చిరు – అరవింద్‌ మధ్య గ్యాప్‌ సైజు ఎంత..?

చిరు – అరవింద్‌ మధ్య గ్యాప్‌ సైజు ఎంత..?

0 0
Read Time:3 Minute, 48 Second

మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ మధ్య గ్యాప్‌ ఉందా.. ఉంటే అది ఎంత? ఎందుకు వచ్చింది? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇపుడు అభిమానులను వేధిస్తున్నాయి. వెంటవెంటనే జరిగిన రెండు సినిమా ఫంక్షన్లను చూస్తే ఈ గ్యాప్‌ గురించి అర్ధమౌతుందని సినీ విశ్లేషకులంటున్నారు. సరిలేరు నీకెవ్వరూ ఫంక్షన్‌కు హాజరైన చిరంజీవి తన మేనల్లుడు బన్నీ ఫంక్షన్‌కు రాలేదు. ఫంక్షన్‌లో బన్నీ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్‌ అయిపోయాడు. దీనిని బట్టి ఆ రెండు కుటుంబాల మధ్య ఏదో గ్యాప్‌ వచ్చినట్లుందని సినిమా వర్గాలంటున్నాయి. ఈ రెండు ఫంక్షన్లలో చిరు, బన్నీ మాటలను ఓ మారు పరికిస్తే గ్యాప్‌ గురించి కొంచెం అర్ధమౌతుందని అంటున్నారు..

సరిలేరు నీకెవ్వరూ ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌కు హాజరైన మెగాస్టార్‌ చిరంజీవి మహేష్‌బాబును, ఆయన తండ్రి ఒకప్పటి సూపర్‌స్టార్‌ కృష్ణను ఆకాశానికెత్తేశారు. సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుకు అన్ని విధాలా అర్హుడైన వారు కృష్ణ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఆ అవార్డు ఆయనకు వెంటనే ఇవ్వాలని కూడా సినిమా ఫంక్షన్‌ సాక్షిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేశారు. 350 సినిమాలలో హీరోగా నటించిన కృష్ణకు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఇస్తే ఆ అవార్డుకే గౌరవం దక్కినట్లవుతుందని కూడా చిరు వ్యాఖ్యానించారు…

సరిలేరు నీకెవ్వరూ ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ జరిగిన మర్నాడే చిరు మేనల్లుడు, అల్లు అరవింద్‌ కొడుకు అల్లు అర్జున్‌ సినిమా అల వైకుంఠ పురిలో.. ఆడియో ఫంక్షన్‌ జరిగింది. ఆ ఫంక్షన్‌కు చిరంజీవి హాజరు కాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫంక్షన్‌ చివర్లో మాట్లాడిన అల్లు అర్జున్‌ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యాడు. ఆయనకు ఎప్పుడూ థాంక్స్‌ చెప్పలేదని అంటూ స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకున్నారు. తన తండ్రి చాలా గొప్పవాడని చెబుతూ దక్షిణ భారతదేశంలోనే నెంబర్‌ ఒన్‌ ప్రొడ్యూసర్‌ అయిన తన తండ్రికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం సముచితంగా ఉంటుందని అన్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ విజ్ఞప్తి చేస్తున్నానని, కేంద్రానికి ఎవరు సిఫార్సు చేసినా పరవాలేదని అర్జున్‌ వ్యాఖ్యానించాడు. అంతేకాక తన తండ్రిని అందరూ అపార్ధం చేసుకుంటుంటారని, వాస్తవానికి ఆయనంత మంచివారు లేరని అన్నాడు. చూస్తుంటే అల్లు అరవింద్, చిరంజీవి కుటుంబాల మధ్య ఏదో చిన్న గ్యాప్‌ వచ్చినట్లు కనిపిస్తున్నదని సినిమా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *