయడం కోసమే హైదరాబాద్ వచ్చారు. వారిలానే పూనమ్‌కౌర్‌ను కూడా విష్ణు ప్యానెల్ ప్రత్యేకంగా రప్పించిందా లేక ఆమె అంతట ఆమే వచ్చారా అన్న స్పష్టత లేదు. కానీ పూనమ్ కౌర్ మాత్రం మెగాఫ్యామిలీ ప్రత్యేకించి పవన్ కల్యాణ్ మద్దతిస్తున్న ప్యానెల్‌ను ఓడించడం కోసమే తన ఓటును వినియోగించుకున్నారని మాత్రం సినీమా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.