MAA Winners మా విజేతల ‘మూలాలు’ తెలుసా..?

MAA Winners మా విజేతల ‘మూలాలు’ తెలుసా..?

0 0
Read Time:4 Minute, 29 Second

మా ( MAA Movie Artists Association ) ఎన్నికలు పూర్తయ్యాయి. విజేతలెవరో అందరికీ తెలిసిపోయింది. అయితే విజేతల MAA Winners గురించి మనకు పూర్తిగా తెలుసా..? మనకు తెలియని విషయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు విష్ణు ఇంటిపేరు మంచు అని మనకు తెలుసు.. మరి మిగిలినవారి సంగతి? అలాగే ప్రకాష్‌ రాజ్‌ తెలుగువాడు కాడని మనకు తెలుసు.. అంతమాత్రాన మిగిలిన వారందరూ తెలుగువారేనా.. అంటే ఇక్కడ పుట్టిన వారేనా.. ? మరి ఎవరు ఎక్కడ పుట్టారు.. మనకు తెలియన అలాంటి కొన్ని కొత్త విషయాలు ఇక్కడ చూడవచ్చు. అవేమిటో మీరే చూసేయండి…


“ప్రకాశ్‌ రాజ్‌ గెలవకపోయినా, కర్ణాటకలో పుట్టిపెరిగిన శ్రీకాంత్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అయ్యాడు! మనోళ్లకేమీ అంత లోకల్‌ ఫీలింగ్‌ లేనట్టేగా? కుటుంబ మూలాలు కృష్ణా జిల్లాలో ఉన్నా, కర్ణాటక కొప్పళ జిల్లా గంగావతిలో పుట్టిపెరిగిన పూర్వ హీరో మేకా శ్రీకాంత్, తెలంగాణకు పక్కా లోకల్‌ అయిన సీనియర్‌ నటుడు పల్లి బాబూ మోహన్‌ను ఓడించాడు. అధ్యక్ష కార్యదర్శల తర్వాత ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీ చేసిన ‘నాన్‌ లోకల్‌’ తెలుగు నటుడు శ్రీకాంత్‌ 106 ఓట్ల మెజారిటీతో దళిత మూలాలున్న బాబూ మోహన్‌ను ఓడించడం తెలుగువాళ్లకు ‘లోకల్‌ ఫీలింగ్‌’ లేదని, ‘కుల చైతన్యం’ కూడా ‘చాలా తక్కువని’ చెబుతోంది. MAA Winners

అధ్యక్ష పదవికి పోటీచేసిన చిత్తూరు జిల్లా మాజీ డ్రిల్లు మాస్టారి కొడుకు మంచు విష్ణు, బెంగళూరులో పుట్టిపెరిగిన ప్రకాశ్‌ రాజ్‌ను ఓడించింది కూడా 107 ఓట్ల తేడాతోనే.

తమిళనాడుకు చెందిన శివబాలాజి– కోశాధికారి పదవిని ఏలూరు సమీపంలోని ఎల్వీ ప్రసాద్‌ గారి ఊళ్లో పుట్టి పెరిగిన, ఇంకా పూర్తిగా మనోడని చెప్పుకోగలిగిన వెల్లంకి నాగినీడును ఓడించి, సాధించడం కూడా సినిమా రంగంలో లోకల్, కాస్ట్‌ ఫీలింగులు ‘బాగా విస్మరించదగ్గ’ స్థాయిలో ఉన్నాయని నిరూపిస్తోంది.

ఖమ్మం జిల్లావాడైన బాబూమోహన్‌ 1996లోనే పొరుగు జిల్లా తూర్పుగోదావరి అమలాపురం లోక్‌ సభ, ముమ్మిడివరం (ఉప ఎన్నిక) అసెంబ్లీ సీట్ల నుంచి ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీ పార్వతి నాయకత్వంలోని అప్పటి ఎన్టీఆర్‌ తెలుగుదేశం తరఫున పోటీచేసి ఘోరంగా ఓడిపోయి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ రెండూ సీట్లు ఎస్సీలకు రిజర్వ్‌ చేసినవే. చివరికి తెలుగుదేశంలో చేరి తెలంగాణ ప్రాంతమైన ఆందోల్‌ (ఎస్సీ) నుంచి 1999లో గెలిచి ఎన్‌ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు బాబూమోహన్‌. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాల తర్వాత 2014లో టీఆర్‌ఎస్‌లో చేరి గెలిచినా, 2018లో పార్టీ టికెట్‌ రాక బీజేపీలో చేరారు. మెదక్‌ జిల్లా ఆందోల్‌ లో రెండుసార్లు గెలిచి, రెండుసార్లు ఓడిన బాబూమోహన్‌కు ఐదోసారి పోటీలో కనీసం రెండు శాతం ఓట్లూ రాలేదు. ఈ నేపథ్యంలో బలమైన మంచు విష్ణు ప్యానల్‌ లో చేరి ‘మా’ ఎన్నికల్లో పోటీచేశారు. అన్ని రకాలా నాన్‌ లోకల్‌ నటుడు, మెగాస్టార్‌ కు ‘మూడో తమ్ముడు’ అనుకునే శ్రీకాంత్‌ చేతిలో ఓటమి బాబూమోహన్‌కు ఊహించనిదేనా?”

  • నాంచారయ్య మెరుగుమాల
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *